S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అబద్ధాల మేడ

అది ఓ అందాల మేడ
అద్భుతమైన అబద్ధాల మేడ
అందులోని వాళ్లంతా
చక్కని చిక్కని కథలల్లుకుంటూ
ఒకరికొకరు చెప్పుకుంటూ
సంబరపడి పోతూంటారు
పెళ్లాం పచార్లు
మొగుడి సరదాలు
ప్రేమ ఉచ్చులో పిల్లలు
మతాబుల్లాంటి మందహాసాలతో
ఒకరినొకరు నెట్టుకొంటూ,
తిట్టుకొంటూ వీధినపడి
ఒకటే పరుగులు
కొన్నాళ్లకు వీళ్ల కెవ్వుకేకలు
టీవీ వాళ్లకు కావాల్సినన్ని తోకలు (కథలు)
ఈక్కి ఈకా పీక్కి పీకా
తీస్తుంటే తనివితీరా చూస్తున్న
జనాలకు రోజంతా వీరకిక్కు
కాలం విలువ తెలియని వాళ్లకు
కాలక్షేపానికేం తక్కువలేదు.

-షణ్ముఖశ్రీ.. 8897853339