S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యవ్వన రహస్యం

ఈ మధ్య హైకోర్టు కారిడార్‌లో శ్రీనివాసరావు కలిసాడు. అతను హైకోర్టులో సీనియర్ న్యాయవాది. అతనితోపాటూ మరో న్యాయవాది కూడా వున్నాడు.
‘రెగ్యులర్‌గా వస్తున్నారా’ అడిగాడు.
‘లేదు. అప్పుడప్పుడు వస్తున్నాను’ చెప్పాను.
అతనితోపాటూ వున్న న్యాయవాద మిత్రున్ని నాకు పరిచయం చేశాడు. నా గురించి అతనికి పరిచయం చేస్తూ ఇలా అన్నాడు.
‘రాజేందర్‌గారు జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశారు. ఆ తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్‌గా కూడా పనిచేసి పదవీ విరమణ చేశారు. కానీ అలా పదవీ విరమణ చేసిన వ్యక్తిలా కన్పించడు. నా వయస్సు వున్నట్టుగా కన్పిస్తాడు.’
ఆయనకి యాభై ఎనిమిది సంవత్సరాలుకన్నా తక్కువ వుంటాయి. ‘అవును’ అన్నట్టు నేను చిన్నగా నవ్వాను.
‘అలా కన్పించడానికి కారణం ఏమిటి సార్?’ అడిగాడు అతనితోపాటూ వున్న న్యాయవాది.
శ్రీనివాసరావు ప్రేమతో అలా అంటున్నాడు. ‘నేను యువకుడిని కాదు. కానీ యువకుడికన్నా ఎక్కువ ఆలోచిస్తాను. ఆవేశపడతాను. ఎవరికి అన్యాయం జరిగినా నా కలం ఎత్తుతాను. కథలూ, కవిత్వమూ, వ్యాసాలూ రాస్తూ ఉంటాను.’
మనం యువకులుగా కన్పించాలంటే ఈ లక్షణం ఉండాలి. ఇవి లేకపోతే వయస్సు ఎక్కువగా కన్పిస్తుంది.
చాలామంది కవులూ, రచయితలు, కళాకారులు, సాంఘిక కార్యకర్తలు యువకులుగా, లేదా తమ వయస్సు కన్నా తక్కువగా కన్పించడానికి కారణం ఇదే.
ఇదే వాళ్ల యవ్వన రహస్యం.
అందరూ అలా కన్పిస్తారని చెప్పలేం కానీ యువకులు మాదిరిగా ఆలోచిస్తారు.
ఆవేశపడతారు.
జరుగుతున్న అన్యాయాలని ఏదో రకంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు.
ఈ విధంగా ఎదుర్కోవడానికి కళాకారులే కావల్సిన పనిలేదు.
న్యాయవాదులూ ఈ పనిని ఇంకా సమర్థవంతంగా చేయవచ్చు.
ఇదే మాట కొత్తగా పరిచయం అయిన న్యాయవాద మిత్రునికి చెప్పాను.
అవునని ముగ్గురం అనుకున్నాం.
మనం ఎలా కన్పించినా ఫర్వాలేదు. యువకుల మాదిరిగా ఉండాలి.
మీరేం అంటారు?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001