S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

08/09/2019 - 22:48

నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసు కున్న సాహసోపేతమైన చర్యల కారణంగా చట్టపరంగా జమ్మూ కశ్మీర్ ను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు అందుకు ప్రధాన అడ్డంకులుగా ఉంటున్న రాజ్యాంగ అధికారణలకు అనూహ్యమైన రీతిలో సరికొత్త భాష్యం చెప్పడం ద్వారా ఎవరూ ఊహించనంత సులభంగా వాటి పరిధిని తొలగించి సంచలనాత్మకమైన మార్పు తీసుకు రాగలిగారు.

08/07/2019 - 23:10

మన దేశచరిత్రలో మూడు సంఘటనలు ప్రధానమైనవి. ఒకటి స్వాతంత్య్రం వచ్చిన రోజు- 1947 ఆగస్టు 15. రెండవది 1950 జనవరి 26- గణతంత్ర దినోత్సవం. మూడవది 2019 ఆగస్టు 5వ తేదీ- జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం రద్దయిన రోజు. కశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని కల్పించే ఈ అధికరణం దేశం 72 ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

08/07/2019 - 02:16

సమాచార హక్కు చట్టానికి సవరణల రూపంలో తూట్లుపొడిచిన కేంద్రం అదే సమయంలో మరో కఠిన చట్టాన్ని తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఏదైనా చట్టం చేసినపుడు విపక్షాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కానీ కేంద్రం ‘పోక్సో’ చట్టానికి సవరణలు చేసినపుడు ఒకరిద్దరు మినహా మిగిలిన సభ్యులంతా ఆమోదం తెలపడం చూ స్తుంటే- ఆ చట్టంలో సవరణల అవసరాన్నీ ఆవశ్యకతనూ తెలుపుతూనే ఉంది.

08/04/2019 - 02:05

నేడు ‘ఫ్రెండ్‌షిప్ డే’
*
ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం- స్నేహం
యవ్వన దశలో కలిగే మానసిక ఒత్తిళ్లకు పరిష్కారం- స్నేహం
నేనున్నానే స్నేహితుడి మాటతో ప్రపంచానే్న జయించవచ్చు
స్నేహంతో మానసిక సమస్యలు మటుమాయం
అల్లరితో ఆనందం పెనవేసుకున్నదే- స్నేహబంధం

08/02/2019 - 22:11

కుటుంబ వారసత్వంగా వస్తున్న కాఫీ తోటలలో కాలం గడపకుండా ఉన్నత చదువులకు వెళ్లి, స్టాక్ మార్కెట్ వ్యాపార రహస్యాలను ఛేదించి, టీ ని ఎక్కువగా ప్రేమించే భారత్‌లో కాఫీకి ఒక హోదా కల్పించి, అంతర్జాతీయ మార్కెట్ సృష్టించి, బహు ముఖంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కార్పొరేట్ రంగంలో ఆదర్శంగా నిలిచిన వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం.

08/01/2019 - 04:54

కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓటమి చెందినా, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదు. కర్నాటక అసెంబ్లీలో మొత్తం సీట్లు 229కాగా, బీజేపీకి 105, జేడీఎస్‌కు 37, కాంగ్రెస్‌కు 78 సీట్లు, రెండు చోట్ల ఇండిపెండెంట్లు, బీఎస్పీకి ఒక సీటు ఉన్నాయి. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లను సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది.

07/31/2019 - 04:33

రెండు చెంపలూ వాయించి ముఖం నల్లగా ఉంది, ఎర్రగా అయ్యేందుకే కొట్టాను అని చెప్పడాన్ని భారతీయ సమాజం ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో అయితే లేదు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని అప్పటి యుపీఏ ప్రభుత్వం తీసుకువచ్చినపుడు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ పెద్ద దుమారమే చెలరేగింది.

07/28/2019 - 03:49

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అంటారు. ఇవి విభిన్న రకాలుగా ఉంటాయి, ఒక ఊరి నుండి మరొక ఊరికి, పల్లె నుండి పట్నానికి, పట్నం నుండి పల్లెకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి.

07/26/2019 - 22:30

సరిగ్గా 20 ఏళ్ల క్రితం కార్గిల్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య పరిమితంగా యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సేనలు తీవ్రవాద ముసుగులో రహస్యంగా నియంత్రణ రేఖను దాటు కొంటూ చొరబడి, వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తయన ప్రదేశాలను ఆక్రమించుకోగా, భారత సైనికులు నిరయంత్రణరేఖ లోపలనే పోరాటం జరుపవలసి వచ్చింది. తీవ్రమైన కష్టతరమైన పరిస్థితులలో, ప్రతికూలమైన వాతావరణంలో, అనుకూలంగా లేని భూభాగంలో జరుపవలసి వచ్చిన యుద్ధం అది.

07/25/2019 - 02:04

అన్ని విధాలుగా భారత్‌లో అంతర్భాగంగా ఉన్న కశ్మీర్‌పై ‘శే్వతసౌధం అధిపతి’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ అనుచితం. కశ్మీర్ సమస్యను దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గతంలోనే నిర్ణయించాయి. ఇందులో మూడవ దేశానికి స్థానం లేదు.

Pages