S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

10/10/2016 - 00:12

పాకిస్తాన్‌లో మరోసారి సైనిక నియంతృత్వం ఏర్పడినట్టయితే ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే పాకిస్తాన్ సైనికదళాలు తమ పౌర ప్రభుత్వంపట్ల గొప్ప ఆగ్రహంతో ఉన్నాయట! జమ్మూ కాశ్మీర్‌లోని ‘అధీనరేఖ’ - లైన్ ఆఫ్ కంట్రోల్ - ఎల్‌ఓసి -కు అటువైపున పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో జిహాదీ బీభత్సపు బట్టీలు నెలకొని ఉన్నాయి.

10/08/2016 - 03:05

జన్యు పరివర్తక జీవరసాయన సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న వైపరీత్యాల గురించి వ్యవసాయదారులలో ధ్యాస పెరుగుతోంది. జన్యు పరివర్తక- జనరికల్లీ మోడిఫైడ్- జిఎం- సాంకేతిక ప్రక్రియ ద్వారా రూపొందుతున్న బి.టి. ఆవాలను పండించడానికి అనుమతి ఇవ్వరాదని కోరుతూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆరవ తేదీన రైతులు ప్రదర్శనలు జరపడం ఇందుకు ఒక సాక్ష్యం.

10/06/2016 - 02:45

రిజర్వ్ బ్యాంక్ వారు వాణిజ్య బ్యాంకులకిచ్చే రుణాలపై మళ్లీ వడ్డీలు తగ్గాయి. వడ్డీశాతం తగ్గడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయన్నది దశాబ్దుల తరబడి జరుగుతున్న ప్రచారం! అయితే వడ్డీలు తగ్గడం వల్ల ‘ద్రవ్యోల్బణం’ పెరుగుతుందన్నది కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట! ద్రవ్యోల్బణం పెరగని రీతిలో వడ్డీ శాతాన్ని తగ్గించడానికి వీలుందా? అన్న మీమాంస జరిగిపోతునే ఉంది!

10/05/2016 - 05:10

తెలంగాణ రాష్ట్రం ముప్పయి ఒక్క జిల్లాలుగా వ్యవస్థీకృతం కావడం పరిపాలన వికేంద్రీకరణకు చారిత్రక ప్రతీక! వికేంద్రీకరణ అనాదిగా భారతీయ జీవన స్వభావం. స్వయం సమృద్ధ గ్రామం వికేంద్రీకరణకు పరాకాష్ఠ. ఈ వికేంద్రీకరణ వ్యవస్థనే మహాత్మా గాంధీ, దీనదయాళ్ ఉపాధ్యాయ లాంటి జాతీయ నాయకులు, దార్శనికులు ‘గ్రామ స్వరాజ్యం’ అని అన్నారు. ‘అంత్యోదయం’ లేదా అట్టడుగు స్థాయి వికాసం అని వివరించారు.

10/04/2016 - 01:31

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో కుదిరిన అంతర్జాతీయ పరిసరాల పరిరక్షణ ఒప్పందాన్ని మన ప్రభుత్వం ధ్రువీకరించడం ప్రకృతి పట్ల మనకు కల మక్కువకు మరో నిదర్శనం. యుగయుగాలుగా భారతీయులు ‘పంచ భూత భాసితమైన ప్రకృతి కళ’ను కనిపించే దివ్య స్వరూపంగా భావించడం ఈ మక్కువకు చిహ్నం! అందువల్లనే 2020 నుంచి ఈ ఒప్పందం అమలుకు వలసిన చర్యలను తీసుకొనడానికి మన ప్రభుత్వం అంగీకరించింది.

10/03/2016 - 05:28

బిహార్ ప్రభుత్వం జారీ చేసిన మద్యపాన నిషేధపుటుత్తరువును పాట్నా హైకోర్టు రద్దు చేయడం ‘తాగుబోతు’లకు హర్షం కలిగిస్తున్న అద్భుతం! ఆ రాష్టమ్రంతటా మద్యపాన మమకార జీవులు ఆనందోత్సాహాల విన్యాసాలను ప్రదర్శిస్తున్నారట కూడ! మద్యపాన నిషేధాన్ని దేశమంతటా సర్వసమగ్రంగా అమలు జరుపడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నది మన రాజ్యాంగంలో పేర్కొన్న ‘నిర్దేశక నియమం’- డైరక్టివ్ ప్రిన్సిపుల్!

10/01/2016 - 07:38

హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పో తుండడం భయాందోళనలకు గురిచేస్తోంది. కార్లు, వ్యా న్లు, బైకులు, లారీలు, బైకులు తదితర వాహనాలను మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురిఅవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అడుగడుగునా ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటుచేయాలి. నిరంతర పర్యవేక్షణ జరగాలి.

10/01/2016 - 07:34

రష్యా మాత్రమే ‘అపవాదం’... పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్స వికృత స్వరూపాన్ని ప్రపంచ దేశాలు నిరసిస్తున్న సమయంలో రష్యా ప్రభుత్వం మాత్రమే పాకిస్తాన్‌కు చెలిమి చేతులను అందిస్తోంది. పాకిస్తాన్ 1947లో ఏర్పడిన నాటి నుంచి రెండేళ్ల క్రితం వరకూ రష్యా ప్రభుత్వాలు పాకిస్తాన్‌ను దూరంగా ఉంచాయి. ఈ దశాబ్దుల కాలఖండంలో రష్యా మనకు అత్యంత సన్నిహిత మిత్రదేశం!

09/30/2016 - 02:08

2016 సెప్టెంబర్ 29 భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. కడచిన నాలుగున్నర దశాబ్దాల్లో మొట్టమొదటిసారి మన సైనిక బలగాలు మాటువేసి, గీతదాటి, పాకిస్తాన్‌కి దానికి అర్థమయ్యే భాషలో, జన్మలో మరవలేని గుణపాఠం నేర్పాయి. అదీ ప్రపంచంలో ఎవరూ వంకపెట్టలేని రీతిలో! దెబ్బతిన్నవారే కనీసం తమకు దెబ్బతగిలిందని చెప్పుకోలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండక తప్పని విధంగా!

09/30/2016 - 02:04

వ్యక్తిగతంగా సాధించలేని ప్రయోజనాలను అంతర్జాతీయ స్థాయిలో ఒనగూర్చుకునేందుకు ఉద్దేశించినవే ప్రాంతీయ కూటములు. దేశాల మధ్య పోటీతత్వం పెరిగిపోవడం, వేటికవి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న నేటి తరుణంలో.. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) ఉనికికే ముప్పువాటిల్లే పరిణామాలు చోటుచేసుకోవడం మింగుడు పడని వాస్తవం.

Pages