S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జంక్ ఫుడ్ జోలికెళితే...

కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. వెర్రెత్తి ఉన్నోళ్లు.. అనే పాటలో ఒక చరణాన్ని ఇలా చేర్చి పాడవచ్చు ‘ఆటపాట లేనోళ్లు వ్యాయామం మరిచినోళ్లు, ఝంక్ ఫుడ్లే తిని కంటి చూపే పోయినోళ్లు... అని!
2019 సెప్టెంబర్ 3వ తేదీన శశ్ఘఒ యచి నిశ Annals of Internal Medicin హెల్త్ డే న్యూస్ వెబ్ జర్నల్‌లో అచ్చంగా ఇదే ప్రకటన వచ్చింది. ఝంక్ ఫుడ్స్ తినే యువతీ యువకుల్లో అంధత్వం పెరుగుతోందని! కొనే్నళ్లుగా అలవాటుగా ప్రతీరోజూ పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైలు, ఐస్‌క్రీములు, తెల్లబ్రెడ్‌తో చేసిన వేపుడు వంటకాలు తినేందుకు అలవాటు పడిన ఓ బ్రిటీష్ యువకుడు చూపు కోల్పోయాడంటూ ఈ జర్నల్‌లో ఓ రిపోర్ట్ ప్రచురితం అయ్యింది.
మనం అనుకుంటాం.. ఝంక్ ఫుడ్స్ అంటే అమెరికా వాళ్లు తినే పిజ్జాలు బర్గర్లు మాత్రమేనని! కానీ, మనం ఇక్కడ ఇండియాలో నిత్యకృత్యంగా తినే బజ్జీలు, పకోడీలు, పునుగులు, ఇడ్లీ, అట్టు, పూరీ ఉప్మా వగైరా పదార్థాలన్నీ ఝంక్ ఫుడ్సే! యురోపియన్ల కన్నా ఎక్కువ ఝంక్ మనం తింటున్నాం. ఎందుకంటే, ఉదయం టిఫిన్లు మనకు తప్పనిసరి. అవన్నీ ఝంకులే! మధ్యాహ్నం భోజనంలో పకోడీ కూర, వేపుడు కూరలన్నీ ఝంకులే! రాత్రి పూట రెఓటీలు, స్పైసీ కర్రీలన్నీ ఝంకులే! యురోపియన్లతో ఈ విధంగా పోలిస్తే మన ఆహారంలోనే అపకారం చేసేవి ఎక్కువగా ఉన్నాయి. వీటికి ఎక్కువగా దాసులౌతున్నది యువత. ప్రాప్చవ్యాప్తంగా జరుగుతున్న తంతు ఇదే! అందుకే యువతకు ప్రత్యేకంగా హెచ్చరికను చేస్తున్నారు.
తప్పుడు పనులు చేస్తే కళ్లు పోతాయని మన పెద్దలు వారిస్తుంటారు కదా. ఝంక్ ఫుడ్స్ తింటే కళ్లు పోతాయి. వీటినే అధికంగా తినటం వలన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ తగినన్ని అందకుండా పోవటం వలన ధాతు లోపానికి సంబంధించిన అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. వాటిల్లో అన్నిటికన్నా పెద్ద జబ్బు అంధత్వం, రక్తహీనత, ఎముకలు శిథిలం కావటం, బి12 విటమిన్, డి విటమిన్, రాగి మరియు సెలీనియం లాంటి పోషకాలు లోపించటానికి నిస్సారమైన ఝంక్ ఫుడ్స్ తినటమే ముఖ్య కారణం. పోషకాహార లోపాల వలన కలిగే కంటి నరాల జబ్బు వలన (nutritional optic neuropathy ఈ శాశ్వత అంధత్వం సంక్రమిస్తోంది.
శాస్తవ్రేత్తలు చెప్పే విషయాలను పాజిటివ్‌గా తీసుకుని వాటిని మనకు అన్వయించుకుని మనల్ని మనం ఎక్కడ సరిచేసుకోవాలో గుర్తించే తత్వం లేకపోతే మనల్ని మనం వంచుకున్నట్లే.. వంచించుకున్నట్టే అవుతుంది!
మనం తినే టిఫిన్లలోనూ, కూరల్లోనూ ఎక్కువ భాగం ఝంక్ స్వభావం కలిగినవే! ఇలా అని చెప్పగానే ఒకాయన ‘ఇడ్లీ తింటే కళ్లు పోతాయంటారా?’ అని అడిగాడు. సైన్సుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించక పోవటం వలన ఈ వ్యంగ్యం ఏర్పడింది. ఝంక్ ఫుడ్స్ తిన్నంత మాత్రాన కంటిచూపు దెబ్బతినదు. నిస్సారమైన ఝంక్ ఫుడ్స్‌తో కడుపు నింపుకుని పోషకాలున్న కాయగూరలను, మత్స్య మాంసాలను అశ్రద్ధ చేయటం వలన అంధత్వం ఇంకా ఇతర పోషకాహార లోప వ్యాధులూ సంక్రమిస్తున్నాయి. మీ ఆహారంలో తగినన్ని పోషకాలుంటున్నాయా అని ప్రశ్నించుకుని ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం మీకే తడ్తుంది. చింతపండు, ఇతర పులుపు పదార్థాలు, మసాలా ద్రవ్యాలను ఎక్కువగా చేర్చి వండిన కూరలన్నీ ఝంక్ ఫుడ్సే!
