S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిపూర్ణత

1977 ప్రాంతంలో ప్రజాతంత్ర అని ఓ వారపత్రిక వచ్చేది. అందులో శ్రీశ్రీ అనంతం ధారావాహికంగా వచ్చేది. ఈ వారం కవిత అని ఒక శీర్షిక వుండేది. కథలకి మంచి బొమ్మలు, మంచి వ్యాసాలు అందులో వచ్చేవి. అప్పుడప్పుడే సాహిత్యం పట్ల బాగా ఇష్టం ఏర్పడుతున్న సమయం. కథలూ కవిత్వం ఇష్టంగా రాయడం మొదలుపెట్టింది అప్పుడప్పుడే.
ఓ కథ - ఆ డబ్బే వుంటే’ అన్న కథ రాసి ఆ పత్రికకు పంపిస్తే అది అచ్చయ్యింది. అంతకు ముందే కథలు ప్రగతి వారపత్రికలో, కథాంజలి అన్న పత్రికలో చాలా వచ్చాయి. ప్రజాతంత్రలో రావడం కొంత సంతోషాన్నిచ్చింది.
ఆ కథని చదివిన ఓ సీనియర్ కవి మిత్రుడు ఈ కథలో పరిపూర్ణత లేదు. దీన్ని ఇంకా ఇలా రాయాల్సి వుండే అని చెప్పాడు. ఆ పత్రిక సంపాదకుడు పరిచయం కావడం వల్ల ప్రచురించాడు అన్నట్టు మాట్లాడినాడు. నేను రాసిన అంశం మీద మరో కథకుడు రాసిన కథను చూపించి ఇలా రాయాలి అన్నాడు.
అప్పుడప్పుడే కథలూ, కవిత్వం రాస్తున్న నాకు ఆ రోజటి సంభాషణ నిరుత్సాహాన్ని ఇచ్చింది. ఆయన చెప్పింది నిజమే కావొచ్చు. కథలో ఆయన కోరుకున్న పరిపూర్ణత రాలేదేమో. ఏమైనా ఓ యువ రచయితో అలా చెప్పడం సరైంది కాదని అన్పించింది.
‘పరిపూర్ణత’కి అంతం లేదు. కొన్నిసార్లు మనం రాసిన కవిత, కథ మనకు అప్పుడు నచ్చదు. కొద్దిరోజులు అలాగే వుండిపోతుంది. కొంతకాలం తరువాత ఆ కవితను చదివినప్పుడు ఎంత బాగా ఉంది ఎందుకు పత్రికకి పంపించలేదు అని అన్పిస్తుంది. అదే విధంగా మనకు మామూలుగా అన్పించిన కవిత ఇతరులకి గొప్పగా అన్పించవచ్చు.
ఏ పనిలోనైనా పరిపూర్ణత అవసరమే.
కానీ ఏదీ పరిపూర్ణత కాదు. ఏదీ పరిపూర్ణంగా ఉండదు. ఎవరూ పరిపూర్ణంగా ఉండరు.
మనలో కూడా ఓ లోపలి గొంతు ఒకటి ఉంటుంది.
నీ కవిత, నీ పని పరిపూర్ణంగా వచ్చినప్పుడు తప్ప ఇతరులకి చూపించకండి అని చెబుతూ ఉంటుంది. దాని మీద విమర్శలు వస్తాయి అన్న విషయం కూడా ఆ గొంతు చెబుతూ ఉంటుంది.
మన లోపలి గొంతుని, మనల్ని విమర్శించే వ్యక్తులనే పూర్తిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
వాటిని అలా పక్కనపెట్టి-
మన కథని, కవిత్వాన్ని, చిత్రాన్ని, పనిని ప్రజల్లోకి పంపించడమే మనం చేయాల్సిన పని.
దాని గురించి విమర్శకులు ఏమన్నా చెప్పని, ఏమైనా కామెంట్ చేయని
పరిపూర్ణత ఎప్పటికీ రాదు. ఎంత చెక్కినా శిల్పికి ఇంకా చెక్కాలనే ఉంటుంది.
ప్రతి పనిలో కూడా ఇదే పరిస్థితి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001