పజిల్--764
Published Sunday, 9 February 2020

ఆధారాలు
*
అడ్డం
*
1.సగం కర్ణాటకపురి, సగం పాకిస్తాన్ కలిస్తే, ఈ స్వీటు తయారౌతుంది (5)
4.మడమ, మడమకీలు (4)
6.వేగము (3)
8.ఒక ఆభరణంతో మొదలై, మొత్తానికి కొండంత అయింది (3)
9.ఏనుగే. మధ్యలో గతం వెనక్కి తొంగి
చూస్తుంటుంది (4)
11.పూర్వం ఇలా అంటూ రోకటి పోటు
వేసేవారు (2)
12.నీవీ, నావీ, ఒకటే విన్నపం (3)
14.కుడి ఎడమైతే పొరపాటు లేదు.
సంతోషమే! (3)
17.ఇటీవల కవితా ప్రక్రియ. ఆచార్య గోపీ దీనికి ఆద్యులు (2)
18.గడుసుతనము గలవాడు (4)
20.నిమిషంలో అరవైయవ వంతు (3)
21.ఆర్టీసీ బస్సుల్లో ఇదో రకం! (3)
23.‘సాయం’ నోచుకోని ‘పోడు వ్యవసాయం’ (4)
24.ఈ స్వీటులో కొంత ‘మడతపేచీ’ వుంది
సుమా! (5)
*
నిలువు
*
2.ఆంధ్రుల గయ్యాళి అత్తగారు (4)
3.్ధనుర్మాసంలో వైష్ణవుల తమిళ భక్తి గీతం (4)
4.‘ప్రాచీన మతం’లో అల్ప ప్రాణి (2)
5.బుడిబుడి నడకల స్ర్తి (5)
7.మొగం కనిపించకుండా వేసుకునేది (3)
9.దారి (3)
10.మెడ, గొంతు (3)
12.మగవాడు అనగానే ‘నా’ అనెయ్యకండి. అతడే భర్త అయిపోగలడు (3)
13.ఈ ఏడాది అజోవిజో జీవన సాఫల్య పురస్కారం పొందిన రచయిత (3)
15.పది తలల రావణుడు (5)
16.ఈ పురుగును చూడగనే, తూ! నీ! అంటూ మొదలెడతారు జనం (3)
18.కంగారు, గందరగోళం (4)
19.కాలిలో ప్రధాన నరపు బాధ గల వ్యాధి ‘నొసటికాయా’ అంటే వెనకా ముందుగా అర్థం కావచ్చు (4)
22.అత్తకొడుకు (2)
*