S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/17/2016 - 02:09

తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు టి. బలరామ్ కిషన్, సి.గోపీకృష్ణలకు ఇరాక్ సిరియా మతరాజ్యం-ఐసిస్- ముఠా నిర్బంధం నుండి విముక్తి లభించడం గొప్పదైన సంఘటన. తమవారి విడుదల కోసం పదునాలుగు నెలలుగా ఎదురు చూస్తున్న కిషన్,కృష్ణల కుటుంబ సభ్యులు తమ ప్రార్థనలు ఫలించినట్టు ప్రకటించడం అందువల్ల అత్యంత సహజం.

09/16/2016 - 05:50

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రపంచంలో మరో సంచలనం! ఆయన రాజకీయాలనుంచి తప్పుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడలేదు. నిజానికి గత జూన్ నెలలో ప్రధానమంత్రి పదవీ త్యాగం చేయవలసిన అగత్యం డేవిడ్ కామెరాన్‌కు కలగలేదు. అయినప్పటికీ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్టు డేవిడ్ కామెరాన్ గత జూన్‌లో ప్రకటించాడు.

09/15/2016 - 05:56

వచ్చే సంవత్సరం జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అధికార సమాజ్ వాదీ పార్టీ -సపా- పరాజయం పా లు కాక తప్పదన్న ప్రచార ఉద్ధృతి నాలుగైదు రోజులుగా తగ్గిపోయింది. సపాలో రాజుకుంటున్న రగడ ఇందుకు కారణం! మాధ్యమాలవారి దృష్టి మాత్రమే కాక ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షాల దృష్టి కూడా సపా లోని కుటుంబ కలహంపై కేంద్రీకృతమైంది!

09/14/2016 - 06:20

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ కార్యక్రమంలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణ ఇప్పుడు ధ్రువపడింది. నిర్మాణ ప్రక్రియను హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేయడం ఇందుకు ప్రాతిపదిక. నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించడంలో అనేక అక్రమాలు జరిగినట్టు సోమవారంనాడు తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నత న్యాయమూర్తి ఎమ్.ఎస్.

09/13/2016 - 00:56

పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవునుంచి సింకియాంగ్ లోని కష్‌గర్ వరకు చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న పారిశ్రామిక ప్రాంగణ పథం పథకాన్ని దురాక్రమిత కశ్మీర్‌లో అమలు జరపరాదన్నది నాలుగేళ్లకు పైగా మన ప్రభుత్వం చేస్తున్న వాదం.

09/12/2016 - 01:01

ప్రచ్ఛన్న ఉగ్రవాది ఝకీర్ నాయక్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ ముఠావారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుపుతున్న సేవాసంస్థకు విరాళం ఇవ్వడం రోగలక్షణం మాత్రమే. అసలు ‘రోగం’ దేశమంతటా అనేకానేక ముఠాలు, దేశ వ్యతిరేకపు వలలను బిగించి ఉండడం. వివిధ రకాల పేర్లతో రూపాలతో చెలామణి అవుతున్న ఈ ముఠాలన్నీ స్వచ్ఛందం ముసుగేసుకున్న నకిలీ సేవా సంస్థలు.

09/10/2016 - 07:45

ఆసియాలో..ముఖ్యంగా దక్షిణాసియాలో అత్యంత ప్రభావశీలత కలిగిన దేశంగా భారత్ మరింతగా తన ఉనికి చాటుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం సహా ప్రపంచ సవాళ్లను ఎలుగెత్తి చాటడమే కాకుండా వాటి పరిష్కారానికి మార్గనిర్దేశం చేయడం రోజురోజుకు ఇనుమడిస్తున్న భారత ఖ్యాతికి, బలమైన ఆర్థిక వ్యవస్థగా లభిస్తున్న గుర్తింపునకు నిదర్శనం.

09/09/2016 - 00:12

చక్కెర ధరలు పెరిగాయి, ఇంకా ఇంకా పెరుగుతాయట! మందు పేరు చెప్పగానే జబ్బు నయమైందన్నది సార్వకాలిక లోకోక్తి...జ్వరం రావడానికి దోహదం చేసే మందులు కూడ ఉన్నాయన్నది మరి కొందరు చెప్పే మాట! కానీ జ్వరం వస్తోందా? లేక తగ్గుతోందా? అని నిర్ధారించుకొనలేకపోవడం మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మహా విషయం. ద్రవ్యోల్బణం పెరుగుతోంది, కాదు కాదు...ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతోంది!

09/08/2016 - 04:15

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్‌లో పాకిస్తాన్‌కు వెడుతున్నారా లేదా అన్న ప్రశ్నలు ప్రచారం అవుతుండడం మన విధానంలోని వైరుధ్యాలకు నిదర్శనం. ఆగస్టు ఆరవ తేదీన పాకిస్తాన్‌కు వెళ్లిన దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా అవమానించింది!

09/06/2016 - 23:52

చైనాలోని ప్రాచీన సాంస్కృతిక కేంద్రమైన హాంగ్‌ఝోవూలో సెప్టెంబర్ నాలుగవ, ఐదవ తేదీలలో జరిగిన ఇరవై ప్రముఖ దేశాల -గ్రూప్20- శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ యథాతథ స్థితికి అద్దం పట్టింది. గత ఏడాది టర్కీలోని అంతాల్యాలో జరిగిన జి-20 ప్రభుత్వ అధినేతల సమావేశంలోచర్చకు వచ్చిన ప్రధాన అంశం అంతర్జాతీయ బీభత్సకాండపై జరుగవలసిన ఉమ్మడిపోరాటం.

Pages