S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆకలిని చంపేవి కావాలా? తీర్చేవి కావాలా?

ఫోషక విలువలు తక్కువగా ఉండే పిజ్జాలు, ఫ్రెంచి ఫ్రైల్లాంటి జంక్ ఫుడ్స్ ఆకలిని చంపుతున్నాయా తీరుస్తున్నాయా అనేది మనం గమనించుకోవలసిన విషయం. కాసేపు భోజనం ఆలస్యం అయినప్పుడు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగితే ఆకలి తీరుతోందా? లేదు. ఆకలి అణిగిపోతోంది, లేదా చచ్చిపోతోందని కూడా గమనించాలి. ఆకలిని చంపే వాటిని తీసుకుంటే అవి కడుపులో విషాలను వ్యాపింపచేస్తాయి.
ఇటాలియన్ పిజ్జాల్ని ఝంక్ ఫుడ్డని తిడుతున్నాం. కానీ పొద్దున్న పూట ఉపాహారం పేరుతో మనం తినే ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగు వగైరా టిఫిన్లన్నీ జంక్ ఫుడ్సేనని గమనించాలి. అవి పిండివంటలు. పండుగకో పబ్బానికో ఒకసారి వండుకుని సరదాగా తినాల్సినవి. వాటిని రోజూ అదే పనిగా తినటం అనర్థదాయకం. అందువలన జీర్ణశక్తి బలహీనమై, అనేక అనర్థాలకు కారణం అవుతుంది.
నాగరికత కోసం ఉదయం పూట టిఫినే తిని తీరాలని నియమం పెట్టుకోవటం మన అపోహల్లో ఒకటి. పెరుగన్నం లేదా చల్లన్నానికి మించిన సురక్షిత ఆహారం మరొకటి లేదు. అది ఆకలిని తీరుస్తుంది. కడుపులో దండిగా ఉంటుంది. ప్రోబయటిక్ అంటే ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని పేగుల్లోకి పంపి జీర్ణాశయ వ్యవస్థని బలసంపన్నం చేస్తుంది. కడుపులో ఎసిడిటిటీని, వేడీ, వాతాలనూ తగ్గించి శరీరానికి సమ స్థితిని కలిగిస్తుంది. మనం ఇలా తినటానికి నామోషీ పడుతున్నాం. ఇరుగూ పొరుగూ మనల్ని చద్దన్నం తినే పప్పుగాళ్లని హేళన చేస్తారని బిడియపడి అనారోగ్య దాయకమైన టిఫిన్లను నాగరికతగా అపోహ పడుతున్నాం. అనేక వ్యాధులు ఎందుకొస్తున్నాయో తెలియనివి రావటానికి ఈ టిఫిన్లు కూడా ఒక కారణమే అవుతున్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, స్థూలకాయం, బీపీ, షుగరు, గుండె జబ్బులు ఇవన్నీ రావటం సహజం అని సమాధానపడిపోతున్నాం.
చద్దన్నం అంటే పెరుగన్నమే! నిన్నటి పాచిపోయిన అన్నం అనే అర్థాన్ని మాత్రమే ఇచ్చి నిఘంటువులు మనకి అన్యాయం చేశాయి. ఉదయం పూట టిఫిన్లకు బదులు పెరుగన్నంలోకి మారి చూడండి. మీ ఆరోగ్యంలో మెరుగుదల గమనిస్తారు.
ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలకి రెండు ఇడ్లీలు పెట్టి పంపే తల్లిదండ్రులు తమ పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నామనుకోవటం విడ్డూరం. ఎదిగే పిల్లలకు పోషకాలు నిరంతరం సరఫరా జరగాలి. టిఫిన్లతో సరిపుచ్చాలనుకుంటే బలహీనమైన జాతి తయారౌతుంది. ఆకలిని తీర్చేవి తినండి. చంపేవి వదిలేయండి.
విందు భోజనాల్లో అనర్థాలు
విందు భోజనాల కాంట్రాక్టర్లు, హోటళ్ల వాళ్లు ఎక్కడ చూసి నేర్చుకున్నారో కొన్ని విచిత్రమైన పద్ధతుల్ని తెచ్చి జనం మీద వదిలారు. భోజనంలో మొదట పూరీలు తినాలని ఋగ్వేదంలో రాసి ఉన్నదా? పూరీలు ఎందుకు తినాలి? పైగా అదేదో ఆంధ్రా సంస్కృతి అనే మరొక విష ప్రచారం కూడా చేశారు. ఆంధ్రులకు పూరీలు తిని అన్నం తినే అలవాటు ఏ యుగంలోనూ లేదు. భావప్రకాశ అనే వైద్య గ్రంథంలో ఉత్తరాది వారు మొదట గోధుమ రోటీలు తిని మిగిలిన ఆకలిని కొద్దిగా అన్నంలో పెరుగో, పులుసో కలుపుకుని తింటారని ఉంది. అంటే, రోటీలు తిన్నాక వరి అన్నం తినే అలవాటు ఉత్తరాది వారిదే గానీ మనది కాదు. మనకు రోటీలు పిండివంటలే గానీ, ప్రధాన ఆహార ద్రవ్యం కాదు. ఇలాంటివి సరదాగా అప్పుడప్పుడూ తినేవే గానీ రోజూ ఇలా తినాలనుకోవటం సరికాదు. అది ఆంధ్రా భోజనం ఎంత మాత్రమూ కాదు.
అలాగే, ముందుగా స్వీట్లు తినేసి అప్పుడు అన్నం తినటం ఈ క్యాటరర్లు లేదా హోటళ్ల వాళ్లు మనకి చేసిన మరొక దురలవాటు. సంప్రదాయ పద్ధతిలో భోజనం చేసేవారు స్వీటుని భోజనం చివరి భాగంలో తింటారు. ముందుగానే తింటే ఆకలి చచ్చిపోతుంది. జీర్ణశక్తిని చంపుకుని అన్నం తినటానికి ఉపక్రమించటం తెలివైన పని అని ఎవరైనా అనుకుంటారా? పైగా, భోజనానికి ముందు ఆకలి మీద తింటే స్వీటుని ఎక్కువ తింటాం. భోజనం చివరి ఐటమ్ అయితే పరిమితంగా తింటాం.
వురుద్ధాహార పదార్థాలను కలిపి తినటం (రాంగ్ ఫుడ్ కాంబినేషన్) వలన అవి విషాహారాలౌతాయి. పెరుగన్నం తిని వెంటనే పాలతో తయారైన ఐస్‌క్రీం తినటం, సాంబారిడ్లీ తిని కాఫీ టీలు తాగటం ఇలా ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఉండే వాటిని కలిపి తినటం మంచిది కాదు. విందు భోజనాల్లో చేసే ఇలాంటి ప్రయోగాలను మనం మన ఫుడ్ కల్చర్ ఇదేననే భ్రమలో కొత్త అపాయాలను నెత్తికెత్తుకుంటున్నాం.
గరిటెల కొద్దీ నెయ్యి, నూనె, వనస్పతి పోసుకుని తినటం, వేపుడు పదార్థాలను అతిగా తినటం వీటి వలన జీర్ణశక్తి చచ్చిపోతుంది. అజీర్తి, గ్యాసు తరచూ ఏర్పడుతుంటాయి. జీర్ణశక్తి మందగిస్తే రోగాలన్నింటికీ తలుపులు తెరవటమే అవుతుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com