S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీలోని శత్రువులను దరికి రానీయకండి!

మనిషికి మొదటి శత్రువు కోపం. పగ, ద్వేషం, అసూయ, ఇతరులను ఆమోదించలేని లక్షణం - ఇవన్నీ మిగిలిన శత్రువులు.
ఇందులో పగ, ప్రతీకారం అనేవి అనాగరిక ఉన్మాదాలు. మనిషిని మృగంగా మార్చేస్తాయి. దురాశ మనిషిని రాక్షసుడిగా, నేరస్థుడిగా చేస్తుంది.
మనిషికి ప్రశాంతతను చేకూర్చే దివ్యౌషధాలు ఆప్యాయత, అనురాగాలు వంటి ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు.
డబ్బును కొలమానంగా చేసుకునే నైజం మనిషిలోని నైతిక శక్తిని నాశనం చేస్తుంది. మనిషి పతనానికి పునాదులుగా నిలిచేవి కక్షలు.
ప్రతీకార ధోరణి మనిషిలోని వివేకాన్ని అణచివేస్తుంది. మనిషిలో అనుమానం అతడిని తప్పుడు మార్గంలోకి మళ్లిస్తుంది. పైగా ఆలోచనా శక్తిని దూరం చేస్తుంది.
ఇవన్నీ మనిషిలోని అంతర్గత శత్రువులు. వీటిని తరిమికొట్టాలి. అప్పుడే మనిషి ప్రశాంత వాతావరణంలో తనలోని నైపుణ్యాలకు జీవం పోసుకోగల్గుతాడు.
కొంతమంది మానసిక పరిపక్వత చెందక పోవడం వలన, మరి కొంతమంది అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటుగా ఉండడం వల్ల, సరైన కుటుంబ వాతావరణం లేనివారు దురాశకు లోబడి, నేరప్రవృత్తి కల్గి ఉంటారు.
ఇటువంటి వారు తాము చేసే ప్రతి పని కరెక్టు అని భావిస్తారు. వీరు అంత సులువుగా మారరు. పాప పుణ్యాలు వీరికి అనవసరం. పునరాలోచన వీరికి ఉండదు.
ఎలా ఉండాలి?
మనిషి తనలోని ప్రతిభను సమర్థవంతంగా, ప్రయోజనకరంగా వినియోగించుకోవాలంటే తమ చుట్టూ వున్నవారితో చక్కని సంబంధ బాంధవ్యాలు కొనసాగించుకోవాలి.
ఆ విధంగా మనిషి ప్రవర్తిస్తే అతడు తన పనుల్లో తాజాదనం చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించగల్గుతాడు.
ఒంటరిగా ఉంటూ, ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా జీవితాన్ని గడిపేవారు సులువుగా డిప్రెషన్‌కు గురి అవుతారు. అందుకే వీలయినంత వరకు సంఘజీవిగా బ్రతకాలి.
మనిషికి అసలైన, సిసలైన ఆప్తులు స్నేహితులు, బంధువులు. వారితో సత్సంబంధాలు కొనసాగించాలి.
ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, అత్తమామలతో అనుబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ప్రవర్తించడం అలవరచుకోవాలి.
ఇరుగు పొరుగు వారితో ఆత్మీయంగా ఉండాలి. ఇతరులకు సహాయం అవసరమైతే తక్షణం స్పందించాలి. మనిషికి అత్యవసర సమయాల్లో ఆదుకునేది ఇరుగు పొరుగు వారే అని మరచిపోకూడదు.
ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు ఏర్పరచుకోకపోతే మనిషిలో ఒంటరితనం మొదలయి అభద్రతా భావంతో నిరుత్సాహం, నిరాశ, నిస్పృహలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది.
బంధువులు, స్నేహితులు, భాగస్వాములతో చిన్నచిన్న అపార్థాలు తలెత్తినపుడు వెంటనే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇటువంటి సందర్భాలలో కాలమే అన్నింటికి పరిష్కారం అనుకుంటే అది పెరిగి పెద్దదయి కక్షలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