S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమంటే ఏమిటంటే...

అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా....
తొలిసారి నా చెవుల్లోకి దూరిన రసామృతధారలాంటి ఈ శ్లోకం. నా ఊపిరై అనునిత్యం నన్ను నడిపిస్తోంది. అనుక్షణం నా జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ దిక్సూచిలా దారి చూపిస్తోంది. నా జీవితంలో అమృతం కురిసిన వేళ నుంచి అడుగడున ఆనందమయం చేస్తోంది.
ఆ శ్లోకమే మానవ రూపంలో జన్మిస్తే
నా జీవితాన్ని తీర్చిదిద్దిన శక్తిస్వరూపిణీలా ఉంటుంది.
అవునూ... ఆమె...
నాకు సద్గమనాన్ని చూపిన మార్గదళ్సీ..
జ్ఞాన జ్యోతని వెలగించిన జ్యోతిర్మరుూ
మృత్యు క ఊపంలోని కి జారిపోకుండా తీర్చిదిద్దిన అమృతవర్షిణీ.
నిండు నూరేళ్ల జీవితానికి పండు వెనె్నలలగా మార్చిన ఆరాధ్య దేవత పేరు.. భా..ర.. త.. ల...క్ష్మి ....
***
‘తాతయ్యా.. ప్రేమంటే ఏమిటి?’’ ఉత్సాహంగా రూమ్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చి అడిగింది శిశిర ప్రశ్న చిన్నదే కానీ..
జవాబు
హిమాలయమంత ఎతె్తైనది!
సముద్రమంత లోతైనది...!!
విశ్వమంత విశాలమైనది!!!
చెప్పు... తాతయ్య నీకు అన్ని విషయాలు తెలుసన్నావుగా...? ఈ చిన్న విషయం తెలియదా? తొందరగా చెప్పు...’’ రెట్టించి అడిగింది శిశిర
ఏమనిచెప్పాలో, ఎలా మొదలెట్టాలో తోచక ఆలోచిస్తున్నాను.
‘మంచి ప్రశే్న అడిగింది మిమ్మల్ని. ఆ అమ్మాయిని విసిగించక, తొందరగా చెప్పండి.’ అంది భారత లక్ష్మి కొంటెగా నవ్వుతూ.
ఆ మాటతో నన్ను రెచ్చగొట్టినట్లయి, రోషం పొడుచుకొచ్చింది..
‘‘చెప్పు తాతయ్యా తొందరగా చెప్పు’’ చిన్న పిల్లలా మారాం చేస్తూ అంది శిశిర .
‘నువ్వేం చిన్నపిల్లవి కాదుగా.. చక్కగా చదువుకున్న దానివి. పెళ్లయినదానివి. .. నీకుతెలియదా?’ కోపంగా అడిగేను. కాస్తా విసుగును అణుచుకుంటూ
శిశిర బెంబేలు పడిపోయింది.
భయం భయంగా చూస్తూ ‘‘నిజం తాతయ్య. నాకు తెలియదు. అసలు నాకు తెలిసింది. నిజమో కాదో అర్థం కావటంలేదు. అందుకే మీ లాంటి సీనియర్ సిటీజన్‌ను అడిగితే క్లారిటీ వస్తుందనీ’ అర్దోక్తిగా అడిగింది శిశిర. ‘పాపం చిన్నపిల్ల.. దానె్నందుకు బుకాయిస్తారు? మీకు తెలిస్తే చెప్పండి.. లేకపోతే తెలియదని చెప్పండి..’అంది భారతలక్ష్మి మందలింపుగా
ఇక తప్పదన్నట్లు.. ఒక్కక్షణం గుండెల నిండా ఊపిరి పీల్చుకుని చెప్పడం మొదలెట్టేను.
‘‘ప్రేమంటే.. రెండు గుండెల చప్పుడు..
రెండు మనసులు కలిసి, ఒకే మనిషిగా జీవించటం.’’
‘ఊహూ ... అర్థం కావట్లేదు -తాతయ్య. కొంచెం క్లారిటీగా చెప్పవూ...’అంది శిశిర.
ఈసారి కాస్త దీర్ఘంగా ఆలోచించి చెప్పే ‘‘త్వమేవాహం. అంట. ‘నీవే నేను ’అన్నట్టు ఒకరిలో ఒకరు కలిసిపోయి జీవించడం ఒకరిలో ఒకరు కలిసిపోయి జీవించడం..’’
