S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/06/2016 - 08:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు 3స్టాండప్ ఇండియా2 పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగార్థులు ఉపాధి అవకాశాలను సృష్టించే వారుగా ఎదిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు.

04/06/2016 - 08:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: సంచలనం సృష్టించిన ‘పనామా’ డాక్యుమెంట్ల స్కాంలో తన పేరు ప్రతిష్ఠలను దుర్వినియోగం చేశారని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మంగళవారం ఖండించారు. పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖుల జాబితాలో అమితాబ్ కుటుంబం పేరు ప్రముఖంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘నా పేరును తప్పుగా వాడారని నేను భావిస్తున్నాను. నేను అన్ని పన్నులను సక్రమంగా చెల్లించాను.

04/06/2016 - 08:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా మూలంగా దేశంలోని లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నిండుతోందని ఆయన ప్రశంసించారు.

04/06/2016 - 08:02

జమ్మూ, ఏప్రిల్ 5: పనితీరులో నూ, సమర్ధవంతమైన పాలన అం దించడంతో మంత్రులు ముందుండాలని, లేపిక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కొత్త కేబినెట్‌కు దిశానిర్దేశం చేశారు. కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సోమవారం రాత్రి తొలి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఉద్ఘాటించారు.

04/06/2016 - 08:02

నల్బరి (అస్సాం), ఏప్రిల్ 5: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించడాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడికి దిగారు. ఇక్కడ జరిగేది లోక్‌సభ ఎన్నికలు కావనీ, అస్సాం అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చి, మోదీ ఏం చేశారో చెప్పాలనడంలో అర్థం లేదని అమిత్ షా పేర్కొన్నారు.

04/06/2016 - 08:01

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: చిన్నారి పెళ్లికూతురు టివి నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజురోజుకు కొత్త మలుపుతిరుగుతోంది. బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వేధింపుల వల్లే ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె స్నేహితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

04/06/2016 - 07:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కృష్ణా నదీజలాల వివాదం పరిష్కరించే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ రామ్మోహన్‌రెడ్డిని ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించడంపై కర్నాటక అభ్యంతరం తెలిపింది. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కర్నాటక ప్రభుత్వం తరుఫున న్యాయవాది అనిల్ దివాన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు.

04/06/2016 - 07:56

ముంబయి, ఏప్రిల్ 5: ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నగదు చెలామణి భారీగా పెరగడంపై రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం కనె్నర్ర చేశారు. ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉన్న నగదు 60 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని, ఇది సాధారణ విషయం కాదని ఆయన పేర్కొంటూ, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ‘ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ ధనం ఏరులై పారుతోంది.

04/06/2016 - 06:48

న్యూఢిల్లీ, ఏపి ల్ 5: ‘పనామా’ బాగోతం భారతీయ బడాబాబులకు గుబులు పుట్టిస్తోంది. ఒక్కో డాక్యుమెంట్ ఒక్కొక్కరి ‘నల్ల’వ్యాపార జీవితాలను బయట పెడుతుండటంతో తాము తప్పులు చేయలేదని చెప్పుకోవటానికి ఒక్కొక్కరు రకరకాల రూపాల్లో మీడియా ముందు క్యూలు కడుతున్నారు. తామేమీ తప్పు చేయలేదని.. తమంత మంచివాళ్లమని కలర్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

04/06/2016 - 04:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రిజర్వు బ్యాంకు తన వడ్డీ రేటును తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు మాసాలకు సంబంధించి ద్రవ్య పరపతి విధానంపై రిజర్వు బ్యాంకు మంగళవారం సమీక్ష జరిపి వడ్డీ రేటను 0.25 శాతం కుదించింది. దీంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గేందుకు మార్గం సుగమమైంది.

Pages