S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భయాలు

కొత్త సంవత్సరం రాగానే, గడచిన సంవత్సరం గురించి అంచనా వేస్తూ కాలాన్ని గడుపుతాం.
భయాలు మనల్ని చాలా విషయాల నుంచి దూరం చేస్తాయి.
చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తాం. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదని విచారిస్తాం.
మనల్ని ఎవరో కించపరిచారని, ఇష్టపడలేదని కూడా అనుకుంటూ వుంటాం.
గడిచిన విషయాల గురించి విచారిస్తూ కాలం గడిపితే ఎలాంటి ఫలితం లేదు.
దానివల్ల మన శక్తి అనవసరంగా వృథా అవుతుంది తప్ప ఎలాంటి ఫలితం వుండదు.
మన మానసిక ధోరణిని మార్చుకోవాలి.
మనకు ఇష్టమైన వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచిది.
మన పనివైపు..
మన కుటుంబం వైపు..
మన ఇష్టాల వైపు..
మన దృష్టిని కేంద్రీకరించాలి...
ఇది కష్టం కాదు.
చాలా సులువు.
ఈ కొత్త సంవత్సరంలో అందరం చేయాల్సింది ఇదే.
*

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001