S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చురుకైన మెదడు కోసం సుగంధాలు

కొన్ని వాసనలు మత్తెక్కిస్తాయి. కొన్ని మనసును స్వాంతన ఫరుస్తాయి. కొన్ని మనిషిని ఉత్తేజితం చేస్తాయి.
మల్లెపూల సువాసన లైంగికోద్దీపనాన్ని కలిగిస్తుంది. కమ్మగా పోపు తాలింపు పెడితే ఆ సువాసనకి పక్కింట్లో వారిక్కూడా ఆకలి కలుగుతుంది. కొన్ని స్వీట్లు, హాట్లు వండుతుంటేనే ఆ వాసనకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. మామిడి పండును వాసన చూస్తేనే నోట్లో నీళ్లూరుతాయి. పొయ్యి మీద ఉడుకుతున్న అన్నంలోంచి వచ్చే వాసన ముక్కుపుటాలకు తగలగానే ఎక్కడ లేనంత ఆకలి కలుగుతుంది. వాసనల ప్రభావం మనసు మీద, మెదడు మీద ఉంటుంది కాబట్టే సుగంధ ద్రవ్యాలకు అంత ప్రాధాన్యత ఉంది.
శాస్తవ్రేత్తలకు సుగంధాల ప్రభావం గురించి బాగా తెలుసు. శరీర నిర్మాణ కార్యక్రమాలలో ఈ సువాసనల ఫలితాన్ని అధ్యయనం చేస్తే, కొన్ని అనుకూల ప్రయోజనాలు సాధించవచ్చు గదా అనే అంశం మీద ఇప్పుడు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఒఆ్ఘఆళజష ఖఒళ యఛి ఘూ్య్ఘౄఒ అనేది ఇప్పుడు ఒక నూతన పరిశోధనాంశంగా మారింది. ఏ వాసన శరీర జీవన క్రియల్లో ఏ అంశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోందనేది కొత్త అధ్యయనాంశం.
చదువుకునే పిల్లలకు రాత్రి నిద్రలో గులాబీల సువాసనను వాళ్లు పీల్చుకునేలా చేస్తే వాళ్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందనే అంశం మీద ఇటీవల జరిగిన ఒక పరిశోధన ఈ అధ్యయనంలో ముఖ్యమైంది. గులాబీల సుగంధం మెదడు పనితీరుని అనుకూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు నిర్ధారిస్తున్నారు.
ఒక సువాసనను ఆఘ్రాణిస్తూ, ఒక కొత్త విషయాన్ని చదివి, నిద్రపోతే తెల్లవారాక మళ్లీ ఆ సుగంధం తగలగానే ఆ చదివిన విషయం మొత్తం జ్ఞాపకం వస్తుందని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. సువాసనలకు ఈ గుణం ఉంటుంది కాబట్టి శవాన్ని ప్రజల దర్శనార్ధం ఉంచినప్పుడు కొన్ని సుగంధాలను వాడవద్దంటారు. ఎందుకంటే ఆ వాసన ఎప్పుడు తగిలినా అదే విషాద సంఘటన మనసులోకొచ్చి దుఃఖం ముంచుకొస్తుంది కాబట్టి. ఘంటసాలగారి భగవద్గీత ఎక్కడైనా వినిపిస్తే ‘‘అయ్యో! ఎవరైనా పోయారేమో’’ అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే దాన్ని వింటే అలానే జరుగుతుంది. కలరాబిళ్లల వాసన కూడా అలాంటిదే!
పూర్వం పెళ్లిళ్లలో కర్పూరం బిళ్లలు అంటించిన పుల్లలు ఇచ్చేవారు. జలుబుతో బాధపడేవారికి తుమ్ములు రాకుండా చేయటం అనే ప్రయోజనంతో పాటు ఆ వాసన ఎప్పుడు చూసినా ఆ పెళ్లి గుర్తుకు రావటం అనే ప్రయోజనం కూడా అదనంగా కలుగుతుందన్న మాట!
