ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో రూ. 40 లక్షలు గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతాని రామకృష్ణగౌడ్

ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో జరిగిన అవకతవకలపై సత్వరం చర్య తీసుకుంటామని అన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణగౌడ్. సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాతల మండలిలో చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా గత ఏడాది ఫైనాన్స్ అకౌంటింగ్‌లో ఈ అవకతవకలు బైటపడ్డాయని, దాదాపు 40 లక్షలకుపైగానే డబ్బును దుర్వినియోగం చేసినట్టు తెలిసిందని, ఈ అవకతవకల గురించి ఇసి మెంబర్స్‌కుగాని, మెంబర్స్‌కుగాని తెలియకుండా సర్దుబాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని, ప్రెసిడెంట్, సెక్రటరీ వంటివారు కూడా వీటి గురించి మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ముఖ్యంగా జనరల్ బాడీ మీటింగ్‌లో తప్పులను ఒప్పుకుంటూ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారని, మెంబర్స్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పలేదని, కౌన్సిల్‌లో జరిగిన ఫ్రాడ్‌ను 40 లక్షలుగా గుర్తించారని చెప్పారు. కానీ ఇంకా ఎక్కువగానే వుందని మా అనుమానమని, ఈ తప్పు 2003వ సంవత్సరం నుండి జరుగుతోందన్నారు. అప్పటినుంచి జరిగిన ఈ ఫ్రాడ్‌లో ఎంత డబ్బు పోయిందనేది ఎవరికీ తెలియకుండా వుందని, అలాగే, కోకాపేటలో మూవీ టవర్స్‌కోసం రెండున్నర కోట్ల ఖర్చుపెట్టారని, తిరుపతిలో ఫ్లాట్లు కొంటున్నామని లక్షలకు లక్షలు వాడేశారని ఆరోపించారు.
అలాగే మెంబర్ కాని వ్యక్తికి 35 లక్షలు విరాళం ఇవ్వడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వీటిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, అలాగే, ప్రస్తుతం ప్రెసిడెంట్ బూరుగుపల్లి శివరామకృష్ణ, కొడాలి వెంకటేశ్వరరావు, జానకిరామ్ రాజీనామా చేయాలని, మళ్లీ కొత్త బాడీని ఏర్పాటుచేసి జరిగిన అవకతవకలను సరిచేయాలని డిమాండ్ చేశారు. వీలైతే దీనికోసం ప్రభుత్వం దగ్గరకు వెళతామని అన్నారు. సాయి వెంకట్ మాట్లాడుతూ, నిర్మాతల మండలిలో చాలా దారుణాలు జరుగుతున్నాయని, వీటి గురించి అడగడానికి వెళ్తే ఎవరూ సమాధానం చెప్పటంలేదన్నారు. నిర్మాతల మండలిలో వున్న మెంబర్స్ డబ్బులను కమిటీకి తెలియకుండా వారి ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు అన్నారు.