రెండవ ముద్ర (సండేగీత)
Published Saturday, 26 October 2019మొదటిసారి చూడగానే ఏర్పడే అభిప్రాయం చాలా బాగా వుండాలి అంటారు.
నిజమే!
కొంతమంది మొదటిసారి చూడగానే ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు.
అదే అభిప్రాయంతో కొనసాగుతారు.
కొన్ని మొదటిసారి ఏర్పడే ముద్ర అంత బాగా వుండకపోవచ్చు.
అది అలా వుండిపోవాల్సిందేనా?
మొదటిసారి కలిసినప్పుడు, నవ్వుతూ పలకరించాలి. కళ్లల్లోకి చూడాలి. వాళ్లు చెప్పింది జాగ్రత్తగా వినాలి.
అయినా కొన్నిసార్లు మన ముద్ర సరిగ్గా పడకపోవచ్చు.
పర్వాలేదు.
మళ్లీ మన ప్రయత్నం అదే విధంగా కొనసాగించాలి. మొదటి ముద్ర చెరిగిపోయి రెండో ముద్ర బలంగా పడవచ్చు.
కొన్నిసార్లు-
రెండవ ముద్రనే బలంగా వుండవచ్చు.
గుర్తుకు తెచ్చుకొండి.
మొదటి ముద్ర ఎంత బలమైందో
రెండవ ముద్ర అంతకన్నా బలమైంది.
ప్రయత్నించి చూడండి.