అర్థం కాక బిక్కమొహం వేసింది శిశిర.
నన్ను చూస్తూ ముసి ముసిగా నవ్వుకుంది భారతలక్ష్మి.
ఈమనవరాలికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకర్థం కావటం లేదు.
కాసేపు ఆలోచించి.. ఆలోచించి...
‘కాస్తా అర్థమయ్యేలా చెప్పు తాతయ్య.. మళ్లీ అడిగింది శిశిర.
ఈవిషమ పరీక్షలో శిశిరకి అర్థమయ్యేలా చెపుతానో లేదోనని ఆసక్తిగా చూస్తోంది భారతలక్ష్మి చిన్నగా నవ్వుతూ.
విసుగుతో కాస్తా దబాయిస్తున్నట్లుగా చెప్పేను.
‘ప్రేమంటే = ఒకరు చెప్పితే అర్థమయ్యేదికాదు, ఎవరికి వారే తెలుసుకోవాలి.’
***
ఆ..క...లి.
ఈ మూడక్షరాల పదానికి మూడు జన్మల అనుబంధముంది.
ఆ మాటకొస్తే...
మనిషి పుట్టకుముందే పుట్టి, చనిపోయిన తరువాత కూడా. చావకుండా ఉండేది ఇదక్కటేనేమో.. పిండ ప్రదానం చేస్తే... పక్షిరూపంలోను, పశువురూపంలోనో వచ్చి భోంచేసి ఆకలి తీర్చుకునినే విచిత్ర స్థితి ఒక్క మానవ జన్మకే ఉంటుందన్నమాట.
ఇది నమ్మకమో, అపనమ్మకమో కానీ కొన్ని ఆచార వ్యవహారాలు మాత్రం మనిషి నరనరాల్లో జీర్ణించుకునిపోయి.. జీవ న గమనాన్ని నిర్దేశిస్తున్నాయి. భారతలక్ష్మి కి దగ్గరి బంధువు - వెంకటాచలం వచ్చి చెప్పేడు. ... ‘రేపు మా ఇంట్లో మహాలయ అమావాస్య (ప్రేతామావాస్య)పెడుతున్నాం. మీరు భోజనానికి తప్పకుండా రావాలి.’’
మా ఆవిడ వంక చూశేను.
‘వెళ్లండి’ అన్నట్లు తలూపింది తను.
‘సినీ కవి ఆత్రేయ అన్నట్లు..‘పోయినోళ్లందరూ మంచోళ్లూ.. ఉన్నోళ్లూ పోయినోళ్ల తీపిగురుతులూ...!’ అందుకే . వాళ్లని స్మరించుకోవడం మానవ ధర్మం. నేను తప్పకుండా వస్తాను. ’హామీ ఇచ్చాను వెంకటాచలానికి .
***
మన ఇంటిలో మనం తింటే - అది భోజనం అవుతుంది.
దేవుడికి నివేదిస్తే - అది నైవేద్యం అవుతుంది.
బంధువులకు వడ్డిస్తే - అది విందు అవుతుంది.
ఊరిలో అందరికీ పెడితే - అది అన్నదానం అవుతుంది.
ఈలోకం విడిచి ‘వెళ్లిపోయినవాళ్ల’కోసం పశు, పక్షాదులకు పెడితే అది ‘పిండ ప్రదానం’ అవుతుంది.
గతించిన వాళ్లని తలుచుకుని అతిథులకు పెడితే.. అది అమృత తుల్యం అవుతుంది.
అలాంటి భోజనం - ఆరోజు వెంకటాచలం ఇంట్లో తిన్నాను.
చక్కగాఅరటాకులో వడ్డించారు.
స్వర్గస్తులైన వారి గోత్రనామాలు చదివి, అతిథులని తినమని చెప్పారు.
అన్నీ రకాల పిండివంటలు చేసి, కొసరి కొసరి వడ్డించారు.
అతిథులందరూ కడుపునిండగా తృప్తిగా తిన్నారు.
భోజనాలు ముగిశాక .. బయట వసరాలో కూర్చున్నాక.. నా ప్రక్కనున్న తను మెల్లిగా అడిగాడు‘ఇలా గోత్రనామాలు తెలియని వారు ఏం చేయాలి? మామూలుగా పెడితే వాళ్లకి చెందవా..?’
ఆ ప్రశ్నతో మాతో వచ్చిన శిశిర కూడా ఆసక్తిగా చూసింది నా వంక.
