S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పది సంవత్సరాలు

2029లో ఈ రోజు ఎలా వుంటుందో ఊహించండి. అలాగే పది సంవత్సరాల తరువాత మీరు ఎలా వుంటారో ఊహించండి. ఊహించడం కష్టమేమీ కాదు.
అదేవిధంగా పది సంవత్సరాల క్రితం మీరు ఎలా వున్నారో ఆలోచించండి. ఇప్పటికన్నా తక్కువ స్థాయిలో బహుశా మీరు వుండి వుండవచ్చు. మీలోని మార్పు మీకు తెలియకుండా జరిగి ఉండవచ్చు. లేదా మీరు ఉద్దేశ్యపూర్వకంగా మార్పుని తీసుకొని వచ్చి ఉండవచ్చు.
పది సంవత్సరాల వ్యవధిలో చాలా మార్పులు వచ్చి వుంటాయి. పిల్లలు పెద్దవాళ్ళయిపోయి వుంటారు. పైచదువులకి విదేశాలకి వెళ్ళి వుంటారు. కొంతమందికి ప్రమోషన్లు వచ్చి పైస్థాయికి చేరుకొని వుంటారు.
మన గురించి మనకు కొన్ని అంచనాలు వుంటాయి. వారం రోజుల్లోనే ఏదో సాధించగలమని అనుకుంటాం. అదేవిధంగా సంవత్సరంలో ఏమీ సాధించలేమని అనుకుంటాం. కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఊహిస్తాం. మరికొన్నిసార్లు చాలా తక్కువగా ఊహిస్తాం.
ప్రతి సంవత్సరం కూడా ఏవో సాధించాలని కొన్ని ప్రణాళికలు వేస్తాం. చాలావాటిని మధ్యలో వదిలేస్తాం. ఈ సంవత్సరంలో అప్పుడే 70 శాతం గడిచిపోయింది. మిగిలిన 30 శాతంలో కూడా మనం అనుకున్నది సాధించవచ్చు.
కాలం ఆగదు. మనం ఉపయోగించుకున్నా, ఉపయోగించుకోకున్నా అది ఆగదు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001