పోస్ట్ ప్రొడక్షన్‌లో వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్ టాకీస్, సంధ్యా సినీ స్టూడియోస్ పతాకాలపై సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘వౌనం’. కిషన్‌సాగర్ ఎస్. దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి నిర్మిస్తున్నారు. మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఓ వైవిధ్యమైన కథనంతో డిఫరెంట్ జోనర్‌లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా వౌనం రూపొందిందని, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. కొలంబోలో పాటల చిత్రీకరణ జరుపుతామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అందరికీ నచ్చే కథాకథనంతో అన్ని రకాల ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు తమ సంస్థకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కథ: అనిల్ కె.నాని, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్: శివ శేర్వాణి, కెమెరా, దర్శకత్వం: కిషన్ సాగర్. (చిత్రం) ఐశ్వర్య