S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంకల్పమూ మనదే! సాధనా మనదే!!

దీర్ఘగోళాకారంగా ఉండే మన భూమి సౌర కుటుంబంలోని గ్రహాల పరిణామాన్ని బట్టి అయిదో స్థానంలోను, సూర్యుడి నుండి దూరాన్ని బట్టి మూడో స్థానంలోను ఉంది. మన భూకక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉన్నప్పటికీ ఉత్తరార్థ గోళంలో ఉన్న భూభాగాల బరువు కంటే దక్షిణార్థ గోళంలో ఉన్న జలభాగం బరువు. అంటార్కిటికా మంచు బరువు అధికం కావటంవల్ల భూమి అక్షం తూర్పువైపునకు ఇరవై మూడున్నర డిగ్రీలు వాలి ఉంటుంది.
ఇలా వాలి ఉండటం కూడా మానవ పరిణామం పరిపూర్ణం కాకపోవటానికీ, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యం కాకపోవటానికీ ప్రధాన కారణంగా మాస్టర్ సి.వి.వి. గుర్తించారు.
మొత్తానికి ఈ ఖగోళ పరిజ్ఞానం లేనిదే మాస్టర్ సి.వి.వి. ‘్భృక్తరహిత తారక రాజయోగా’ ‘వర్కింగ్’ అర్థం కాదు. మాస్టర్ సి.వి.వి. చేసిన యోగసాధనా ప్రయోగాలన్నీ గ్రహాలకు, నక్షత్రాలకు సంబంధించినవే. మన స్వప్రయత్నంతో, సాధనతో స్వయంభువుల్లా ప్రకాశించగలగటమే మాస్టర్ యోగ సాధనా రహస్యం.
* * *
మనిషిగా పుట్టి మాస్టర్ కాగల అంశ మనలోనే ఉందన్నది మన జన్మరహస్యం. మానవాంశతో జీవించటం మానవ జన్మ ధర్మమైతే సామాన్య జీవితం నుండి విడివడుతూ సాధనతో ‘మనీషి’ కాగలగటమే ‘మాస్టరిజమ్’. ఈ బాటలో మనకు మనమే అన్ని విధాల సంసిద్ధం కావాలి.. సంకల్పమూ మనదే, సాధనా మనదే కావాలి.
సంకల్పం - ప్రయోగం..
మనం సాదాసీదాగా బ్రతికేస్తున్నప్పటికీ గ్రహ ప్రభావాలతోనే జీవిక సాగిస్తున్నాం. మనపై ఏ గ్రహ ప్రభావం ఎలా ఉందని చెప్పగల శాస్త్రం జ్యోతిష శాస్త్రం. ఇలా మనపై గ్రహ ప్రభావాల వివరాలను తెలుసుకుని ఆ ప్రభావాల నుండి బయటపడటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటాం. మనది ప్రాపంచిక జీవనం కాబట్టి ఎంత కాదనుకున్నా ఆధ్యాత్మికతలోను కొంత ‘స్వార్థం’ చోటు చేసుకుంటుంది. అయితే అధిభౌతికతలోను గ్రహాల ప్రభావాల నుండి బయటపడటమే గాక ఆ గ్రహాలపై పట్టు సాధించడానికి ‘యోగమార్గం’ అన్ని విధాల ఉపకరిస్తుంది. ఆ ప్రయోజనాలను విశ్వ పరిణామం వైపు మళ్లించ గలగటం ‘నిస్వార్థం’ అవుతుంది.
మానవాళిపై మన యోగసాధన ‘ప్రభావం’ చూపినపుడు ఆ ‘మంచి’ మనకూ పంచబడుతుంది. అందరి పరిణామాన్ని ఆశించినపుడు మన పరిణామానికీ అందులో భాగస్వామ్యం ఉంటుంది. ఈ సంకల్పమే గత శతాబ్దంలో మాస్టర్ సి.వి.వి. గారికి కలిగింది. ఆ సంకల్పమే ప్రయోగంగా మారి మానవాళిని గ్రహ ప్రభావాల నుండి తప్పించటానికి ‘్భృక్తరహిత తారక రాజయోగ’ మార్గాన్ని సాధకులకు అందించటం జరిగింది. వారి సంకల్పానికి అప్పట్లో వచ్చిన ‘హాలిస్’ తోకచుక్క యోగ మార్గ ప్రయోగాలకు బలం చేకూర్చింది. వారు, వారి అనుయాయులు చేసిన ప్రయోగాలతో భృక్తరహిత తారక రాజయోగం ‘మాస్టర్ యోగం’గా, ‘న్యూ యోగా’గా ప్రసిద్ధమైంది. స్థూలంగా మాస్టర్ యోగావతరణ ఇది.