‘ఒక వేళ గోతం గానీ, పేరుగా ని తెలియని పక్షంలో యజ్ఞేశ్వర గోత్రస్య అని చెప్పుకోవాలి. పేరు తెలియని పక్షంలో యజ్ఞప్ప అని పురుషులకీ , సోమదాయప్ప అని స్ర్తిలకీ చెప్పుకోవాలి. ’అని వివరించేను.
మనలో మాట. నిజంగా ఈ పశువులకీ, పక్షులకు పెడతారు కదా. ఇలా పెడితే... చనిపోయిన వాళ్లకి చెందుతుందా.. మరో ప్రశ్న అడిగేడు. ఇటువైపు ఉన్న అతను.
‘దేవో యది పితా జాతః శుభకర్మానుసారతః!
తస్యాన్న మమృతం భూత్వా దేవత్వేస్యను గచ్ఛతి॥
మరణించిన వ్యక్తి తాను బతికి ఉన్నప్పుడు చేసిన మంచిపనుల కారణంగా దేవలోకానికి వెళ్లినట్లయితే వారి సంతానం పెట్టే పిండాలు వారికి అమృతం (దేవతల ఆహారం అదేకదా) రూపంలో అందుతాయి. అదే వాళ్లు మరుజన్మలో పశుపక్షాదులుగా పుట్టి ఉంటే వాయురూపంలో, రాక్షసునిగా పుట్టి ఉంటే మాంస రూపంలో పిశాచ రూపంలో పుట్టి ఉంటే రక్తరూపంలో మనిషిగా పుట్టి ఉంటే అన్నరూపంలో చెందుతాయి. అంతే తప్ప, నిష్ప్రయోజనం మాత్రం కావని దీని అర్థం.’’ వివరించాను.
‘చాలా గొప్పగా చెప్పేరు.’ అన్నట్లు గర్వంగా చూసింది భారత లక్ష్మి నా వంక చిన్నగా నవ్వుతూ .
నమ్మకం కుదరక మళ్లీ అడిగాడతను. ‘అవునా? అలా ఎలా అందుతుంది? మనం పెట్టేది ఇక్కడ అక్కడికెలా చేరుతుంది?’
‘ ఈ విషయంలో ఒకసారి కంచి కామకోటి పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వాములవారు ఒక సభలో ఇలా చెప్పారు.- మనం భారతదేశపు కరెన్సీలో వెయ్యి రూపాయలని మనియార్డర్ గానీ, చెక్ రూపంలో కానీ పంపిస్తే అది ఏ దేశంలో వానికి వెళితే ఆ దేశపు కరెన్సీలోనే (డాలర్ , దినార్, పౌండ్ ) చేరుతుంది. కానీ ఇక్కడి రూప ఆయల రూపంలో కాదు. అలాగే. పిండాలు కూడా అదే తీరుగా అంది తీరుతాయి. కాబట్టి పితృదేవతలని ఆరాధాంచడమనేది అందరికీ మంచిదే. ఇబ్బందులు తొలగడానికి సంతానం కలగడానికీ సకల శుభాలకీ తప్పక చేయవలసిందే అని వివరించారు.’
‘అబ్బో .. మీకు చాలా విషయాలు తెలుసు’’ అన్నాడతను ఆశ్చర్యంగా.
‘నాకు తెలిస్తే ఏం లాభం? నేటి తరం తెలుసుకోవాలి’అన్నాను దిగులుగా
‘మీరన్నది నిజమే. ఈ తరానికి అనురాగాలు, ఆత్మీయతలు ఎక్కడివి? అంతా బిజీమిజీ.. గజమిజీ’’ అన్నాడతను మళ్లీ విచారంగా’
‘ఇపుడు మనమంతా అరటాకుల్లా అనుబంధాలు పచ్చగా ఉండేవి. కొద్దిరోజులకు విస్తరాకులు వచ్చాయి.
విడి విడి ఆకులు కుట్టినవి. అనుబంధాలు కూడా కలిసున్నా విడి విడిగానే ఉండేవి . తరువాత- స్టీల్ ప్లేట్‌లో భోజనం... కడిగేసి వాడినట్లు.. అనుబంధాలు కడిగేసినట్లే అయింది. ఇక, యూజ్ అండ్ త్రో.. పేపర్ ప్లేట్ భోజనం.. అనుబంధాలను, ఆత్మీయతలను యూజ్ అండ్ త్రోగా తయారుచేసింది. ఇపుడు సహపంక్తి భోజనాలు కరువయ్యాయి. అంతా బఫే సిస్టమ్ నిలబడి తినడం... మనిషి బఫెల్లోగా మార్చేసింది. ఏమిటో అర్థ కా దుకానీ క్షణం తీరిక లేని గజిబిజీ బిజిబిజీ...’వివరంగా చెప్పసరికి ఆశ్చర్యమేసింది.
