S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యోగులు - పనితనం

ప్రేరణకు ఎందుకు
దూరం అవుతారు?

ఉద్యోగులు ప్రేరణకు దూరం అవడానికి
అనేక కారణాలు ఉంటాయి.

పక్షపాత వైఖరితో విమర్శలు
వ్యతిరేక ధోరణిలో విమర్శలు ప్రజల చేత అవమానం
పని నైపుణ్యం లేని వారికి అవార్డులు రావడం
వైఫల్యాలు లేదా వైఫల్య భయాలు
విజయ సాధనతో సంతృప్తి దిశ దర్శకత్వం లోపం
లక్ష్యాలు కొరవడడం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం
ప్రాధాన్యతలు లేకపోవడం
ఇతరులతో చెడుగా మాట్లాడడం ఆఫీసులో రాజకీయాలు
కపట ప్రవర్తన స్థాయి తక్కువగా ఉండడం
తరచూ మార్పులు అధికారం లేని బాధ్యతలు

ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి సంస్థలో తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తారు. కొంతమందికి మంచి మంచి కంపెనీలలో ఉద్యోగం రావడం, ఆపైన వారి ప్రతిభకు మెరుగులు దిద్దే శిక్షణ వారికి లభిస్తుంది.
చాలా సంస్థల్లో ఉద్యోగంలో చేరిన వారికి శిక్షణ ఉండదు. ఫలితంగా ఉద్యోగ నిర్వహణలో ఉద్యోగి అసంతృప్తికి లోనవుతూ ఉంటాడు. ఈ సంస్థల్లో ఉద్యోగి ప్రతిభావంతంగా పని చేసినా ఎవరూ అభినందించరు. మెచ్చుకోలు అస్సలు ఉండదు. ఇటువంటి వాతావరణం ఉద్యోగిలో అంతర్గతంగా ఉన్న ప్రేరణను ఎదగనివ్వదు.
కంపెనీలో మంచి శిక్షణ లభించడం వలన ఉద్యోగి త్వరత్వరగా ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు తెలుసుకుంటాడు. తన శక్తిని సద్వినియోగపరుస్తూ ఉద్యోగం చక్కగా చేస్తాడు.
కాలం గడిచే కొలదీ...
కాలం గడిచే కొలదీ ఉద్యోగిలో ప్రేరణ తగ్గడం మొదలవుతుంది. ఈ దశలో ఉద్యోగి తన వృత్తిలో కుయుక్తులు నేర్చుకుంటాడు. ఈ దశలో ఉద్యోగి ఏ మాత్రం ప్రేరణ పొందడు. పై అధికారి తనను తప్పు పట్టకుండా ఉండే రీతిలో ఉద్యోగ నిర్వహణ చేస్తూ ఉంటాడు.
ఇటువంటి స్థితి ఉద్యోగి ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తుంది. ఎక్కువమంది ఈ స్థితిలో ఉంటారు. ప్రేరణ పొందిన నైపుణ్యంగల వ్యక్తి వ్యాపార రహస్యాలను తెలుసుకుని అందులోని కుయుక్తులను దొంగాటగా ఉద్యోగ నిర్వహణ చేసేవారికి వదిలి ఎదుగుదల చెందుతాడు. ప్రేరణకు దూరమయిన ఉద్యోగులు కంపెనీని మోసం చేయడం ప్రారంభిస్తారు.
ఇటువంటి ఉద్యోగులను తిరిగి ప్రేరణ పొందే స్థితికి తీసుకురావాలి. దానికి తగిన శిక్షణ కల్పించాలి. ఏ ఉద్యోగి ప్రేరణ తగ్గుదల దశలో ఎక్కువకాలం ఉండకూడదు. ఇలా ఉంటే అస్తమానం ఉన్నత అధికారులను తిట్టిపోయడానికి ఉద్యోగులు తయారవుతారు. ఈ స్థితికి ఉద్యోగులు వెడితే వారిని ఉద్యోగం నుండి తొలగించడం ఉత్తమం. అధికారులు, ఉద్యోగులు సమిష్టి కృషి చేసినప్పుడే యాజమాన్యం ఆశించే విజయ సాధన చేయగల్గుతారు.