ఎందుకంటే, ఇలా వండిన గరిటెడు కూరలో రెండు కూర ముక్కలుంటాయి. తక్కినదంతా పులుసు లేదా మసాలా గ్రేవీ ఉంటుంది. ఆ పులుపు, కారాల కోసం ఎక్కువ అన్నం కలుపుకుని తినాల్సి వస్తుంది. అంటే, మొత్తం మీద సారవంతమైన శాకాలు తక్కువగానూ, ఏ మాత్రం పోషకాలు లేని గ్రేవీలు ఎక్కువగానూ తింటూ ‘రోజూ నేను శాకాహారమే తింటాను’ అని వాదిస్తే ప్రయోజనం ఉండదు. పేరుకే మనకి శాకాహారం గానీ, అందులో చింతపండు, మసాలాలు తప్ప శాకాలు ఏ మాత్రం ఉండటం లేదు. అందుకే ఝంక్ ఫుడ్స్ అంటున్నాను ఇలా వండిన కూరల్ని!
Denize Atan అనే మహిళా శాస్తవ్రేత్త ఆ బ్రిటిష్ యువకుడికి కళ్లు పోవటానికి కారణం గురించి చెప్తూ, It is not that the junk food had a toxic effect on his vision, but that he wasn't eating nutritious and varied foods అని వివరించింది. పోషకాలు లేని ఝంకులు తింటూ పోషకాలను అశ్రద్ధ చేయటం వలన ఈ దుస్థితి ప్రాప్తించిందనేది ఆమె విశే్లషణ.
ఎక్కువ పిండి పదార్థాలున్న ద్రవ్యాలు, నూనెలో వేయించిన స్లైసులు, సాసులు ఇలాంటివన్నీ ఝంక్ ఫుడ్స్ కిందకే వస్తాయి. మన వేపుడు కూరల్లో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. పులుసులు, గ్రేవీలతో కూరని నింపేయటం వలన కూరలోని పోషకాలను మనం తగినన్ని పొందలేక పోతున్నాం.
పిల్లలు ఇంట్లోనూ స్కూళ్లలో కూడా ఇవే తిని పెరుగుతున్నారు. కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు దండిగా వెడుతున్నాయి. కాబట్టి, పిల్లలు ఒడ్డూ పొదుగూ బాగానే పెరుగుతారు. కానీ, విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు, శరీరం లోపల డొల్ల ఏర్పడుతుంది. That meant his height and weight stayed normal, masking his condition, even as his nutrient intake steadily dwindled అంటున్నారు భ్రిష్టల్‌కు చెందిన ఈ మహిళా శాస్తవ్రేత్త.
‘చేపలు, కూరగాయలతో చేసిన ఝంక్ ఫుడ్స్ కొద్దిగా తిన్నా అతని చూపు అంతగా పోయి ఉండేది కాదు’ అన్నారామె! దీన్నిబట్టి మనకు అర్థం అవుతున్న సత్యం ఏమంటే, మన దృష్టిని కొవ్వు మీద నుండి, పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) మీద నుండి పోషకాలు కలిగిన కూరగాయలు, మత్స్య మాంసాల మీదకు మళ్లించి శరీర ధాతు నిర్మాణం సక్రమంగా జరిగేలా ఎవరికి వారు జాగ్రత్త పడాలని!
ప్యాక్ చేసిన (pre-prepared foods) ఆహార పదార్థాలు, వేగాహారాలు (fast foods)), టిఫిన్లు, వేపుడు కూరలు, పులుసు కూరల మీద వ్యామోహం పెంచుకుంటే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ నిరూపణలు గుర్తు చేస్తున్నాయి.
చాలామంది దగ్గర్నించి ఓ వింత మాట వినిపిస్తూంటుంది. ‘ఎప్పుడూ తినేవేనండీ.. కొత్తగా తిన్నదేమీ లేదు’ అని! -Picky Eaters/ Fussy eaters అంతా ఇదే మాట చెప్తుంటారు. ఎప్పుడూ తినేది ఎప్పుడు తిన్నా ఏమీ కాదని వారి అభిప్రాయం. ఎంతకాలం నుండీ ఆ ఎప్పుడూ తినే దాన్ని తినటం ప్రారంభించామో అంతకాలం నుండీ శరీరంలో విధ్వంసం మొదలయినట్టే లెక్క! దీని వలన శారీరక మానసిక సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com