దృక్పథం
Published Sunday, 16 February 2020ప్రతి ఉదయం లేవగానే మన ముందు రెండు ప్రశ్నలు ఉంటాయి. అవి- 1. ఈ రోజు మన జీవితంలో ఏం మార్పుని తీసుకొని వస్తుంది?
2. ఈ రోజుతో మనం ఏం మార్పు తీసుకొని రాగలము?
ఏం జరగాలో అంతా నిర్ణయం అయిపోయిందా? మనం ఏం చేసినా అది మారదు అనే దృక్పథం ఒకటి ఉంటుంది.
మన ప్రయత్నం మనం చేయాలి అన్న దృక్పథం మరొకటి..
ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం ఎంపిక చేసుకుని మనం ఆ రోజుని కొనసాగించాలి.
అది ఎంపిక చేసుకోవడం మన మీద ఆధారపడి ఉంది.
ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.
మొదటి ప్రశ్నను ఎంపిక చేసుకుంటే జరిగేది ఏదో జరుగుతుంది తప్ప, పెద్ద ఉత్సాహం ఉండదు. రెండవ ప్రశ్నను ఎంపిక చేసుకుంటే మనం వున్న పరిస్థితిని ప్రభావితం చేసే విధంగా మన మనస్సు అందుకు అవకాశాలు కల్పిస్తుంది.
మన ప్రయత్నం లేకుండా జరిగే విషయాల కోసం ఎదురు చూడటం శుద్ధ దండుగ.
ప్రతి దానికి మన ప్రయత్నం మనం చేయాల్సిందే..
ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి.
ప్రతి విషయంలోనూ ఆశావహ దృక్పథం వుండాలి.
ప్రతి పనిలోనూ మన ప్రయత్నం వుండాలి. ఫలితం ఎలా ఉంటుందన్నది వేరే విషయం.
ప్రయత్నం చేసి ఓడిపోయినా అంత బాధ ఉండదు. ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓడిపోవడంలోనే బాధ వుంటుంది. అదీ ఎక్కువగా -
ఏ దృక్పథంతో వుండాలన్నది మన నిర్ణయం..