సంపాదకీయం

‘రేంజర్ల’ రక్తదాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ‘రేంజర్లు’- అనుబంధ సైనికులు నిర్లజ్జగా బీభత్సకాండకు పూనుకుంటున్నారు. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అధీనరేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి-వద్ద ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది నిరాయుధ పౌరులు మరణించడం పరాకాష్ఠ. ఈ పాకిస్తానీ ‘సైనికులు’ జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రజలు గాయపడడం ఉగ్రచర్యల తీవ్రతకు నిదర్శనం. మన సైనికులు ఉగ్రవాద జిహాదీలకు వ్యతిరేకంగా ‘సాయుధ చికిత్స’-సర్జికల్ స్ట్రయిక్-జరిపిన నాటినుంచి పాకిస్తానీ రేంజర్లు దాదాపు ప్రతిరోజూ అధీనరేఖ వద్ద కాల్పులు జరుపుతున్నారు. కానీ ఈ రేంజర్లు మన సరిహద్దు భద్రతాదళాలతోకాని, సైనికులతో కాని తలపడడం లేదు. పథకం ప్రకారం జనావాసాలపై దాడులు చేస్తున్నారు. మన ప్రజలను హత్య చేస్తున్న పాకిస్తానీ రేంజర్లపై మన సరిహద్దు భద్రతా దళాలు-బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్-బిఎస్‌ఎఫ్-వారు ప్రతిఘటనాత్మక సమరం సాగిస్తున్నారు. ఈ ‘ప్రతిఘటన’ ఫలితంగా వారం రోజులలో పదిహేనుమంది పాకిస్తానీ సైనికులు- రేం జర్లు-హతులయ్యారు. కానీ అధీనరేఖకు ఆవల ఉన్న జనావాసాలపై మ న బిఎస్‌ఎఫ్ జవానులు కాని, సైనికులు కాని దాడులు చేయడంలేదు! మన సైనికులు అధీన రేఖకు ఆవలి వైపున ఉన్న ఒక్క పౌరుడిని కూడా హత్య చేయలేదు! ఇదీ భారతీయ సైనిక సంస్కారానికి, పాకిస్తానీ సైనిక సంస్కారానికీ మధ్యగల స్పష్టమైన తేడా! భారతీయులు అనాదిగా శత్రువుకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేశారు. మన సైనికులు శత్రువుల సైనికులతో మాత్రమే యుద్ధం చేశారు. నిరాయుధులైన ప్రజలను హత్య చేయడం భారతీయ సైనికులకు తెలియని వికృతి! ఈ వికృతి శతాబ్దుల తరబడి జిహాదీలకు ప్రకృతిగా మారింది. ఈ జిహాదీలు పాలకులుగా చెలామణి అయిన సందర్భాలలో ఈ పాలకులు కూడా ‘శత్రు’ దేశాల ప్రజలను విచక్షణా రహితంగా ఊచకోత కోయడం చరిత్ర! ప్రస్తుతం పాకిస్తాన్ సైనిక దళాలలోను అత్యధికులు జిహాదీ ప్రవృత్తి కలవారు! ప్రపంచంలోని అన్ని ఇతర మతాల ప్రజలను మట్టుపెట్టి, ఇస్లాంను ప్రపంచమంతటా ఏకైక మతంగా ప్రతిష్ఠాపించడం శతాబ్దులుగా జిహాద్ లక్ష్యం. ఈ లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు! కానీ లక్ష్య సాధన కోసం కృషి చేయడం జిహాదీలు ఎప్పటికీ మానుకోరు! ఈ జిహాదీ ప్రవృత్తి మాత్రమే పాకిస్తాన్ రేంజర్లను, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది, పాకిస్తాన్ ప్రజల సమష్టి స్వభావాన్ని నియంత్రిస్తోంది! ఊహించని చోట దూకే తోడేలు వలె పాకిస్తాన్ రేంజర్లు జనావాసాలపై తూటాల వర్షం కురిపిస్తున్నారు. ఈ రేంజర్లు మన సైనికులను ఎదుర్కొనలేరు.. పిరికి పందల చర్య అంటే ఇదే మరి- నిరాయుధులను చంపడం.