‘మీరు ఏమి గనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. చెబుతారా.? అన్నాడతను.
పర్లేదు అడగం అన్నాను.
‘మీరు తెలుగువారే కాదు. పైగా ఇండియన్ కూడా కాదు. మరి ఇన్ని విషయాలు మీకెలా తెలుస్తుంది. అనుక్షణం పరిశీలిస్తే అన్నీ అర్థమవుతాయి.’’
‘మీరు ఫారినర్ . తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఎలా నేర్చుకున్నారు?’ అడిగేడతను.
‘అంతా మా ఆవిడ చలువ. తను తెలుగు లెక్కర్ అందే అందుకే నాకు తెలుగు అంటే వల్లమానిన అభిమానం. ’
సగర్వంగా మా ఆవిడ .. భారత లక్ష్మి వంక చూసాను.
కిటికీ ఆవల ఉన్న ఆమె నన్ను చూసి చిన్నగా నవ్వింది.
‘‘హో.. లవ్ మ్యారేజ్ అన్నమాట’ అన్నాడు చిన్నగా నవ్వుతూ.
‘నిజమే మాది ప్రేమ వివాహం. డాక్టర్ గా ఒక ఆపస్మారక అంటే క్రిటికల్ కండీషన్ లో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఆ హాస్పటల్ లో కనిపించింది. ఆ పేషెంటు దూరపు బంధువట. - భారత లక్ష్మిమ చూడగానే వచ్చేసింది.
అంటే ఆరోజు నుండి మీ దేశం వెళ్లనే లేదా?
ఊహూ వెళ్లలేదు... వెళ్లాలని అపినించలేదా?
‘‘ఒకే .. ఓకే.. మీ పర్సనల్ విషయాలు అడిగినందుకు సారీ..’
సారీ ఎందుకు మిత్రమా ! ఈ దేశానికే కాదు ఈలోకానికే కొద్ది రోజులు బతకటానికి వచ్చాను. ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఆఫ్‌కోర్సు మా ఆవిడ అభిప్రాయం కూడా అదేననుకో..’ అన్నాను
చిన్నగా నవ్వుతూ.
భారతలక్ష్మి కూడా నన్ను చూసి నవ్వింది.
వాళ్లూ రిలాక్స్‌గా నవ్వేరు.
***
బియ్యపు గింజలు
పసుపుతో కలిపితే అక్షితలు అవుతాయి.
నీళ్లు కలిపి వండితే అన్నం అవుతుంది. ఆ అన్నానికి నిమ్మరంస చేర్చిచే పులిహోర అవుతుంది.
బియ్యానికి నాన్ వెజ్ కలిపి వండితే బిర్యానీ అవుతుంది.
అంతా మనం వినియోగించుకుంటున్న దాన్ని బట్టి ఉంటుంది.
ఇదే విషయం మనవరాలు శిశిరతో అంటే గుంభనంగా నవ్వి ‘‘ప్రేమ కూడా ఇంతేనా’’ అంది కొంటెగా.
‘తొక్కితే రాయి. మొక్కితే దేవుడు అంటారుగా.. ఇదీ అంతే’
‘మీకేంటి మాటలు నేర్చారు. మాటలతో బురిడీ కొట్టించేస్తున్నారు. అసలు మీకు తెలుగు నేర్పడం మాదీ బుద్ధి తక్కువ ..’అంది భారత లక్ష్మి నా చెవి మెలిక పెట్టి.
‘‘ఆ ఆ...వదిలిపెట్టు. నొప్పేడుతోంది’అన్నాను కాస్త బాధ నటిస్తూ
‘ఏవైంది తాతయ్య’ అడిగింది శిశిర.
‘ఏం లేదులే..’ అన్నాను చెప్పటం ఇష్టం లేక.
‘నేను మీ అసలు మనవరాలుని కాదనేగా చెప్పకుండా దాటేస్తున్నారు?’ అంది శిశిర.
