S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్షణం క్షణం

గాలి మనకు ఉచితంగా లభిస్తుంది. వెలుతురు ఉచితంగా లభిస్తుంది. ఇలా ఎన్నో మనకు ఉచితంగా లభిస్తాయి. అవి ఉచితంగా లభిస్తున్నాయి కాబట్టి వాటి విలువ మనకు తెలియదు. వాటి విలువను మనం గుర్తించం.
ఒక్కరోజు సూర్యుడు మబ్బులతో కమ్మి వెలుతురు రాకుంటే ఆ రోజు ఇంటి నిండా దీపాలు వేసుకొని ఆ రోజు కరెంటు బిల్లు గురించి ఆలోచిస్తాం. గాలి అంతే. ఇవి రెండూ ఇంకా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి రాలేదు. ఆ పరిస్థితి రావద్దని కోరుకుందాం.
చెట్టు సంగతి అంతే! దాని విలువని మనం గుర్తించం. ఎన్నో చెట్లని నరికేస్తున్నాం. అదే చెట్టు మనకు ఇస్తున్న ఆక్సిజన్‌ని, పండ్లని, పూలని డబ్బు రూపంలో లెక్కకడితే అప్పుడు గాని విలువ తెలియదు.
ఈ సృష్టి మనకు ఎన్నింటినో ఉచితంగా ఇస్తుంది. అదేదో మన హక్కులా భావిస్తున్నాం. వాటికి ఇవ్వాల్సిన విలువని ఇవ్వడం లేదు. వాటికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వడం లేదు. ఎవరైనా ప్రతి దాన్ని డబ్బు రూపంలో దాని విలువ చెపితే అప్పుడు మనకు దాని విలువ గుర్తుకొస్తుంది.
అమ్మ చేసే చాకిరీని కాని, భార్యచేసే పనిని గాని మనం ఎప్పుడన్నా గుర్తించామా? ఉదయానే్న లేచి అన్నీ మనకు అమర్చి, సమయానికి టీ, టిఫిన్, భోజనం అందిస్తుంటే వాళ్ల విలువ మనకు తెలియడం లేదు. కూరలో ఉప్పు తక్కువైందని, టీలో చక్కెర ఎక్కువైందని, రొట్టె మాడిందని విమర్శిస్తూ ఉంటాం. వారు చేస్తున్న పని విలువని గుర్తించం.
ఇంతెందుకు మన జీవితం గురించి కూడా మనం ఆలోచించం. ఉత్తేజితులం అవము. ఆనందంగా ఉండం.
ఈ మధ్య మా మిత్రుడు అనారోగ్యం పాలై దవాఖానా పాలైనాడు. నెల రోజులు దవాఖానాలో వున్న తరువాత, ఓ నాలుగు లక్షల రూపాయల బిల్లు చెల్లించిన తరువాత అతనికి తెల్సింది జీవితం విలువ.
ప్రతి దాన్ని డబ్బు రూపంలో లెక్కకడితేనే దాని విలువ మనకు తెలుస్తుంది. కానీ ఇవి అన్నీ డబ్బు రూపంలో విలువ కట్టకుండా ఆనందించాల్సిన విషయాలు.
మనం బతికి ఉండటం కూడా అదేదో హక్కుగా భావిస్తాం. బతికి ఉండటంలోని థ్రిల్‌ని అనుభవించం.
ఎప్పుడైనా ఉదయానే్న నిద్రలేచి సూర్యోదయాన్ని చూస్తామా? ఉదయాన వచ్చే చల్లటి గాలిని అనుభవిస్తున్నామా? సీతాకోక చిలుక ఎగిరి పువ్వు మీద వాలడాన్ని గమనిస్తామా?
జీవించి ఉండటం అనేది ఓ ప్రత్యేకమైన హక్కుగా మనం ఎప్పుడైనా భావిస్తామా? బతికి ఉండటమే ఓ గొప్ప విలువగా మనం భావిస్తే ఎంత బాగుంటుంది. ప్రతి క్షణం బతికి వున్నందుకు ఈ సృష్టి దండం పెట్టుకుంటే ఇంకా ఎంత బాగుంటుందీ?
ఉదయాన్ని, సాయంత్రాన్ని అనుభవించండి. ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి.