S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమరత్వం

ప్రియతమా!
తనువులు దూరమైతేనేమి?
వలపుల ‘తలపులు’ చేరువేగా..
పెదాలు పలక్కపోతేనేమి?
వౌనం మాట్లాడుతుందిగా..
దేహం పొడిబారితేనేమి?
మది ‘జీవనది’ ప్రవాహమేగా..
ఆంక్షలు అడ్డుగోడలైతేనేమి
మనో గవాక్షం వీక్షిస్తుందిగా..
కనురెప్పలు మూస్తేనేమి?
కలల ‘తలుపులు’ తెరిచే ఉంటాయిగా...
పరువు ఉప్పెన ముంచేస్తేనేమి?
అలౌకిక ‘బంధ సౌధం’ పటిష్టమేగా..
ఇక్కట్ల చీకట్లు కమ్ముకుంటేనేమి?
హృదయ ‘దీపం’ వెలుగుతుందిగా...
విధి విషం చిమ్మితేనేమి?
ప్రేమామృతధార ‘ప్రాణం’ పోస్తుందిగా..
కాలం సంకెళ్లు వేస్తేనేమి?
ఊహల ‘రెక్కలు’ విచ్చుకుంటాయిగా..
మృత్యు రక్కసి కాటేస్తేనేమి?
అమర ‘ప్రేమ’ మనదేగా...
ఎందుకంటే?
మరణం దేహానికే గాని
మనసుకు కాదుగా...

-కోడిగూటి తిరుపతి.. 9573929493