S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

11/03/2016 - 03:36

పాకిస్తాన్ ‘రేంజర్లు’- అనుబంధ సైనికులు నిర్లజ్జగా బీభత్సకాండకు పూనుకుంటున్నారు. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అధీనరేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి-వద్ద ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది నిరాయుధ పౌరులు మరణించడం పరాకాష్ఠ. ఈ పాకిస్తానీ ‘సైనికులు’ జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రజలు గాయపడడం ఉగ్రచర్యల తీవ్రతకు నిదర్శనం.

11/02/2016 - 08:21

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జైలు నుంచి ఎనిమిది మంది జిహాదీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోవడం కేవలం ఈ జైలులోని భద్రతా రాహిత్యానికి సంబంధించిన వ్యవహారం. దేశ భద్రతా కుడ్యంలో నానాటికీ పెరుగుతున్న ‘రంధ్రాల’కు ఇది ఒక నిదర్శనం మాత్రమే. తప్పించుకొని పారిపోయిన దుండగులు జైలు కాపలాదారులలో ఒకడైన రామ్‌శంకర్ అనే హవల్‌దార్‌ను గొంతుకోసి చంపడం భద్రత భంగపడిందనడానికి మరో నిదర్శనం.

11/01/2016 - 07:12

కొత్త న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మొండిపట్టుదలతో వ్యవహరిస్తూ దేశంలో ఓ ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతున్నట్టు వాదనలు బలం పుంజుకుంటున్నాయి. ఇరు పక్షాలు ఇలా గిరి గీసుకుని వ్యవహరించటం న్యాయ వ్యవస్థ పునాదులను కదిలించివేస్తోంది.

11/01/2016 - 07:07

సర్దార్ వల్లభ భాయి పటేల్ జయంతి ఉత్సవాలు వారం రోజులపాటు దేశవ్యాప్తంగా జరుగుతుండడం దేశ భద్రత పట్ల, వౌలిక జాతీయ అస్తిత్వం పట్ల పెరుగుతున్న ధ్యాసకు నిదర్శనం.. బ్రిటన్ దురాక్రమణ ముక్త భారతదేశానికి సమైక్య స్వభావ ప్రదాయకుడు వల్లభ భాయి పటేల్, సమగ్రతా స్వరూప సంధాయకుడు సర్దార్ పటేల్! రాజకీయం, రాజ్యాంగం, మతం, భాష, ఆహారం, ఆహార్యం, భావజాలం, అనుభూతుల సమాహారం- ఇదీ, ఇలాంటి ఇంకెన్నో అంశాలు వౌలిక జాతీయతలో భాగం.

10/29/2016 - 04:22

సెక్యులరిజమ్- అన్న ఆంగ్లపదానికి ‘సర్వమత సమభావం’ అన్నది సరైన అర్థమని సర్వోన్నత న్యాయస్థానంలోని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించడం భారత జాతీయ స్వభావానికి అనుగుణమైన పరిణామం! ‘సెక్యులరిజమ్- అని అంటే మతం నుంచి దూరంగా ఉండాలని అర్థం కాదు, అన్ని మతాలకూ సమాన ఆదరణ లభించడం’ అని రాజ్యాంగ పీఠం న్యాయమూర్తులు స్పష్టం చేయడం ‘వక్రీకరణ’కు విరుగుడు! వాస్తవ దర్శనానికి సరికొత్త వెలుగు!

10/27/2016 - 23:39

అమరావతి ప్రాంగణంలో పరిపాలన నగర నిర్మాణానికి నవంబర్ ఒకటవ తేదీన శ్రీకారం చుట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం నూతన రాజధాని అవతరణ క్రమంలో మరో శుభంకర ఘట్టం. రాజధాని నిర్మాణం కోసం ఆర్భాటంగా రూపొందిన ‘స్విస్ ఛాలెంజ్’ వాణిజ్య పథకాన్ని ఉపసంహరించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలియజేయడం అక్టోబర్ 26వ తేదీన సంభవించిన సమాంతార పరిణామం!

10/27/2016 - 03:27

పంట పండినా కష్టమే, పంట ఎండినా కష్టమే- అ న్నది పత్తిరైతుల బతుకులను నిర్దేశిస్తున్న వ్యవసాయ వైపరీత్యం. ఈ ఏడాది అకాలవర్షాల కారణంగా, మితిమీరిన వర్షాల వల్ల పత్తి దిగుబడులు తగ్గాయట! దిగుబడి తగ్గినపుడు నిజానికి ధరలు పెరగాలి. కాని ధరలు వి పరీతంగా తగ్గిపోయాయట! దిగుబడులు పెరిగినప్పుడు గిరాకీ తగ్గి ధరలు తగ్గడం సహజం.

10/26/2016 - 07:20

మావోయిస్టులు నానాటికీ బలపడుతున్నారనడానికి ఇది మరో నిదర్శనం. 2009లో కేంద్ర ప్రభుత్వం ‘మావోయిస్టు’ ఉగ్ర సంస్థను నిషేధించిన తరువాతనే చైనా ఉసిగొల్పుతున్న ఈ తీవ్రవాదులు బలపడిపోవడం అంతర్గత భద్రతకు పెరుగుతున్న ప్రమాదానికి సంకేతం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఒరిస్సా మల్కన్‌గిరి జిల్లా పనుస్‌పుట్ గ్రామం సమీపంలో సోమవారం జరిగిన ఎదురుకాల్పులలో ఇరవై నలుగురు మావోయిస్టులు హతులయ్యారట!

10/24/2016 - 23:57

గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ, వివాదాలకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేంద్రంగా మారాయి. అమెరికా చరిత్రను తిరగరాసి తొలి మహిళా అధ్యక్షురాలిగా శే్వత సౌధాన్ని హిల్లరీ అధిరోహిస్తారా? లేక వివాదాలే చిరునామాగా మారిన కాకలు తీరిన వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ అనూహ్య రీతిలో విజయాన్ని సాధిస్తారా? అన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడోసారి కూడా డెమొక్రటిక్ పార్టీయే అధికారంలోకి వస్తుందా ?

10/24/2016 - 06:42

వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తాము ఓడిపోవడం ఖాయమన్న భయం సమాజ్‌వాదీ పార్టీకి పట్టుకుంది! అందువల్లనే ఏదో విధంగా ప్రాధాన్యం నిలబెట్టుకొని, అధికారాన్ని కాపాడుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహం! ఇందుకు పార్టీ అధినేత, యుపి మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిత్రమైన నాటకాన్ని ఆడిస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు ఇందులో ప్రధాన పాత్రధారులు..

Pages