S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/21/2016 - 02:42

భద్రాచలం, అక్టోబర్ 20: వరుస విభజనలతో గిరిజన సహకార సంస్థ చిక్కి శల్యవౌతోంది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా కనీసం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం గమనార్హం. దీనివల్ల గిరిజన రైతులకు ఏటా ఇచ్చే వ్యవసాయ రుణాలు గత మూడేళ్లుగా అందడం లేదు. దీంతో వ్యవసాయ రుణాలు అందక గిరిజన రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

10/21/2016 - 02:40

ముంబయి, అక్టోబర్ 20: బుధవారం నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్ రంగాల షేర్ల దన్నుతో లాభాల బాటలో సాగాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 145 పాయింట్లు లాభపడి 28,129.84 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 40.30 పాయింట్లు లాభపడి 8,699.40 పాయింట్ల వద్ద ముగిసింది.

10/21/2016 - 02:39

హైదరాబాద్, అక్టోబర్ 20: ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో రూ.315 కోట్ల టర్నోవర్ సాధించినట్లు గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా సంస్ధ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే 10.2 శాతం వృద్ధిరేటు సాధించింది. నికర ఆదాయం రూ.274.2 కోట్లు వచ్చిందని ఆ సంస్ధ పేర్కొంది. ముగిసిన త్రైమాసికకాలంలో 28 శాతం లాభాలు పెరిగాయి.

10/21/2016 - 02:38

న్యూఢిల్లీ,అక్టోబరు 20: మోటారు వాహన చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని సిపిఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ తెలిపారు. ఈ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు సిపిఎం, వామపక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రోడ్డు రవాణా, భద్రతపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

10/20/2016 - 07:01

విజయవాడ, అక్టోబర్ 19: పారిశ్రామిక రంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలు సత్ఫలితాలిస్తున్నాయి. వ్యవస్థాగతంగా ప్రపంచ స్థాయిలో పోటీపడదగిన వినూత్న మార్పులు తీసుకురాగా, సుస్థిరమైన రెండంకెల సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది. సత్వర ఫలితాలనిచ్చే వృద్ధి కారకాలను గుర్తించి, ఆయా రంగాలను ప్రోత్సహిస్తోంది.

10/20/2016 - 06:59

విజయవాడ, అక్టోబర్ 19: విశాలమైన కోస్తా తీరం, అపారమైన మత్స్య సంపద, కావాల్సినన్ని మానవ వనరులు.. వెరసి.. సముద్ర ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. ఏపి కన్నా తీర ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రాలున్నప్పటికీ చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రా అగ్రస్థానంలో కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలే కారణమని చెప్పాలి.

10/20/2016 - 06:58

నల్లగొండ, అక్టోబర్ 19: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వ శాఖలు చేసుకున్న ఏర్పాట్లకు మిల్లర్లు బ్రేకులు వేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్‌ల నుండి మిల్లులకు దిగుమతి చేసుకోబోమని, కస్టమ్ మిల్లింగ్ చేయబోమంటూ మిల్లర్లు మెలిక పెట్టడడం ధాన్యం సేకరణ ప్రక్రియకు ఆటంకంగా మారింది.

10/20/2016 - 06:57

విజయవాడ, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో కర్మాగారాన్ని నెలకొల్పటానికి ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం టిసిఎల్ కంపెనీకి అనుబంధంగా ఉన్న టోనీ ఎలక్ట్రానిక్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. టిసిఎల్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, టోనీ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ సిఇఒ గారీ యు నేతృత్వంలో చైనా నుంచి వచ్చిన ప్రతినిధి బృందం విజయవాడ సిఎంఒలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుధవారం భేటీ అయ్యింది.

10/20/2016 - 06:57

ముంబయి, అక్టోబర్ 19: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్ల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఆ సంస్థ అధిపతి విజయ్ మాల్యా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రతో విదేశాలకు చెక్కెస్తే, బకాయిలను వసూలు చేసుకోవడంలో భాగంగా తాకట్టుపెట్టిన ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న బ్యాంకులకు నిరాశే ఎదురవుతోంది.

10/19/2016 - 03:45

ముంబయి, అక్టోబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో సూచీలు పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్.. దాదాపు ఐదు నెలల్లో ఏ రోజూ లేనంతగా గరిష్ఠ స్థాయి లాభాన్ని అందుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 8,600 మార్కును అధిగమించింది. నిఫ్టీ లాభమూ ఐదు నెలల గరిష్ఠ స్థాయిలో నమోదైంది.

Pages