S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అహం (కథాసాగరం)

బొఖారా ప్రాంత రాజయిన షాయిబ్రహీం విలాసవంతమయిన జీవితం గడిపేవాడు. మెత్తటి పరుపుపై పరిమళాలు వెదజల్లే పూలు చల్లి వాటిపై నిద్రించేవాడు. కానీ అతను సత్యానే్వషి. దైవం గురించి చింతించేవాడు. సాధు సన్యాసుల్ని ఆహ్వానించేవాడు.
ఒకరోజు పడుకోబోతూ ఉంటే తన మేడపై ఎవరో తిరుగుతున్నట్లు తెలిసి వాళ్లను పిలిపించాడు. ఎందుకిక్కడ తిరుగుతున్నారన్నాడు. ‘మా ఒంటెలు తప్పిపోయాయి. అందుకని వెతుకుతున్నామ’న్నారు. ‘మీ ఒంటెలు తప్పిపోతే అవి నా మేడ పైకి ఎలా వస్తాయి?’ అన్నాడు రాజు. ‘మీరు పూలపాన్పు మీద పడుకుంటే సత్యం మీకు అవగాహన కాదు’ అన్నారు వాళ్లు.
ఆ మాటల్తో ఆశ్చర్యపడిన రాజు ‘మరి మార్గమేమిటి?’ అన్నాడు. వాళ్లు ‘కాశీలో కబీరన్న సాధువు ఉంటాడు. ఆయన జ్ఞాని. ఆయన శిష్యరికం చేస్తే మీకు సత్యమంటే ఏమిటో బోధపడుతుంది’ అన్నాడు.
ఇబ్రహీం రాజ్యం వదిలి కాశీ చేరాడు. కబీర్ దగ్గరికి వెళ్లి తనని శిష్యుడిగా స్వీకరించి జ్ఞానబోధ చెయ్యమన్నాడు. కబీరు ‘నేను మగ్గం నేసుకుని బతికే మామూలు మనిషిని. ఐశ్వర్యవంతుడయిన రాజు నీవు. నీకూ నాకూ పొసగదు’ అన్నాడు.
రాజు ‘అయ్యా! నేను అన్నీ త్యజించి మీకు సేవ చేసి తరించడానికి వచ్చాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి’ అన్నాడు.
కబీరు ఆలోచించి ‘సరే’నన్నాడు. రాజు సేవకుడయ్యాడు. కబీరు చెప్పిన పనులు చేస్తూ ఐదేళ్లు గడిపాడు. పెదవి విప్పి వ్యతిరేకమయిన పని కూడా చేస్తాననలేదు. గురు శుశ్రూషలో గడిపాడు. కబీరు భార్య ‘ఐదేళ్లుగా రాజు మీ సేవలో ఉన్నాడు. ఆయనకు మీరు జ్ఞానబోధ చెయ్యండి’ అంది. కబీరు ‘కానీ దానికి తగిన పరిణితి అతనికి ఇంకా రాలేదు’ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి ‘మీరు ఎట్లా చెప్పగలరు?’ అంది.
కబీరు ‘కావాలంటే పరీక్షిద్దాం. నువ్వు మేడ మీదకు వెళ్లి చెత్తవూడ్చి అతను ఇంట్లో నించి బయటకు వెళ్లేటప్పుడు అతని మీద పడేట్లు వేసి చూడు’ అన్నాడు.
కబీరు భార్య భర్త చెప్పినట్లే రాజు ఇంటి నించీ బయటకు వెళుతూ ఉంటే చెత్త అతనిపై వేసింది. రాజు తలెత్తి చూసి ‘నా తలపై కిరీటముంటే ఇలా జరిగేదా?’ అన్నాడు.
కబీరు భార్య జరిగిన సంగతి భర్తతో చెప్పింది. కబీరు ‘చూశావా? నేను అన్న అహం అతనిలో ఇంకా ఉంది’ అన్నాడు.
రాజు కబీరు సేవలో మరో ఐదేళ్లు గడిపాడు. మొత్తానికి పది సంవత్సరాలు గడిచిపోయాయి. కబీరు భార్యతో ‘ఇప్పుడు అతన్ని పరీక్షించే సమయం వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వు మేడపై నించీ అతనిపై చెత్త పడేటట్లు చేసి చూడు’ అన్నాడు.
భర్త చెప్పినట్లే ఆమె మేడపై నించీ రాజుపై పడేటట్లు చెత్త వేసింది. రాజు తలెత్తి చూసి చేతులు జోడించి ‘అమ్మా! సరయిన పని చేశావు. నా శరీరం, మనసు చెత్తలాంటివే. దానిలో భాగాలే’ అన్నాడు.
జరిగిన సంగతి భర్తకు చెప్పింది. కబీరు ఎంతో సంతోషంతో ‘అతనిలో అహం సంపూర్తిగా అంతరించింది. పరిణితి ఏర్పడింది’ అని రాజును పిలిచి ‘ఇనే్నళ్ల శ్రమ ఫలించింది. ఇప్పుడు వెళ్లి రాజ్యాన్ని పాలించు. కిరీటం ధరించినా, కుటీరంలో వున్నా అహం నినే్నమీ అంటదు’ అని రాజును పంపేశాడు. *

-సౌభాగ్య 9848157909