‘చూశావా- లక్షీమ. ఎంత మాట అన్నదో.. నేనెప్పుడైనా అలా చూశానా...మీ చెల్లెలు కూతురు సౌందర్య బిడ్డ శిశిర. అయినా మనం మనవరాగా చూస్తున్నాను.
‘తాతయ్య, ఫీలయ్యారా.. ? అబ్బే- ఊరకే అన్నాను. మరి నిజం చెప్పొచ్చుగా ? అసలు ప్రేమంటే ఏమిటి? అమ్మమ్మ మీరూ ఎలా ప్రేమించుకున్నారు. మీ లవ్ స్టోరీ చెప్పరూ ’అడిగింది శిశిర లాలనగా
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నలభై యేళ్ల వెనక్కివెళ్లాలి.
నాగుండెలో గుడి కట్టుకుని కొలువై ఉన్న ప్రేమదేవత. తలపులతో గతం గుర్తొచ్చి అశువుగా చెప్పటం మొదలెట్టాను.
‘మా ప్రేమ విషయం భారతలక్ష్మి వాళ్లింట్లో తెలిసి, గొడవ జరిగింది. ఐనా అవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా ఉందామె. కానీ ఎంత కాలం అలాగే ఉంటాం. పెళ్లిచేసుకొంటే కోపాలు తగ్గుతాయని గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆరోజు తను, నేను కారులో గుడికి బయలుదేరాం. దారిలో ఒకతను రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఒకవైపు పెళ్లి ఒకవైపు వృత్త్ధిర్మం. ఏం చేయాలో అర్ధం కాలేదు. నా పరిస్థితి అర్థం చేసుకొన్న భారత లక్ష్మి ముం మీ వృత్త్ధిర్మాన్ని నిర్వర్తించండి అంది. మృత్యోర్మా అమృతంగమయ .. అదే డాక్టర్‌గా మీ ధర్మం. మన పెళ్లి ఈరోజు కాకపోయినా రేపైనా చేసుకోవచ్చు. అందామె. ఆమె చెప్పినట్లు చేయడానికి పేషెంట్ దగ్గరకు వెళ్లాను. ప్రాణం ఉందో లేదో నని నాడీ పట్టుకుని చూస్తున్నారు. అంతే ఆ చుట్టూ దాక్కొని ఉన్న నలుగురు రౌడీలు ఆకస్మాత్తుగా నాపై దాడి చేశారు.
చెపుతుంటే ఆసక్తిగా వింటోంది శిశిర.
ఈ హఠాత్ దుర్ఘటనకు బెంబేలెత్తి భారతలక్ష్మి నన్ను కాపాడడం కోసం నా దగ్గరకు పరుగెత్తుకువచ్చింది. సరిగ్గా అపుడే నన్ను చంపేయాలనీ రౌడీ విసిరిన తల్వార్ వేటుకు పాపం. నా భారత లక్ష్మి బలయై పోయంది.
నా స్వరం గాద్గదమై కొన్న క్షణాలు మూగవోయింది.
కళ్లు చెమర్చడంతో చూపు మసకబారిపోయింది. భారత లక్ష్మి అస్పష్టంగా కనపడుతోందిప్పుడు.
వింటున్న శిశిర కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
ఆ తరువాత కిరాయి రౌడీలతో దాడి చేయంచి తన కూతురిని పొగొట్టుకున్నందుకు ఆమె తండ్రి బాధపడ్డాడు. ఆ బాధ నుంచి తట్టుకోవడానికి తాగుడుకు బానిసయ్యాను. కొన్ని సార్లు చచ్చిపోవాలనిపించేది. కానీ అనుక్షణం ఆమె ఆలోచనలతో ఉన్న నాకు నేనేం చేయాలో ఎప్పుడు ఎలా ఉండాలో ఆన్నీ ఆమె చెబుతూనే ఉంది. నాకోసం ప్రాణాలు కోల్పోయిన నా భారత లక్ష్మి రూపం తిరిగి రావడానికి నా అమృత వర్షిణీ తిరిగి నా దేశం వెళ్లకుండా భారత లక్ష్మి హస్పటల్ పేరుతో ఉచిత సేవ అందిస్తూ ఇక్కడే ఉండిపోయాను...
పూర్తిగా విన్నాక శిశిర కళ్లు తుడుచుకుని చెప్పింది.
తాతయ్య నాకు అర్థం అయింది. ప్రేమంటో ఏమిటో అది ఎంత గొప్పదో?!
*

- ఉలి.. 9963003033