మతం కన్నా మానవత్వం మిన్న
Published Sunday, 19 January 2020మతం... మతం అని అరిచే మనిషీ..
మానవత్వాన్ని చేస్తున్నావ్ హతం..
మతం నినే్న చేస్తుంది ఖతం..
కులం... కులం అని ఎగిరే వాయసమా...
కులజాడ్యపు వృక్షంపై వాలి అరుస్తున్నావ్... కాకిలా
మనుషులను విడగొట్టి మిగులుతావ్.. ఏకాకిలా
మతం పేరుతో...అన్నిటినీ విడగొట్టావ్..
ఆవు ఒకరిదన్నావ్, మేక ఇంకొకరిదన్నావ్...
చెట్లు, ఆకులు, కొమ్మలు కూడా వింతగా చూస్తున్నాయ్...
నువ్ పక్షులనెక్కడ విడగొడతావో అని...!!
పండ్లు, కాయలు కూడా విచారంగా చూస్తున్నాయ్...
కొబ్బరికాయ ఒకరిది... ఖర్జూరం ఇంకొకరిది అంటే...!!
అలాగైతే...
క్యారెట్, టమాటాలు ఒకరివి...?
ఆకు కూరలు ఇంకొకరివా...??
మరి నాకో సందేహం...!!
పుచ్చకాయను ఎవరికిస్తావ్...?
పాపం లోపలినుండి ఎరుపెక్కింది..
బయటంతా ఆకుపచ్చ...!!
ఓ నరుడా... ఇకనైనా ఆపేయ్.
దేహానికి పట్టిన దుమ్మును దులిపేయ్..
సాటి మనిషిని మనిషితో కపిపేయ్...
ఉఉ-‘జని’’లో అలీని చూడు..
‘్గ’’యోలోనా రాం ఉన్నాడు.
పరమత సహనం పాటిస్తూ,
సాగిపో ఓ మనిషి... అలుపెరగని మహర్షి.