S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/19/2018 - 04:27

అమీన్‌పూర్, మే 18: చిన్నప్పటి కలిసిమెలిసి మంచి స్నేహితులుగా ఉంటూ ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో జీవిస్తున్న ముగ్గురు యువకులను యమపాశం ఒకేచోటకు చేర్చి లారీ రూపంలో కబళించుకుపోయిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట పంచాయతీ మీదుగా వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

05/19/2018 - 03:22

హైదరాబాద్, మే 18: విత్తనాల తయారీ తేదీ, ముగిసే గడువు తేదీ వంటి విషయాలను ముద్రించకుండానే విత్తన కంపెనీలు విత్తనాలను ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి రూ.2.35 కోట్ల విలువైన విత్తనాలను తూనికలు కొలతల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా విత్తన తయారీ కేంద్రాల్లో విస్తత్ర తనిఖీలు నిర్వహించి 154 కేసులు నమోదు చేశారు.

05/19/2018 - 02:08

జీడిమెట్ల, మే 18: అనంతగిరి కొండలకు బయలుదేరిన ఐదుగురు యువకుల్లో నలుగురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం కాలనీ, సాయిబాబానగర్, పాండు బస్తీలో నివాసముండే రామారావు (19), ఉదయ్ (19), హేమసుందర్ (18), గణేశ్ (19), కిరణ్ (19) ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నారు.

05/19/2018 - 02:00

భైంసారూరల్, మే 18: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన సట్ల లక్ష్మణ్ (32) గురువారం ఎప్పటిలాగే ఉపాధి పనులకు వెళ్లాడు. అయతే ఎండలు తీవ్రంగా ఉండడంతో ఏమీచేయలేకపోయాడు. దీంతో ఎండలో పనిచేస్తుండగా లక్ష్మణ్ కింద పడిపోయాడు. ఎండవేడిమికి తట్టుకోలేక పడిపోయాడని తోటి కూలీలు గుర్తించి ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. భైంసాలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న లక్ష్మణ్ గురువారం రాత్రి మృతిచెందాడు.

05/19/2018 - 01:54

న్యూఢిల్లీ, మే 18: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య జల పంపిణీకి ఉద్దేశించిన కావేరీ యాజమాన్య స్కీం ముసాయిదాను సుప్రీం కోర్టు ఆమోదించింది. కేంద్రం రూపొందించిన ఈ పథకంలో కొన్ని మార్పులు చేయాలంటూ కర్నాటక, కేరళ ప్రభుత్వాలు చేసిన సూచనలను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల సలహాల్లో ఎలాంటి పసా లేదని బెంచ్ వ్యాఖ్యానించింది.

05/19/2018 - 00:05

మంగళగిరి, మే 18: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కుటుంబ కలహాలు తల్లీకూతుళ్ల ప్రాణాలు బలిగొన్నాయి. మరో చిన్నారి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కరివేపాకు వారి వీధిలో నివాసం ఉంటున్న పూసపాటి రామారావు, దుర్గ్భావాని (25) దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

05/18/2018 - 23:31

కర్నూలు, మే 18: కర్నూలు నగరంలోని కలెక్టరేట్ భవనం పైనుంచి దూకి ఓ ఉద్యోగిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బత్తులూరులో ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న శోభారాణి శుక్రవారం కర్నూలులో జరిగిన సమావేశానికి హాజరైంది. కలెక్టరేట్‌లో ఓ వైపు డీఆర్‌సీ సమావేశం జరుగుతుండగానే మేడపైకి చేరుకుని అక్కడి నుంచి కిందికి దూకింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

05/18/2018 - 22:33

* యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల ఆందోళన
* ధర్నాతో మూడు గంటల పాటు నిలిచిన వాహనాలు

05/18/2018 - 04:59

పెద్దపల్లి రూరల్, మే 17: మండలంలోని అందుగులపల్లి గ్రామ పరిధిలోని దేవనిపల్లి గ్రామ సమీపంలో గల క్యారీపై గురువారం రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు.

05/18/2018 - 04:43

దిల్‌సుఖ్‌నగర్, మే 17: సెల్ఫీ చిత్రికరించుకొని యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్ పోలిస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మండలం అన్నోజీ గూడ ప్రాంతానికి చెందిన సాయిగౌడ్ (21) సరూర్‌నగర్ జీహెచ్‌ఏసీ కార్యాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. వృత్తిరిత్యా స్థానికంగా ఓ సంస్థలో ఎగ్‌క్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

Pages