వాసన అనేది సంస్కృత పదమే! వాసన అంటే, మునుపు అనుభవించిన దాని స్మరణ అని భావార్థం. ‘పూర్వజన్మ వాసన’ అంటే జశచిఖళశషళ యచి దజఒ చ్యిౄళూ ఇజూఆ్ద అని! వాసనకి సమానమైన తెలుగు పదం ఉండేదేమో తెలీదు. కంపు కూడా వాసనే! కానీ, తెలుగులో ఆ పదం అర్థ విపర్యం చెంది, కేవలం దుర్గంధం అనే అర్థంలోనే మనం వాడుతున్నాం. కన్నడ భాషలో కంపు ఇంపైన పదమే! వారికి కంపు సువాసన. మనకు చెడ్డ వాసన. మురికి కంపు అంటాం గానీ, మల్లెల కంపు అనలేం.
‘‘మలిగండ్లుదీసిన మంచిబియ్యములు, నిలుచు విధంబున నిస్సార దుష్ట వాసన నెంతయు వడి కడ కొత్త. భాసరజ్ఞాన సంపద వృద్ధిబొందు’’ అనే కవి ప్రయోగం ఇదే చెప్తుంది. రాళ్లేరిన మంచి బియ్యం నిలిచినట్టు నిస్సార దుష్టవాసనల్ని వడగట్టి కొత్త భాసురజ్ఞాన సంపద వృద్ధి పొందటం గురించి...!
సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ తాజా సంచికలో ప్రచురితం అయిన ఒక నివేదికలో . చఖూళశ య్‌ౄౄళజళూ అనే శాస్తవ్రేత్త ‘వాసనలు-జ్ఞాఫకశక్తి’ అనే అంశం మీద చేసిన పరిశోధనాంశాలను ప్రచురించింది. రోజువారీ మనం ఆఘ్రాణించే అనేక సుగంధాలను కొన్ని నిర్ధిష్ట లక్ష్యాల సాధనకు ఉపయోగించటం ఎలా అనేది ఆయన పరిశీలనాంశం.
కన్ను, చెవి, చర్మం, నాలుక, ముక్కులనే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే జ్ఞానాన్ని ఇంద్రియార్థాలంటారు. కన్ను ద్వారా చూపును, చెవి ద్వారా శబ్దాన్ని, చర్మం ద్వారా స్పర్శను, నాలుక ద్వారా రుచిని, ముక్కు ద్వారా వాసననీ (్యచ్ఘిషఆజ్యశ) గ్రహిస్తున్నాం. నిజానికి, ఈ ఐదు ఇంద్రియార్థాలూ కలిసి పనిచేస్తూ జ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందటాన్ని ఇంద్రియాభిగ్రహణం అంటారు. ఈ ఇంద్రియాభిగ్రహణం (ఒళశఒ్యక జశచ్య్ఘిౄఆజ్యశఔళూషళఔఆజ్యశ) జరిగే క్రమంలో కొంత భాగం జ్ఞాపకాల పొరల్లోకి కూడా చొచ్చుకు వెడుతుంది అంటారు ఈ జుర్గన్ కొమీర్ అనే శాస్తవ్రేత్త.
