S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/05/2016 - 23:35

పెద్దనోట్ల రద్దు వల్ల కలుగుతున్న ప్రయోజనాల ప్రా ధాన్యాన్ని తగ్గించి వేయడానికి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం గొప్ప గందరగోళాన్ని సృష్టిస్తోంది. గుజరాత్‌కు చెందిన మహేశ్‌షా అనే వాడు పదునాలుగు వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని బయటపెట్టడం గందరగోళంలో గొప్ప ఘటన! ముంబయిలోని అబ్దుల్ రజ్ఘాక్యూ మొహమ్మద్ సరుూద్ అనేవాడి కుటుంబం రెండు లక్షల కోట్ల రూపాయల ‘అప్రకటిత’ ఆదాయాన్ని బహిరంగం చేయడం గందరగోళానికి పరాకాష్ఠ.

12/04/2016 - 22:38

ఎన్నికల ఖర్చును ప్రభుత్వం భరించాలన్న ప్రతిపాదన ఇప్పటిది కాదు. దశాబ్దుల తరబడి రాజ్యాంగవేత్తలు, రాజనీతిజ్ఞులు, రాజకీయవేత్తలు, మేధావులు ఇలా ప్రభుత్వం ఎన్నికల ఖర్చును భరించడం - స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ - గురించి తరచు విశే్లషణలు చేస్తూనే ఉన్నారు. దశాబ్దులుగా కొనసాగుతున్న ఈ చర్చ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు ఈ విషయంపైన ధ్యాస లేకపోవడం.

12/02/2016 - 23:04

హైదరాబాద్‌లో శుక్రవారం మరో ఇద్దరు నైజీరియా దేశస్థులు పట్టుబడడం విస్తరించిపోతున్న ‘మాదక’ బీభత్స చర్యలకు సరికొత్త నిదర్శనం. అంతర్జాతీయ విమానాశ్రయాలు పెరుగుతున్న కొద్దీ అంతర్జాతీయ మాదక విక్రేతల సంఖ్య పెరుగుతుండడం సమాంతర పరిణామం! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ‘మాదకం మనుషులు’ తరచూ పట్టుబడుతూనే ఉన్నారు.

12/01/2016 - 23:20

హిందూ వివాహ, కుటుంబ వ్యవహారాల బిల్లును పాకిస్తాన్ జాతీయ శాసనసభ ఆమోదించాలా? లేదా? అన్నది మన దేశంలో ప్రచారం కాని విషయం. పాకిస్తాన్‌లోని దాదాపునలబయి ఐదు లక్షల మంది హిందువుల కడగండ్లు 1947 నాటి దేశ విభజనకు సంబంధించిన వ్యవహారం. పాకిస్తాన్‌లో అత్యల్ప సంఖ్యాకులుగా మారి ద్వితీయ, తృతీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్న అవశేష హిందువుల హక్కుల పరిరక్షణ గురించి పట్టించుకోవడం అవశేష భారత ప్రభుత్వం బాధ్యత!

12/01/2016 - 05:55

జమ్మూ కశ్మీర్‌లోని నగ్రోతా వద్ద నెలకొని ఉన్న మన సైనిక స్థావరంపై మంగళవారం నాడు జాయిష్ ఏ మొహమ్మద్ జిహాదీ ముఠాకు చెందిన ఉగ్రవాదులు దాడి చేయగలగడం తీరుమారని పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావానికి మరో నిదర్శనం. సెప్టెంబర్ 29న మన సైనికులు అధీనరేఖ వద్ద సాయుధ చికిత్స-సర్జికల్ స్ట్రయిక్- జరిపి జిహాదీల స్థావరాలను ధ్వంసం చేసిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోకపోవడం మారని తీరుకు నిదర్శనం.

11/29/2016 - 23:38

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ వ్యయం గురించి వైవిధ్యవంతమైన అంచనాలు వెలువడుతున్నాయి. ‘నిర్మాణ వ్యయం’ స్వరూప స్వభావాల గురించి కూడ భారీ భిన్న కథనాలు ప్రచారమై పోయాయి. నాలుగుచోట్ల కోట్ల రూపాయలతో ‘పరిపాలన కేంద్రం’గా అమరావతిని నిర్మించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లు కొన్ని నెలల క్రితం ప్రచారమైంది!

11/29/2016 - 06:52

న్యాయమండలి ‘ఇవ్వని’ ఉత్తరువులను ‘హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ’ వారు చిత్తశుద్ధితో అమలు చేస్తుండడం అక్రమ నిర్మాణాల చరిత్రలో వర్తమాన ఘట్టం! అక్రమ నిర్మాణాలను సక్రమ నిర్మాణాలుగా చిత్రీకరించి వాటిని చట్టబద్ధం చేయడానికి వీలుగా ఈ ఊహాజనితమైన ఉత్తరువులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-హెచ్‌ఎమ్‌డిఎ-వారు అమలు చేస్తున్నారట!

11/28/2016 - 08:12

ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్- కెఎల్‌ఎఫ్- అన్న బీభత్స ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు పంజాబ్‌లోని ‘నాభా’ జైలు నుంచి తప్పించుకోగలగడం హైదరాబాద్‌లో ముగిసిన మూడు రోజుల డిజిపిల సదస్సుకు సమాంతర పరిణామం! డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్- డిజిపిల- సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ‘ఖలిస్తాన్’ విద్రోహులు జైలు నుంచి బయటపడడానికి వ్యూహరచన చేసినట్టు వెల్లడి కావడం విచిత్రమైన వ్యవహారం.

11/26/2016 - 04:00

పెద్ద కరెన్సీ నోట్లను ప్రభుత్వం రద్దు చేయడం గు రించి ‘పరపతి అంచనాల సంస్థ’- మూడీస్- నిర్ధారణలను చేస్తుండడం మన అంతర్గత వ్యవహారాలలో విదేశీయుల జోక్యానికి మరో నిదర్శనం. వెయ్యి రూపాయల, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేసిన తరువాత రూపాయి విలువ మరింతగా పడిపోతుంది. దానికి ప్రధాన కారణం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ అమలు చేస్తున్న ఆర్థిక బీభత్స వ్యూహం!

11/25/2016 - 04:59

పాకిస్తాన్ సైనికదళాలు పురికొల్పిన జిహాదీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లో మన సైనికుడి మృతదేహాన్ని చిత్రవధ చేయడం విచిత్రం కాదు.. మానవులపై నిష్కారణంగా, నిష్కరుణగా కసి తీర్చుకోవడం జిహాదీల స్వభావం. ఈ పైశాచిక వికృతి శతాబ్దులుగా ఇస్లామేతర మతాల వారిని హత్య చేస్తోంది. అబలలపై అత్యాచారాలను జరుపుతోంది! సైనికుడు శత్రు సైనికులను వధించడం సహజం.

Pages