S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వరచనా మైత్రి

మిత్రమా, కాలమా!
నీది నాది గర్భాలయ మైత్రి
నా జన్మ రహస్యానికి ఆజన్మ సాక్షివి నువ్వు
తొలి కణానికి తొలి క్షణానివి నువ్వు
నా తొలి అంగానికి తొలి చైతన్యానివి నువ్వు
నా తొలి అందానికి తొలి సంతకానివి నువ్వు
కాలమా, మిత్రమా!
నీది నాది భూవలయ మైత్రి
నా పుడమి తల్లి బంధానికి కొలమానానివి నువ్వు
నాలోని పంచభూతాల ఏకతా రాగానివి నువ్వు
నాలోని జ్ఞానేంద్రియాల నిశ్శబ్ద స్పందన నువ్వు
నాలోని కర్మేంద్రియాలు నిరుపమాన స్పర్శ నువ్వు
మిత్ర కాలమా!
నా మనిషితనానికి మనసుతనానికి రక్షణ నువ్వు
నా ఆత్మరాగానికి హృదయ నాదానికి శిక్షణ నువ్వు
నా శబ్దానికి నిర్విరామ దర్శన నువ్వు
కాల మిత్రమా!
నా మనసు రాపిడుల స్థితత్వానివి నువ్వు
నా గుండె చప్పుడుల చిరవాణివి నువ్వు
నా అడుగుజాడల మార్గదర్శివి నువ్వు
*
నేస్తమా, కాలమా!
నా తొలి శ్వాసకు తుదిశ్వాసకు వీలునామావి నువ్వే
నా ప్రాణానికి జీవానికి కాలక్రమానివి నువ్వే
నా పంచభూతాల చక్రభ్రమణానివి నువ్వే
కాలమా, నేస్తమా!
నేను నువ్వు రూప అరూప ప్రయాణికులమే
నేను నువ్వు కుడి ఎడమల పాదచారులమే
నేను నువ్వు సాధనా శిఖర ఆరోహకులమే.
నేస్త కాలమా!
ఆపాద మస్తక జీవ వాహినిని నేను
కుడి ఎడమల శక్తి ప్రభంజనానివి నువ్వు
నేను నువ్వు సంతులనమైతేనే వర్తమానం
కాల నేస్తమా!
నీది నాది విశ్వజనీన మైత్రి
విశ్వామోద మైత్రి.. విశ్వరచనా మైత్రి *

-విశ్వర్షి వాసిలి వసంతకుమార్