బిజినెస్

ధాన్యం కొనుగోలుకు మిల్లర్ల బ్రేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 19: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వ శాఖలు చేసుకున్న ఏర్పాట్లకు మిల్లర్లు బ్రేకులు వేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేదాకా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మార్కెట్‌ల నుండి మిల్లులకు దిగుమతి చేసుకోబోమని, కస్టమ్ మిల్లింగ్ చేయబోమంటూ మిల్లర్లు మెలిక పెట్టడడం ధాన్యం సేకరణ ప్రక్రియకు ఆటంకంగా మారింది. కస్టమ్ మిల్లింగ్‌కు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని, వెయిటేజ్ లాస్ కింద కిలో మినహాయింపుతో క్వింటాల్‌కు రారైస్ 67 కిలోల నుండి 66 కిలోలకు, బాయిల్డ్ రైస్ 68 కిలోల నుండి 67 కిలోలకు తగ్గించి ఇచ్చేందుకు అనుమతించాలన్న డిమాండ్లను ఆమోదిస్తేనే తాము ధాన్యం సేకరణలో భాగస్వామ్యమవుతామని మిల్లర్ల సంఘం మొండికేస్తోంది.
మంగళవారం ఒకేరోజు మిల్లర్లతో రెండు పర్యాయాలు కలెక్టర్, జెసిలు చర్చలు జరిపినా రాష్ట్ర మిల్లర్ల సంఘం నిర్ణయమే తమ నిర్ణయమంటూ మిల్లర్లు తేల్చిచెప్పడం ధాన్యం కొనుగోలుకు ప్రతికూలంగా మారింది. అయితే పౌరసరఫరాల సంస్థ, సహకార, మార్కెటింగ్ శాఖలు, ఐకెపిలు మాత్రం బుధవారం నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని నిర్ణయించాయి. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోతే ప్రభుత్వం వారి సమస్య పరిష్కరించేదాకా గోదాముల్లో నిల్వ చేయడం ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగించేందుకు సిద్ధపడుతుండడం కొంత రైతులకు ఊరటనిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో పలు మార్కెట్‌లలోకి ధాన్యం వెల్లువలా వచ్చి పడుతుండగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో యార్డుల్లోనే ధాన్యం కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.
2 లక్షల టన్నుల కొనుగోలుకు ఏర్పాట్లు
ఖరీఫ్ ధాన్యం సేకరణలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 4 లక్షల 64 వేల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేయగా, మార్కెట్‌కు వచ్చే ధాన్యంలో 2 లక్షల టన్నులను ఐకెపి, పిఎసిఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వ శాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మిల్లర్ల ద్వారా 76 వేల ధాన్యం కొనుగోలు చేయాలనుకుంటున్నాయ. ఇందుకు యాదాద్రి జిల్లాలో 48 ఐకెపి కేంద్రాలు, 14 పిఎసిఎస్, సూర్యాపేటలో 7 ఐకెపి, 9 పిఎసిఎస్, నల్లగొండలో 35 ఐకెపి 19 పిఎసిఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలోని తొమ్మిది వ్యవసాయ మార్కెట్‌లలో, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని ఐదేసి మార్కెట్‌ల పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సాగనుంది.
పత్తి కొనుగోలుకు సిసిఐ సన్నాహాలు
మరోవైపు పత్తి కొనుగోలు కేంద్రాలను సిసిఐ ఈసారి ఆలస్యంగా ప్రారంభిస్తోంది. సెప్టెంబర్ 30 నాటికే తెరవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ధేశించిన మద్ధతు ధర 4,160 కంటే ఎక్కువగా మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి 5 వేల రూపాయల కుపైగా ధర పలుకుతోంది. దీంతో తమ కొనుగోలు కేంద్రాలు అక్కర్లేదన్న భావనతో సిసిఐ పత్తి కొనుగోలుకు సిద్ధపడలేదు. అయితే సిసిఐ కొనుగోలు కేంద్రాలు లేవన్న కారణంతో వ్యాపారులు, దళారీలు పత్తి క్వింటాల్ ధరను రోజురోజుకు తగ్గిస్తూ పోతున్నా రు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యం లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిసిఐ మళ్లీ సన్నాహాలు చేసుకుంటోంది. మూడు జిల్లాల్లో ఈ దఫా 2 లక్షల 1,576 హెక్టార్లలో పత్తి సాగవగా, 16 లక్షల 12,608 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. గతంలో నల్లగొండ పరిధిలోని నకిరేకల్, చండూర్, దేవరకొండ, మాల్, సూర్యాపేట పరిధిలోని సూర్యాపేట, తిరుమలగిరి, యాదాద్రి పరిధిలోని భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, ఆలేరులో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ దఫా మిర్యాలగూడలో సైతం కొనుగోలు కేంద్రాన్ని ప్రతిపాదించారు. కాగా, సిసిఐ తెలంగాణ రాష్ట్రంలో మూడో ప్రాంతీయ కార్యాలయాన్ని నల్లగొండలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించడం మూడు జిల్లాల రైతులకు మేలు చేయనుంది. ఇప్పటికే అదిలాబాద్, వరంగల్‌లో సిసిఐ కార్యాలయాలున్నాయ. ఈ క్రమంలో కొత్తగా నల్లగొండలో సైతం కార్యాలయం ఏర్పాటుకు సిసిఐ సన్నాహాలు చేస్తోంది.

కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నల్లగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో
కుప్పలుగా పేరుకుపోయిన ఖరీఫ్ ధాన్యం రాశులు