S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మోడువారిన జీవులు

పుట్టు పూర్వోత్తరాలు ఎరుగనోళ్లు
కూడు, గూడు, గుడ్డకు నోచనోళ్లు

విశాల భారతావనిలో తమకంటూ
సెంటు ‘జాగ’ కరువైన అభాగ్యులు
ఊరూరా తిరుగు ‘సంచార’ జాతులు

ఆవాసాలకు దూరంగా..
చెత్తకుప్పలకు చేరువగా..
చిరిగిన ‘గుడారా’ల్లో చితికే జీవనం
భిక్షాటనతో ‘పొట్ట’ నింపుకునే వైనం

బతుకు పొడవునా
ఎన్ని ‘గజిబిజి’ మజిలీలో..
గుండెల నిండా..
ఎనె్నన్ని ‘కలతల’ పజిళ్లో..

ఈ దేశంలో పుట్టినా
ఏ ‘ఆధా(ర్)రం’ లేనోళ్లు
ఏ ‘అభివృద్ధికి నోచనోళ్లు

ఈ భూభాగాన బతికినా..
ఏ ‘హక్కు’లు దక్కనోళ్లు
జనాభా ‘లెక్క’ల్లో ఎక్కనోళ్లు

ప్రజాహితమంటూ ప్రసంగాల
పల్లవించు పాలకులారా!

మనుషులుగా గుర్తించబడని
ఈ అమాయక జీవుల ఆదరిస్తే..
కాస్తంత ‘చేయూత’ అందిస్తే..

చీకటి మోముల్లో
పండు ‘వెనె్నల’ కురిసేను
మోడువారిన బతుకుల్లో
నవ ‘వసంతం’ విరిసేను
*

-కోడిగూటి తిరుపతి.. 9573929493