S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/08/2016 - 06:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ సతీమణి కమలా అద్వానీ అంత్యక్రియలు గురువారం ఇక్కడి నిగమ్ బోధ్ ఘాట్‌లో ఆత్మీయుల అశ్రు నయనాల మధ్య జరిగాయి. ప్రజలు సందర్శనార్థం పృథ్వీరాజ్ రోడ్డులోని అద్వానీ నివాసం వద్ద ఉంచిన ఆమె మృత దేహాన్ని అక్కడినుంచి నిగమ్ బోధ్ ఘాట్‌కు ఊరేగింపుగా తీసుకు వచ్చారు.

04/08/2016 - 06:14

శ్రీనగర్, ఏప్రిల్ 7: జాతీయవాదం అంశంపై ఇరు వర్గాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఎన్‌ఐటి)లో వరుసగా మూడోరోజు గురువారం నాడూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. కాగా ఎన్‌ఐటిలో ఘర్షణలకు బాధ్యులైన విద్యార్ధులపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయగా, ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

04/08/2016 - 06:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

04/08/2016 - 06:11

బోస్టన్, ఏప్రిల్ 7: జీర్ణకోశ వ్యాధికి సంబంధించి నిరంతరం మందులు వేసుకోకుండా, ఒకే మాత్రతో దీర్ఘకాలం చికిత్స చేసుకునే విధానాన్ని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ప్రధానంగా జీర్ణకోశ వ్యాధికి సంబంధించి కొత్త తరహా మాత్రను సైంటిస్టులు విజయవంతంగా పరీక్షించారు. ఈ మాత్రను ఒకసారి మింగితే, అది జీర్ణకోశ గ్రంథికి అతుక్కుని పోయి.. నెమ్మది నెమ్మదిగా తనలోని మందును శరీరానికి అందిస్తూ ఉంటుంది.

04/08/2016 - 06:10

చండీగఢ్, ఏప్రిల్ 7: దాదాపు అర్ధ శ తాబ్దం తరువాత మా జీ ప్రధానమంత్రి మ న్మోహన్ సింగ్ మళ్లీ పాఠాలు బోధించబోతున్నారు. పం జాబ్ యూనివర్సిటీలో జవహర్‌లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్ పదవిని మన్మోహన్ అం గీకరించారు. మన్మోహన్ లాంటి గొప్ప ఆర్థిక శాస్తవ్రేత్తలు యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో కలిసి.. పాఠాలు చెప్పటం చాలా ఆనందంగా ఉందని పంజాబ్ వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ గ్రోవర్ అన్నారు.

04/08/2016 - 05:47

న్యూఢిల్లీ,ఏప్రిల్ 7: కృష్ణా జలాల వివాదం పరిష్కరించే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తదుపరి విచారణ వచ్చే నెల 9,10,11 తేదీలకు వాయిదా పడింది. గురువారం నాడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్టా నదీ పరివాహక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక సుదీర్ఘ వాదనలు వినిపించాయి.

04/08/2016 - 05:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘మేమంటే పట్టదా.. ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా..’దేశంలోని కరవు కాటకాలపై ప్రభుత్వాల ధోరణిని ఎండగడుతూ సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆగ్రహమిది. దేశ వ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితులపై రెండో రోజైన గురువారం విచారణ కొనసాగించింది.

04/08/2016 - 05:56

హైదరాబాద్, ఏప్రిల్ 7: దేశంలోని ఐఐటిల ఫీజులను కేంద్రం అమాంతం 122 శాతం పెంచింది. దాంతో యుజి కోర్సులకు ఏటా 90 వేలు ఉన్న ఫీజు ఇక మీదట రెండు లక్షలు కాబోతోంది. దీనివల్ల మధ్య తరగతి విద్యార్ధులపై విపరీతమైన భారం పడనుంది. అయితే పెంచిన ఫీజు ఐఐటిల్లో చదువులకు ఇంకా తక్కువేనని మానవ వనరుల మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. పిజి కోర్సుల ఫీజు వ్యవహారం ఇంకా తేల్చలేదు.

04/08/2016 - 04:56

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘పనామా’ సాలెగూడులో బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా చిక్కుకుంటున్నారు. బిగ్‌బీ అమితాబ్ కుటుంబం తరువాత తాజాగా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, ఆమె సోదరి కరిష్మాకపూర్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

04/07/2016 - 18:00

ముంబయి: మహారాష్టల్రో ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో 20 మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ పిచ్‌లను తడిపేందుకు అవసరమైన నీటిని బిసిసిఐ ఎక్కడి నుంచి తెస్తుందో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రజలు ముఖ్యమా? క్రికెట్ ముఖ్యమా? అని ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీచేసింది.

Pages