S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2015 - 22:43

ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 20తో అక్కడ షూటింగ్ పూర్తిచేసుకుందట. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా భారీగానే జరుగుతున్నాయట. మరోవైపు ఆడియో విడుదల కోసం భారీగా సన్నాహాలు చేస్తున్నారు.

12/07/2015 - 22:42

నాగార్జున ద్విపాత్రాభినయంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/07/2015 - 04:58

కన్నడంలో విజయవంతమైన ముంజానీ చిత్రాన్ని తెలుగులో జర్నీ-2గా అనువదిస్తున్నారు. గణేశ్, మంజరి జంటగా ఎస్.నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై కొత్తూరు విఠల్ సమర్పణలో చిగులూరి గంగాధర్‌రావు చౌదరి తెలుగులో అందిస్తున్నారు.

12/07/2015 - 04:56

హర్షకుమార్, డాలీశర్మ, నదీమ్ భార్గవ్, కామ్నాసింగ్, అభిలాష్, రుహానీ శర్మ ప్రధాన తారాగణంగా గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ పతాకంపై దీపక్ బల్‌దేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ తెలుగు, హిందీ భాషలలో రూపొందిస్తున్న చిత్రం ‘్ఫల్ మూన్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈనెల 7 నుండి డెహ్రాడూన్‌లో 20 రోజులపాటు జరగనుంది.

12/07/2015 - 04:56

లాస్ ఏంజిల్స్ టాకీస్, సంధ్యా సినీ స్టూడియోస్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘వౌనం’. కిషన్‌సాగర్ ఎస్. దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి నిర్మిస్తున్నారు. మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/07/2015 - 04:55

ఆశీష్ గాంధి, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలి రాధోడ్ ప్రధాన తారాగణంగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితామా.. ఖచ్చితమా). ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/07/2015 - 04:54

పరిశ్రమలో పలువురు దర్శక నిర్మాతలతో పరిచయాలు వున్న సాంకేతిక నిపుణుడు వి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఎడిటింగ్, గ్రాఫిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో సకల సౌకర్యాలు ఉన్న ‘శ్రీ మేఘ స్టూడియో’ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దీనిని ప్రారంభించారు.

12/07/2015 - 04:54

ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్ర పుట్టినరోజు వేడుకలకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అలనాటి అందాల తారలు శ్రీదేవి, రవీనాటాండన్, శిల్పాశెట్టి, ఈతరం భామలు కరీనా,కరిష్మా, అలియాభట్ ఈ వేడుకలకు హాజరై మనీష్‌కు అభినందనలు చెప్పారు. ముంబైలో నిర్వహించిన పార్టీకి అతికొద్దిమంది అతిధులను మాత్రమే ఆయన ఆహ్వానించారు.

12/07/2015 - 04:53

ముంబైలో నిర్వహిస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్ ఫాషన్ టూర్ -15’ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు. ప్రఖ్యాత డిజైనర్లు రోహిత్‌గాంధి, రాహుల్‌ఖన్నా రూపొందించిన దుస్తులు ధరించిన సోనాక్షిసిన్హా, పరిణీతిచోప్రా చూపరులను ఆకట్టుకున్నారు.

Pages