జ్ఞాపకాల పొరలు కొన్ని అప్పటికప్పుడు గుర్తుండేవి ఒ్ద్యఆఆళూౄ ౄళ్యూౄక అని, దీర్ఘకాలం గుర్తుండేవి యశఆళూౄ ౄళ్యూౄక అని రెంఢు విధాలుగా ఉంటాయి. విద్యార్థులు ముక్కునపట్టి చదివేవి షార్ట్‌టర్మ్ మెమరీలోనూ, అర్థం చేసుకుని చదివేవి లాంగ్‌టర్మ్ మెమరీలోనూ నిక్షిప్తం అయి ఉంటాయి. తక్కువ కాల పరిమిత జ్ఞాపకాలలోని అంశాలను ఎక్కువ కాలపరిమిత జ్ఞాపకాలలోకి మళ్లించే ప్రక్రియని ష్యశఒ్యజజ్ఘూఆజ్యశ అంటారు. నిజమైన జ్ఞాపకశక్తి అంటే అప్పటికప్పుడు గుర్తుండేది కాదు, కలకాలం మన బుర్రలో పదిలంగా ఉండేది. అలా గుర్తుండాలంటే ఈ కన్సాలిడేషన్ ప్రక్రియ ఘనంగా జరగాలి. సువాసనలు అందుకు ఏవిధంగా దోహదపడతాయనేదే జుర్గన్ కొమీర్‌గారి పరిశోధన. ‘సువాసన-సుబోధకత’ గురించి ఆయన విశేష కృషి చేశారు. మెదడుకూ సువాసనలకూ లంకె అందితే మెదడు పనితీరును శక్తిమంతం చేసే అంశాలు సుసాధ్యం అవుతాయనేది శాస్తవ్రేత్తల నమ్మకం.
ఈ పరిశోధన కోసం 6వ తరగతి చదివే 54 మంది జర్మనీ విద్యార్థుల్ని ఆయన ఎంచుకున్నారు. ఓ వారం రోజుల పాటు గులాబీల వాసన వచ్చే అగరుబత్తిల్ని వెలిగించి పక్కన ఉంచుకుని ఇంట్లోనే ఇంగ్లీషు భాషకు సంబంధించిన అంశాలు వాళ్లు శ్రద్ధగా చదివేలా ఏర్పాట్లు చేయించాడు. వీళ్లలో కొందరికి వాళ్లు నిద్రపోయే సమయంలో కూడా అదే వాసన అందేలా ఏర్పాటు చేశాడు. వారం తరువాత పరీక్షలు పెడితే నిద్రలో కూడా అదే వాసనను ఆఘ్రాణించిన విద్యార్థుల్లో 30% అదనపు ప్రతిభను పరిశోధకులు గుర్తించారు. సుగంధం అనేది జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తుందనేది ఈ పరిశోధనలో తేలిన విషయం.
మెలకువలో చదివిన విషయం దీర్ఘకాలిక జ్ఞాపకాల పొరల్లోకి చేరటం అనే కన్సాలిడేషన్ ప్రక్రియలో సువాసన (అరోమా) గణనీయమైన పాత్ర నిర్వహిస్తుందనేది ఇక్కడి ముఖ్య విషయం. విద్యార్థులకు ముఖ్యంగా పరీక్షల కాలంలో వాళ్లు చదివేప్పుడు అందించిన పరిమళాన్ని ఆ రాత్రంతా వాళ్లకు నిద్రలో కూడా అందేలా చేస్తే పరీక్షల్లో మరింత రాణిస్తారని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీన్ని మరింత శాస్ర్తియంగా నిర్ధారించి, సువాసనల ప్రభావం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరచడం గురించి ఇప్పుడు కొత్త ఆలోచనలకు ఈ పరిశోధన తలుపులు తెరిచింది.
ఈ ప్రయోగంలో విద్యార్థులకు నచ్చే పరిమళం అందించటం దానే్న రాత్రంతా కొనసాగించటం అనేవి ముఖ్యాంశాలు. ఏ పరిమళానికి మెమరీని పెంచే గుణం ఉందో ఇంకా బాగా అధ్యయనం జరగాలి. ఎక్కువ సేపు మంచి పరిమళాన్ని అందించే ధూప్‌స్టిక్స్, సెంట్సు, పెర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్స్ లాంటివి ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం నిరపాయకరంగా తయారైన వాటిని ఎంచుకుంటే మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనం కూడా ఈ ప్రయోగాలను చేయవచ్చు.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com