త్వరలో రానున్న ఓ స్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశీష్ గాంధి, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతిమోల్, మనాలి రాధోడ్ ప్రధాన తారాగణంగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితామా.. ఖచ్చితమా). ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ- గతంలో ప్రతి ఊరిలో ఓ దెయ్యం తిరుగుతుందని, తమ ఇంటికి ఆ దెయ్యం రావద్దని గోడలపైన, తలుపులపైన రాసేవారని, చాలామంది అప్పట్లో భయంతో గ్రామాలను విడిచిపెట్టిన సందర్భాలు కూడా వున్నాయని, అటువంటి కథనాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్‌గా చిత్రీకరించామని తెలిపారు. వైవిధ్యంగా వుండడంకోసం కథను సినిమాటిక్‌గా చేసి ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించామని, ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు. రీరికార్డింగ్ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రాన్ని ఈనెల మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. (చిత్రం) ఆశీష్ గాంధి, మనాలి రాధోడ్