S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వ్యాయామం

ఉదయానే్న నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని వాకింగ్‌కి వెళ్లడం చాలా మందికి అలవాటు. నేనూ అంతే! ఆరోగ్యానికి మంచిదని చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది కాదు. సులభంగా రోజూ చేస్తున్న వ్యాయామం.
ఇలాంటి వ్యాయామం మన శరీరానికే కాదు, శరీరంలోని చాలా అవయవాలకి అవసరమే. అవయవాల కన్నా మన మనస్సుకి మరీ ముఖ్యం. ఇది కష్టసాధ్యమేమీ కాదు. సులభమైన ప్రక్రియ.
చాలామందిని చూస్తున్నప్పుడు మనం ఎంత అదృష్టవంతులమో బోధపడుతుంది. అందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పవచ్చు.
సూర్యోదయాన్ని చూస్తూ ఆనందించవచ్చు. నమస్కరించవచ్చు. అదే విధంగా సూర్యాస్తమయాన్ని.
మన పిల్లలని, భార్యని ప్రేమతో పలకరించవచ్చు. తోటి ఉద్యోగులని కూడా.
ఎవరికైనా ఏమైనా దానం చేయవచ్చు. సహాయం చేయవచ్చు.
ఇవన్నీ చేయాలంటే మనకు చేయాలన్న మనస్సు ఉండాలి.
మన మనస్సు వ్యాయామం ఆ విధంగా చేస్తే చాలా మంచిది.
శరీరానికే కాదు
కన్పించని మనస్సుకు
వ్యాయామం అవసరమే. *

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001