గ్రహ ప్రభావాలు - ఆదాన ప్రాదానాలు
గ్రహాల ప్రభావం మనపై ఉందని మనమూ నమ్ముతున్నాం. సరైన పద్ధతిలో ఆస్ట్రాలజీ ఈ ‘ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెనె్సస్’ గురించి చెప్పగలుగుతూంది. అయినా సైంటిఫిక్‌గా గ్రహాల ప్రభావాలను నిరూపించటం సాధ్యపడటం లేదు. మానవులు గ్రహ మండలాలను చేరుకుంటున్న నేపథ్యంలో మానవ మనుగడపై గ్రహాల ప్రభావం ఏమిటి? అని ఈనాటి సైన్స్ ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది. ఆధారాల సంగతి అటుంచితే ప్రకృతిలోని ప్రతి అంశా మనిషిపై ప్రభావం చూపిస్తున్నప్పుడు ఈ ఖగోళ ప్రభావాలనూ కాదనలేం.
భూమండలంపై ఉంటున్న మనపై వివిధ దేశాల ప్రభావాలున్నట్లే భూగ్రహం చుట్టూ వున్న ఇతర గ్రహాల ప్రభావాలు భూమి పైనా, ఈ భూమిలో చరిస్తున్న మనపైనా ఉండటం ఖాయం. దీనికి ఆధారం మన అవగాహనే. మనం ఒక యంత్రాన్ని రిపేర్ చేయగలుగుతున్నాం.. మన ప్రయత్నాలతో చంద్ర మండలంపై కాలు మోపగలిగాం.. ఇతర గ్రహ మండలాలకూ మనం స్పేస్‌క్రాఫ్ట్స్ పంపిస్తున్నాం.. ఇవన్నీ భౌతికంగా ఉంటూనే సాధ్యం చేయగలుగుతున్నప్పుడు ఈ భౌతికం నుండే అధిభౌతికంగాను మనం ఖగోళాన్ని చేరుకోగలం.
మనసు, బుద్ధి కలిసి పని చేసి ఒక గ్రహాన్ని ఔపోసన పట్టగలిగి ఆ గ్రహ మండలం దాకా ప్రయాణించ గలిగినపుడు అదే బుద్ధి, మనసులను రంగరించి అధిభౌతికంగాను ఆ గ్రహ మండలాలను చేరుకోగలం. అసలు భౌతికంగా చేసే ప్రయోగాలకైనా, అధిభౌతికంగా చేసే యోగ సాధనలకైనా విశ్వశక్తి అనేది తోడవటమే ముఖ్యం. ఆ విశ్వశక్తిని యోగ సాధనతో అందుకోగలగటం ధ్యాన స్థితి.. యోగసాధనా లక్ష్యం ఇదే.
గ్రహాలతోపాటు నక్షత్రాల ప్రభావమూ మనపై ఉంటుంది.. మనతోపాటు ఈ ప్రకృతిపైనా, విశ్వంపైనా ప్రభావం ఉంటుంది. మొత్తానికి గ్రహ మండలాల, నక్షత్ర మండలాల సమ్మిళితమే ఖగోళం. ఈ ఖగోళ ప్రభావాలతో మానవ జీవనం తిరిగే మలుపుల్ని లెక్క కట్టగలది జ్యోతిష శాస్త్రం. ఈ లెక్కల సారాన్నంతటినీ యోగ సాధనతో అర్థనిమీలితమైన మనం అందుకోగలం. అంటే ఖగోళ విజ్ఞానం ధ్యాన సాధనతో మన ప్రజ్ఞానంగా పరిణమిస్తోంది. ఈ అవగాహనతో మానవాళికీ ఖగోళానికీ ఆదాన ప్రాదానాలు ఉన్నాయన్నది స్పష్టం.

-విశ్వర్షి 93939 33946