S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అక్షరాల అనే్వషణ

నా కోసం అంటూ ఏదీ పుట్టలేదు
ఏ భావాలు తెర తీయలేదు
దరి చేరని అనుభూతులకై
కొత్తగా ఆరాటపడ్డాను
వెలుగుని నింపుకొని
కలలని పండించాలని
కలలు కన్నాను అంతే...!

మనసు పడ్డ అక్షరానికి నేనో విహారినై..
పుస్తకానే్వషణలో నిమగ్నమయ్యాను!
లోతైన భావాలన్నీ కాగడా జ్వాలగా..
నిప్పు కణికలై ఎగసి పడుతుంటే
తెలిసింది అప్పుడు
అనుభవాల పరంపర..
అనుభూతుల పద పరిమళం లోతెంతో..!

వెలుగు నీడల చీకటి రూపు రేఖలనీ
నిజా నిజాలనీ చీల్చి..
బాహ్య ప్రపంచంలోకి
అడుగేస్తుంటే అక్షరాలు విశ్వమంతా
వెలుగులై వ్యాపించాయి!

నిరంతర నిత్య జీవ వాహినిలా
ప్రవహిస్తున్న అక్షరాలను నాలోకి
ఒంపుకుంటూ..
అక్షరాల అనే్వషిణినై సమస్తం
జయించడానికి
అడుగులు వేస్తున్నా
‘పద’ ‘పద’మంటూ!!
*

-స్వప్న మేకల.. 9052221870