బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 20: బుధవారం నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్ రంగాల షేర్ల దన్నుతో లాభాల బాటలో సాగాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 145 పాయింట్లు లాభపడి 28,129.84 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 40.30 పాయింట్లు లాభపడి 8,699.40 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం ప్రకటించనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలతో చమురు రంగానికి చెందిన షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. అలాగే ప్రైవేటు బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ నికర లాభాలు 31.3 శాతం పెరగడంతో షేరు 1.31 శాతం పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ షేరు 4.72 శాతం పెరగ్గా, ఎస్‌బిఐ షేరు 2 శాతానికి పైగా పెరిగింది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఇన్ఫోసిస్, విప్రోలాంటి కొన్ని ఐటి రంగ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 షేర్లలో 19 షేర్లు లాభపడగా, లుపిన్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, ఏసియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, ఎన్‌టిపిసి నష్టపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల చర్చలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పైచేయి సాధించారన్న వార్తలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో సాగగా, ఐరోపా మార్కెట్లు కూడా లాభాలతోమొదలైనాయి.
ఎన్‌బిసిసి షేర్లకు భారీగా బిడ్లు
ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగంలోని నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బిసిసి)లో 15 శాతం వాటాలను ప్రభుత్వం విక్రయించనున్న నేపథ్యంలో సంస్థాగత ఇనె్వస్టర్ల కోసం కేటాయించిన 7.20 కోట్ల షేర్లకుగాను తొలిరోజే 11.08 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. బిడ్లలో చాలావరకు కనీస షేరు ధర అయిన రూ 246.50కన్నా కాస్త ఎక్కువగా రూ. 246.73కు వచ్చాయి. కాగా, రిటైల్ ఇనె్వస్టర్లకోసం ఆఫర్ ఫర్ సేల్ శుక్రవారం ప్రారంభమవుతుంది.