పాకిస్తాన్‌లోని రెండు ప్రభుత్వాలు పోటీపడి భారత వ్యతిరేక విషం కక్కుతున్నాయి. మొదటిది పౌర ప్రభుత్వాన్ని నిరంతరం నిర్దేశిస్తున్న ప్రభుత్వం. రెండవది సైనిక దళాల అడుగులకు మడుగులొత్తుతున్న పౌర ప్రభుత్వం! సైనిక ప్రభుత్వం ప్రస్తుతం ప్రచ్ఛన్నంగా పౌర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తోంది. అందువల్ల పౌర ప్రభుత్వం ప్రజాస్వామ్య నాటకాన్ని అభినయించగలుగుతోంది! ఎనిమిది రోజులకు పైగా పాకిస్తానీ రేంజర్లు-అనుబంధ సైనికులు-జమ్మూ కశ్మీర్‌లోని అధీనరేఖ వద్ద జరుపుతున్న కాల్పులకు ఇదీ నేపథ్యం. 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2011లో ఉల్లంఘించిన నాటినుంచి ఏటా అనేక వందల సార్లు పాకిస్తానీ రేంజర్లు మన స్థావరాలపైకి కాల్పులు జరుపుతున్నారు. 2014 వరకు ఈ కవ్వింపు లేని కాల్పుల పట్ల మన ప్రతిక్రియ అంతంత మాత్రంగానే ఉంది. ఆ తరువాత దెబ్బకు దెబ్బ రీతిలో మన సరిహద్దు భద్రతా దళాల వారు ఎదురు కాల్పులు జరపడం మొదలైంది! అందువల్ల మన జవానుల ధాటికి తట్టుకోలేని పాకిస్తానీ రేంజర్లు నిరాయుధులైన ప్రజలను హత్య చేయడానికి పూనుకున్నారు. ఇలా ప్రజలను హత్య చేయడం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండలో భాగం. దశాబ్దుల పాటు జిహాదీలను పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోకి ఉసిగొల్పింది. ఈ జిహాదీలు ప్రత్యక్ష బీభత్సకాండను నిర్వహిస్తున్నారు. ఊరీలో జిహాదీ హంతకులు పదిహేడుమంది సైనికులను దొంగచాటుగా చంపడం ఈ ప్రత్యక్ష బీభత్సకాండకు పరాకాష్ఠ. ఇప్పుడు సైనికుల వేషంలోని జిహాదీ హంతకులు కూడా బీభత్స కాండను నిర్వహిస్తున్నారు. మన దళాలు జరిపిన సాయుధ చికిత్స-సర్జికల్ స్ట్రయిక్ తరువాత అధీనరేఖకు ఆవలివైపున ఉన్న బీభత్స స్థావరాలు బలహీనపడినాయి. అందువల్ల పాకిస్తానీ రేంజర్లు రంగంలోకి దిగి బీభత్స కలాపాలకు పాల్పడుతున్నారు. సైనికులు నిరాయుధులైన తమ దేశ ప్రజలను కాని, ఇతర దేశ ప్రజలను కాని హత్య చేయడం ప్రభుత్వ బీభత్సకాండ..
పాకిస్తాన్ రేంజర్లు గతంలో అనేక బీభత్స కృత్యాలను నిర్వహించారు! మరణించిన మన జవానుల భౌతిక కాయాలను చిత్రవధ చేశారు. ఖండఖండాలుగా నరికారు. 2013లో మన జవానుల తలలను నరికి తమ దేశానికి తరలించుకునిపోయి విజయచిహ్నాలుగా ప్రదర్శించారు! ఇప్పుడు మళ్లీ ఎల్‌వోసి వద్ద, జమ్మూ కశ్మీర్‌లోని ఇతర చోట్ల జిహాదీ ఉగ్రవాదులు ఈ వికృత బీభత్స చర్యలను జరిపిస్తున్నారు. సైనికులపై దొంగచాటుగా దాడులు చేసిన, హత్య చేస్తున్న జిహాదీలు కసి తీరక మృతదేహాలను ముక్కలు చెక్కలుగా నరికిపోతున్నారు. ఒకవైపు జిహాదీలు, ఆత్మాహుతి దళాలు మన సైనికుల స్థావరాలపై దాడి చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ సైనికులు మన సైనికులతో తలపడడం మాని నిరాయుధులైన ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స వ్యూహంలో భాగం. ఇలాంటి చర్యలు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన యుద్ధ నియమాలకు విరుద్ధం. కాని పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నియమాలను బరితెగించి బాహాటంగా ఉల్లంఘించింది, ఉల్లంఘిస్తోంది. ‘సమితి’లో తమను ఎవ్వరూ అభిశంసించజాలరన్నది పాకిస్తాన్ పాలకుల ధీమా! ఎందుకంటే పాకిస్తాన్‌ను అభిశంసించే తీర్మానాలను చైనా ప్రభుత్వం అడ్డుకొంటోంది. మహమ్మద్ అఝార్ అనే నరరూప రాక్షసుడ్ని ‘సమితి’లో చైనా వెనుకేసుకు రావడం సరికొత్త ఉదాహరణ!
కశ్మీర్‌లోని ‘అధీనరేఖ’కు అటువైపున ప్రజలు భయపడడం లేదు. కానీ ఇటువైపున ఉన్నవారు సరిహద్దు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. ‘రేఖ’కు దూరంగా పారివస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా ఇదే స్థితి.. ఇటువైపున ఉన్నవారు భయపడుతున్నారు, అటువైపున ఉన్న ప్రజలు నిశ్చింతగా నిద్రపోతున్నారు! పాకిస్తానీలు తమపై దాడులు చేస్తారన్న భయం ఇటువైపున ఉన్న ప్రజలకు ఏర్పడి ఉంది. భారతీయ సైనికులు నిరాయుధులైన ప్రజలను చంపరన్న విశ్వాసం అటువైపున నెలకొని ఉంది! ఇదీ తేడా! నిరపరాధి అయిన మన సర్వజిత్ సింగ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం ముప్పయి ఏళ్లు జైల్లో నిర్బంధించింది. చివరికి ఆయనను జైల్లోనే హత్య చేశారు! ఇలాంటి కవ్వింపు చర్యల వెనుక దాగి ఉన్న అసలు లక్ష్యం మన దేశంతో యుద్ధం.. గెలవడం కోసం కాదు తమ భారత వ్యతిరేకతను చాటుకోవడం కోసం.. భారత వ్యతిరేకత పాకిస్తాన్ ప్రముఖుల మనుగడకు ప్రాతిపదిక!