S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వినపడిందా?

అవి నవ్వులంటారు మీరు
కత్తులపై నిర్మించిన చరిత్రలకు
నవ్వులు ఎలా ఉంటాయి?
రక్తంలో తడిసిన
చూపుల రోదనల గురించి మాట్లాడేదెవరు?
పూడిపోయిన కాలాన్ని కుప్పలు కుప్పలుగా తవ్వి
ఒక కవిత నాటాలి
వర్షపు చినుకులు భూమిపై పడగానే
ముత్యాలౌతాయి అంటారు
చినుకుల త్యాగాన్ని గుర్తించిందెవరు
కుళాయి నుండి దూకుతున్నది
నీరు కాదు త్యాగం...

గడ్డపారతో మట్టిని తవ్వుతున్నప్పుడు
రంపంతో చెట్టును కోస్తున్నప్పుడు
తీరాన్ని అడుగులతో కొలుస్తున్నప్పుడు
ఒక కవిత వినిపించాలి

నీచ చరిత్రను రక్షిస్తున్న కనురెప్పలను తెంచాలి
రెప్పలకి బదులుగా అక్షర తోరణాలు కట్టాలి
కవిత్వమై చరిత్రను నగ్న పరుస్తుంది

మ్యూజియంలోని కత్తిని
బయటికి విసిరేస్తాను..
నీటిని గుండెలో నింపుకోండి
చెట్టును అరచేతితో నిమరండి
ఒక కవిత వినపడిందా...

-అఖిలాశ 9491977190