సంతృప్తి చెందిన వ్యక్తి ప్రేరణ అవసరం లేదనుకుంటాడు. దీని వలన మనిషిలో జడత్వం మొదలవుతుంది. మనిషి ఉసిగొల్పబడినపుడు ప్రేరణ పుడుతుంది. మనిషికి ఇటువంటి ఉసి కల్గాలంటే పూర్తి అంకిత భావం ఉండాలి. మనిషిలో జడత్వం తొలగితే గాని కొత్త ప్రేరణ మార్గాలు ఆ మనిషి మీద పని చేయవు. జడత్వాన్ని తొలగిస్తే ప్రేరణ దానంతటదే మళ్లీ కలగవచ్చు.
ప్రేరణ
మనుషులు సాధారణంగా, తమ కారణాలు కారణంగా పనులు చేస్తూ ఉంటారు. ఒకరి కోసం మరొకరు పని చేయడానికి ముందుకురారు.
తండ్రీ కొడుకులు కలిసి ఒక ఆవుదూడను తమ పొలంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. విచిత్రం ఏమిటంటే దానిని ముందుకు గెంటే కొలది అది వెనుకకు వెళ్లేది. చివరకు ఒక చిన్నారి తన చిటికెన వేలు ఆవుదూడ నోటిలో పెట్టింది. ఆ దూడ వేలును చప్పరించడం మొదలుపెట్టింది. ఆ చిన్నారి పొలం వైపు అడుగులు వేస్తూంటే దూడ అనుసరించింది.
ఆవుదూడ రావడానికి కారణం వేరు. ఆ కారణాన్ని వాడుకుని చిన్నారి దానిని కావలసిన చోటుకు తీసుకువెళ్లింది. ఈ విషయం మర్చిపోకూడదు. అందుకే యాజమాన్యం తీసుకోవలసిన చర్యలు ఏమిటో తెలుసుకోవాలి.
శిక్షణ ద్వారా ‘వ్యవస్థ’ తనది అనే భావం కలిగేలా చేయాలి.
బాగా పని చేసేవారికి ‘రివార్డులు’ ఇవ్వాలి. స్పష్టమైన, కచ్చితమైన లక్ష్యాలు నిర్దేశించాలి.
యాజమాన్యం ఎక్కువగా ఆశిస్తున్న విషయం చెప్పాలి.
కొలమానాలు ఉండే స్పష్టమైన బెంచ్ మార్కులు ఏర్పాటు చేయాలి.
ఇతరుల అవసరాలు ఏమిటో మూల్యాంకనం చేసుకోవాలి.
తలపెట్టిన పెద్ద ముఖచిత్రంలో ఇతరులను భాగస్వాములను చేయాలి.
ఇతరులకు మీరు ఒక రోల్ మోడల్‌గా ఉండేటట్లు ప్రవర్తించాలి.
ఇతరులలో ఆత్మవిశ్వాసం పెరిగేటట్లు ప్రోత్సహించాలి.
మానవ వనరులు
అన్ని వనరులలో గొప్ప వనరులు మానవ వనరులు. ఈ మానవ వనరులను వినియోగించుకునే విధానాలలో వినియోగించుకోగల్గితే ఎన్నో అద్భుతాలు చేయగల్గుతారు.
ఉద్యోగుల శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకుని, వారికి తగిన బాధ్యతలు అప్పగించి ‘మీరే ఈ పని చేయగలరని’ ఒక చిన్న ఉత్సాహపూరిత భావాన్ని వారికి తెలియజేయగల్గితే వారు సర్వశక్తులు వినియోగించి సత్ఫలితాలు సాధించగల్గుతారు.
మానవ వనరులను పట్టించుకోకుండా వదిలివేస్తే అవన్ని అడవికాచిన వెనె్నల మాదిరి తయారవుతాయి. ‘ఆధిక్యత’కు అవకాశం ఇవ్వకుండా ఉద్యోగులతో సమిష్టి భావంతో ప్రవర్తిస్తూ వారిని వృత్తి వైపు మళ్లించుకుంటూ యాజమాన్య నిర్వహణ చేస్తే ప్రతి ఉద్యోగి వారి శక్తికి మించి పని చేస్తారు.
ముఖ్యంగా ఏ ఇద్దరు ఉద్యోగుల పనితీరును సరిపోలుస్తూ మాట్లాడకూడదు. ఎవరికి ఉండే ప్రతిభ వారికి ఉంటుంది. ఆ ప్రతిభలను గుర్తుచేస్తూ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి పని తీరుపై యాజమాన్యం దృష్టి నిలుపుతోందనే విషయం ఉద్యోగులకు తెలియాలి.

- సి.వి.సర్వేశ్వరశర్మ