S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓ చిన్న శ్వాస ( సండేగీత)

విజయాలు సాధించిన వ్యక్తుల చరిత్రలు చదవడం వల్ల స్ఫూర్తిని పొందుతాం. అదే విధంగా మోటివేటర్స్ ఉపన్యాసాలు, వినడం వల్ల కూడా స్ఫూర్తిని పొందుతాం. ఉత్సాహం ఇచ్చే కథలు చదివినప్పుడు కూడా మనం కూడా ఏదో చేయాలన్న కాంక్ష కలుగుతుంది. మూడు అవసరమే.
ఈ మూడింటితోపాటూ మనలని మనం ప్రోత్సహించుకోవడానికి మనం కొన్ని పనులు చేయవచ్చు. మనకి మనమే ప్రోత్సాహంగా మలచుకోవచ్చు. మన జీవితాల్లోని కొన్ని విషయాలు మనకి ప్రోత్సాహం కలుగజేస్తాయి. దీని కోసం మనం ఉదయం, అదే విధంగా సాయంత్రం ఓ ఐదు నిమిషాలు కేటాయించాలి.
ఉదయం లేచిన తరువాత కాలకృత్యాలు ముగించుకున్న తరువాత ఆ ఐదు నిమిషాలు మనకి మనం కేటాయించుకోవాలి. కళ్లు మూసుకొని ఆ రోజు మనం ప్రాధాన్యత ఇచ్చిన పనులు పూర్తి చేశామానన్న విషయాన్ని గమనించాలి. ఎందుకు పూర్తి చేయలేదోనన్న విషయం గురించి ఆలోచించాలి. అదే విధంగా ఆ రోజు మనలని సంతోషపెట్టిన మూడు విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ విషయాలు గుర్తుకొచ్చేంతవరకు కళ్లు మూసుకొనే ఉండాలి.
ఈ పనిని మనం సత్వరం పూర్తి చేయగలిగితే ఈ సంఖ్యని మూడు నుంచి ఐదుకు పెంచాలి.
మనలని సంతోషపెట్టిన ఆ మూడు విషయాలు సత్వరం మనకు గుర్తుకు వస్తే అలాంటి వాటిని కాస్త ఎక్కువగా చేయడానికి ఇష్టపడాలి.
మనం ఒక పని మీద దృష్టిని పెడితే అది మనం పూర్తి చేయడానికి అవకాశం ఇస్తుంది.
మన వలన మనలని సంతోషపెట్టిన మూడు విషయాలు గుర్తుకొస్తే ఇంకా అలాంటి పనులు చేయడానికి దోహదపడుతాయి.
జీవితంలో లక్ష్యాలు ఉండాలి. అయితే ప్రతి రోజులో కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకోవచ్చు. ఆ లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. చిన్నచిన్న లక్ష్యాలు మనలని పెద్దపెద్ద గమ్యాల వైపు మళ్లిస్తాయి.
అందుకని ఓ చిన్న శ్వాస తీసుకొని కళ్లు మూసుకొని ఈ రోజుటి లక్ష్యం వైపు
దృష్టిని సారిద్దాం.

- జింబో 94404 83001