హరేక్మాల్
Published Saturday, 20 July 2019ఎక్కడనుండొచ్చాయో
బండి అలికిడి విని
చిట్టిపొట్టి
సీతాకోక చిలుకలు
అమాంతం
ఇంద్రధనుస్సు
రంగు గాజులు
వాటి చేతులను
చుట్టేశాయి.
కాటుకేమో మరీ..
అందమైన
కాజల్
కనులపై శశిరేఖలా..
అద్దాలన్నీ
వరుసలో
ఎగిరెగిరి
పడుతున్నాయి
అందాన్ని
తమలో చూసి
మురవడానికి..
చెవిదుద్దులు
శ్రావ్యమైన
శబ్దసందేశం
వీనుల విందవ్వాలనీ...
ముఖచిత్రంపై
రంగుల బొట్టుబిళ్లలై
ఒదిగిపోవాలని
వాటికెంత
మక్కువనో
అత్తరులేమో
పరిమళాలు
వెదజల్లుతున్నాయి
ఇంకా ఇంకా
చాలా..
చిన్నారుల
దోసిళ్లలో
వొదిగిపోవాలనీ
ఊరిసంతలో
హరేక్మాల్
బండిపై..