S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేట

కుల నిర్మూలన ఆశయంతోనో
కులరహిత సమాజం కోసమో ఆరాటపడుతూ
గొప్ప ఆకాంక్షతో ఉద్యమ సారధులను కీర్తిస్తూ
శతజయంతులూ, వర్ధంతులూ
అంగరంగ వైభవంగా జరుపుతూ
వేదికల్ని దద్దరిల్లజేస్తూ
కుటుంబంలోనూ బంధువుల మధ్యా
కులగజ్జిని సవరించుకుంటూనే ఉన్నాం

బళ్ళో సీటు దగ్గర్నుండి రాజకీయ కుర్చీ వరకూ
నీడ కింద చేరి అవకాశాలు
చేజిక్కించుకుంటూనే ఉన్నాం
అవసరాలు చక్కబెట్టుకోవడం మానడం లేదు

అందుకేనేమో
వంశోద్ధారకుల కోసం
నాటి నుండి నేటి వరకూ
భ్రూణహత్యలు అనంతంగా కొనసాగుతూనే ఉన్నాయ్

ఈ ఛాయ
ఉదయం పొడుగ్గా సాగినా
బాల్యంలో గుర్తించకపోయనా
మధ్యాహ్నం మన కాళ్లకిందే ఉన్నది కాస్తా
మనం పెరుగుతున్న కొద్దీ
వామనావతారంలా అంతకంతకూ
విశ్వరూపం చూపుతూనే ఉంది

అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే
దాన్ని పైకెదిగే సోపానంగా అడ్డదార్లు వెతికితేనే తంటా
అప్పుడే కుల జాడ్యం మత జాడ్యం
మనసుల్లోంచి వదలనంటాయ్

ఇంతకీ
ఆ ఛాయ
మనల్ని వెంటాడుతోందా?
మనమే దాన్ని వెంటాడుతున్నామా?

- శీలా సుభద్రాదేవి 8106883099