తెలుగు వేదం
Published Sunday, 23 February 2020సీ॥ భవ్యోరురస మహోత్పలము నాదు తెలుంగు;
పరిమళభరిత చంపకము తెలుగు;
గర్జన శార్దూల ఘనము నాదు తెలుంగు;
ఊర్జిత మత్త్భేమోయి! తెలుగు;
మేలైన రంగు సీసాలు నాదు తెలుంగు;
కందమాకందంబుగాదె! తెలుగు;
లలిత యోగిని ఆటవెలది నాదు తెలుంగు;
కేతనంబౌ తేటగీతి తెలుగు;
వెలుగు ఇహపర సాధన ద్విపద తెలుగు;
కల్ప‘తరువోజ’ తీరగాదె! తెలుగు;
నవవినోదాత్మ నాదంబు నా తెలుంగు;
చేతనోద్దీప్త వేదంబు నా తెలుంగు;
కళ్లు తెరచున? చదువుల బళ్లు మనవి