S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఖగోళ ప్రభావాలు - మాస్టర్ యోగం

ఎవల్యూషన్, ఇన్‌వల్యూషన్ - పరిణామంలో, అంతర్ణామంలో జరగాల్సిన ప్రక్రియ సక్రమంగా సాగకపోవటమే సృష్టిలోపాలకూ, మానవ జీవితం అసంపూర్ణం కావటానికీ ప్రధాన కారణంగా మాస్టర్ సి.వి.వి. పసిగట్టారు. ప్రాపంచికంగా లిమిటెడ్ యాక్టివిటీతో జీవిక సాగిస్తున్న మనం యోగసాధనా ఫలితంగా ‘లిమిట్‌లెస్ యాక్టివిటీ’తో సంపూర్ణంగా పరిణమించాలి. హ్యూమన్ యాక్టివిటీ లిమిట్ కాకుండా ఉండటానికి మాస్టర్ సి.వి.వి. ‘సెవెన్ ఎడ్జెస్ట్‌మెంట్స్’ అనే కోర్స్‌ను ప్రాక్టీస్ చేయించారు. ప్రతీ సాధకుడు ప్రతీ మంగళవారం ఈ కోర్స్ ప్రాక్టీస్ చేయాల్సిందిగా నిర్దేశించారు. ఈ ప్రాక్టీస్ వల్ల ఫిజికల్, ఈథరల్, యాస్ట్రల్ లెవెల్స్‌లో ఎడ్జెస్ట్‌మెంట్స్ సాధ్యమవుతూ భౌతికంగాను, అధిభౌతికంగాను సంపూర్ణ జీవనం, పరిపూర్ణ పరిణామం సాధ్యమవుతుంది.
సెలస్టియల్ బాడీస్
విశ్వంలో మనం భౌతికంగా అంటే మానవాకారంలో పరిణమించేది భూమండలంలో అయితే అధిభౌతికంగా పరిణమించేది ఖగోళ మండలాలలో, గ్రహాలు, నక్షత్రాలు, ఇతర ఖగోళాంశాలు ఖగోళానివి అయితే మనమూ, దేశాలు, ఖండాలు, సముద్రాలు భూమండలానివి. భూమండలాన్ని మినహాయించి తక్కిన ఖగోళ మండలాలను ‘సెలస్టియల్ బాడీస్’ అంటున్నాం. ఘర్షణ కారణంగా, ఆకర్షక శక్తి కారణంగా, విద్యుదయస్కాంత ప్రసరణ కారణంగా ఖగోళ మండలాల ప్రభావాలు భూమండలంపై, భూమండలంలో చరిస్తున్న మనపై ఉంటున్నాయి.
సూర్య, చంద్ర, గురు, బుధ, శుక్ర, కుజ, శని మండలాలు ప్రధాన గ్రహ మండలాలయితే వీటితోపాటు రాహు, కేతు మండలాలు, నెప్ట్యూన్, యురేనస్, ప్లూటోలు కూడా తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ గ్రహాలన్నీ కలిసిందే సౌర కుటుంబం. భూమండలం నుండి అన్ని గ్రహ మండలాలపైన అధిక ప్రభావం చూపగల శక్తివంత గ్రహం సూర్యగ్రహం.
సూర్యమండల ప్రభావంతోనే భూమండలం తన కక్ష్య - ఆర్బిట్ -లో ఉంటోంది. అయితే ఈ సూర్య ప్రభావం ప్రత్యక్షంగా కనిపించదు. సోలార్ విండ్స్, సోలార్ ప్లేర్స్‌ల నుండి జనించే శక్తి ప్రసరణ భూమిని ప్రభావితం చేస్తూంటుంది. భూమండలంలోని పదార్థాలలోను, జీవరాసిలోను చోటు చేసుకుంటున్న ప్రతి మార్పుకూ సూర్యమండలం కారణమవుతోంది. భూమండల అయస్కాంత క్షేత్రం సోలార్ విండ్స్, సోలార్ ప్లేర్స్‌ల శక్తిని అందుకోగలగటమే ఈ మార్పులకు మూలం.
గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నటిజిమ్‌లు
ఇక, విద్యుదయస్కాంత క్షేత్రం వల్లనే చంద్ర మండల ప్రభావమూ భూమండలంపై ఉంటోంది. భూమండలంలోని విస్తార జల భాగంలోను, నేలలోను ఏర్పడే పోట్లకు చంద్రపోటే అంటే మూన్‌టైడ్సే కారణం. మన అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్‌లలో మార్పులకు కారణమూ చంద్ర ప్రభావమే. ముఖ్యంగా జల సంబంధాలలో చంద్ర ప్రభావం మిక్కుటం. మన మానవ దేహ నిర్మాణంలోను జలం తొంభై శాతం ఎక్కువగా ఉంటుంది. శారీరక క్రియలన్నీ మనసు ప్రభావానికి లోనైటటువంటివి. కాబట్టి మనసుపై కూడా చంద్ర ప్రభావమే అధికం.
ఇలా చంద్రగ్రహ ప్రభావమే అని కాదు ఇతర గ్రహాల ప్రభావమూ మనుషులపైనే కాక, జంతుజాలం పైన, చెట్టుచేమలపైనా ఉంటుంది. ఇంతకీ చంద్ర ప్రభావం సూర్య ప్రభావం కంటే రెండింతలుగా ఉండటానికి ప్రధాన కారణం చంద్రమండలం భూమండలానికి అతి సమీపంలో ఉండటమే. పైగా భూమండలంపై చంద్ర మండలానిది ప్రభావం ప్రత్యక్ష ప్రభావం.
భూమిపై గ్రహ మండలాల ప్రభావం విద్యుదయస్కాంత శక్తిని పోలింది కాదు. వాటిది ఆకర్షక శక్తి మాత్రమే. ఉదాహరణకి, కుజ శుక్ర గ్రహాలకు భూమికి మధ్య దూరం చంద్రుడి కంటే ఎన్నో రెట్లు అధికం కావటంవల్ల శుక్ర కుజుల ప్రభావం చంద్రుడి కంటే తక్కువగా ఉంటుంది.
గ్రహ, నక్షత్ర మండల ప్రభావాలు భూమండలంలోని ప్రతి జీవరాశిపైన, ప్రతి అణువుపైన ఉన్నాయనటానికి ఆధారాలు లేవని సైన్స్ అంటున్నప్పటికీ ఆస్ట్రాలజీ మాత్రం ఖగోళ మండల ప్రభావాలను లెక్క కట్టగలుగుతోంది. ఒక విధంగా మనం గ్రహ, నక్షత్ర మండలాలతో సహజీవనం చేస్తున్నట్లే. ముఖ్యంగా సౌర కుటుంబంలోని సప్త గ్రహాలు మన మనుగడను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మనకూ, గ్రహాలకూ మధ్య గ్రావిటీ, ఎలక్ట్రో మాగ్నటిజమ్‌లు అనుసంధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఈథర్ వర్కవుట్
ఇంతకీ మన భూమండలానికీ, గ్రహ మండలాలకూ, నక్షత్ర మండలాలకూ మధ్య ఉన్నది వినీలాకాశం అనీ, అది స్పేస్ అనీ మనం అనుకుంటుంటాం. నిజానికి అదంతా ఈథర్ మయం. ఈథర్ అంటే యూనివర్సల్ ఫోర్స్. ఈ యూనివర్సల్ ఫోర్స్ వల్లనే భూ, ఖగోళ మండలాలన్నీ తమతమ నెలవులలో, తమ తమ పరిధులలో ఉండగలుగుతున్నాయి. ఇదంతా ‘ఈథర్ థియరీ’.
ఈథర్ సిద్ధాంతం ప్రకారం - భూమండలాన్ని ఆవరించి ఉన్నదే ఈథర్. ఈ ఈథర్‌లో ఉన్నవే గ్రహ మండలాలు.. ఆ పైనవి నక్షత్ర మండలాలు.. వాటినీ దాటితే ప్రాణిక్ మండలం. మొత్తానికి ఈథర్ కంటూ ప్రెషర్ ఉంది. ఈ వొత్తిడి కారణంగానే మానవ మనుగడా, ఖగోళ చైతన్యమూ సాధ్యమవుతోంది. ఈథరిక్ ప్రెషర్ వల్లనే అక్షాంశ, రేఖాంశాల సమకోణతతో మనం భూమిపై నిలబడగలుగుతున్నాం.. నడవగలుగుతున్నాం.. దైనందిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించ గలుగుతున్నాం. మనం చరిస్తున్న భూమి తన చుట్టూ, సూర్యుడి చుట్టూ అతివేగంగా తిరుగుతున్నా, బాలెన్స్ కోల్పోకుండా నిలబడి పనులు చేయగలుగుతున్నామంటే ఈ ఈథరిక్ వొత్తిడి వల్లనే.

-విశ్వర్షి 93939 33946