S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

న్యూటన్ గమన సూత్రాలు (శాస్ర్తియ ఆవిష్కరణలు)

న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రాల ప్రకారం ఈ విశ్వంలోని ప్రతి భారీ రేణువు మరో భారీ రేణువు చేత ఆకర్షింపబడుతుంది. ఈ ఆకర్షణ వాటి ద్రవ్యరాశితో అనులోమంగా, వాటి మధ్య దూరపు స్కైర్‌కు విలోమంగా సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధం అన్ని సమయాలు, అన్ని ప్రదేశాలకు వర్తిస్తుంది. అందువల్ల ఇది సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంశంగా గుర్తింపు పొందింది.
న్యూటన్ గమన సూత్రాలలో మూడు భౌతిక సూత్రాలు ఉన్నాయి. ఇవి ఒక వస్తువు పైన పనిచేసే వత్తిడుల మధ్య సంబంధం. ఫలితంగా కలిగే చలనం గూర్చి వివరిస్తాయి. వాటిని ఈ రీతిలో క్లుప్తంగా పేర్కొనవచ్చు.
మొదటిది - ఒక వస్తువు పైన ఏదైనా ఒత్తిడి పనిచేస్తే తప్పించి అప్పటి వరకూ అది వున్న స్థితిలో స్థిరంగా లేదా ఒక సరళరేఖపై ప్రయాణిస్తున్న విధంగా ఉంటుంది.
రెండోది - ఒక వస్తువు త్వరణం దానిపైన పనిచేసే ఒత్తిడికి అనులోమంగా, దాని ద్రవ్యరాశికి విలోమంగా ఉంటుంది.
మూడోది - వస్తువు పైన మరో వస్తువు వల్ల ఒక వత్తిడి పని చేసినప్పుడు అంతే మొత్తంలో ఒత్తిడి ఆ వస్తువు పైనా పని చేస్తుంది.
మొత్తం మీద చూసినప్పుడు న్యూటన్ సూత్రాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇవి ఈ విశ్వానికి సంబంధించి గడియారపు ముళ్లు చలనం లాంటి కచ్చితమైన చలనాన్ని నిర్ధారించాయి. న్యూటన్ ప్రతిపాదించిన తరువాత రెండు వందల సంవత్సరాల వరకూ అవి చెలామణి అయ్యాయి. ఈ దృష్టితో చూస్తే విశ్వం ఒక విధంగా దైవం కీ ఇవ్వగా పని చేస్తూ వున్న గడియారం లాంటిది. పరిపూర్ణ యంత్రం లాంటిది.

-బి.మాన్‌సింగ్ నాయక్