S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పూవై విరిసిన...

టెర్రస్‌లో కూర్చున్నా.. బెడ్‌రూమ్‌లో పడుకున్నా.. కనుచూపు మేర పరుచుకున్న అనంత జలరాశి - సముద్రపు ఒడ్డున నిర్మించిన బంగ్లా అది. ఎకరం విస్తీర్ణంలో ఎంతో విశాలంగా, విలాసవంతంగా ఆధునిక సదుపాయాల సమాహారం ఆ భవన నిర్మాణం. భవనం చుట్టూరా పలురకాల ఫల పుష్పాదులు, కూరగాయల మళ్లు, కొంచెం దూరంలో గేదెలు, ఆవులు ఇంకా అనేక మూగ జీవాలు.
వాటన్నిటిని చూసుకోటానికి రత్తి, రాంబాబు జంట రాత్రింబవళ్లు అక్కడే మకాం. వారికి మకాం కింద కాంపౌండ్‌లోనే. అసలే సముద్రపు ఒడ్డు, లేలేత అలలు ఎగసిపడ్తుంటయ్, రాత్రయితే మిలమిల మెరిసే వెనె్నల్ని చూసి. ఆ వాతావరణంలో, ఆ పూల పరిమళాలతో ప్రేమ పండించుకోవటానికి హద్దుల్లేవు ఆ జంటకి.. ఏ అర్ధరాత్రికో అలసిపోయి పండుతారు సరసాలకు, సరదాలకు స్వస్తి చెప్పి. ఇదంతా గమనిస్తున్న ఆనందరావుకి ఓ పక్క ఉత్సాహం.. మరోపక్క భీతాహం కారణం వయసొచ్చిన కూతురు తన్మయ.
ఆనందరావు, భార్య పరిమళ, బిడ్డ తన్మయ పై అంతస్తులో ఉంటారు. ఇక ఆ వాతావరణంలో, ఆ ఏకాంతంలో కళ్ళాలు వదిలిన రేసు గుర్రాలే రత్తి, రాంబాబు ఆ మసక మసక వెనె్నట్లో. వాళ్ల మత్తులోంచి బయటకు రావటానికి ఆనందరావుకి కొంత సమయం పట్టింది. ఆ మత్తుకళ్లతోనే ఆనందరావు భార్య పరిమళని సమీపించాడు.
పరిమళ ప్రశాంతంగా ఒత్తిగిలి పడుకునుంది. ముంగురులు గాలికి నుదురు తాకుతూ వింత అందాల్ని సంతరింప జేస్తున్నయ్ పరిమళకి. తన్మయ పుట్టుకొచ్చి పరిమళ తల్లి ప్రమోషన్ పొందింది కానీ శరీరంలో కానీ, అందంలో కానీ కాసింతైనా సొంతపు, సోయగం తగ్గలేదు. పరిమళని అలా దగ్గరగా చూస్తూండిపోయాడు ఆనందరావు అర్ధనిమీలిత నేత్రద్వయంతో. కారణం పండువెనె్నల, సుమ సుగంధ పరిమళ సౌరభాల మేళవింపున విరిసే ఆహ్లాదకర వాతావరణ ప్రేరణ కావచ్చు. పరిమళ కొప్పులో మల్లెలు, విరజాజులు మత్తెక్కిస్తున్నాయి ఆనందరావుని. ప్రకృతి ఏ వయసువారినైనా లొంగదీసుకుంటుంది కామోసు!! తనేమైనా ప్రవరాఖ్యుడా.. తీయని అనుభూతులకి తెర తీస్తున్నాయ్.
ఆ స్థితిలో ఆనందరావు పరిమళని దగ్గరికి తీసుకుని, తనివి తీరా తననే చూస్తూ ఈ జగాన్ని జయించిన అనుభూతికి లోనవుతున్నాడు. రసమయంగా ఉన్న వాతావరణం, పులకలు వేస్తున్న హృదయోత్సాహంలో ఉరకలు వేస్తున్న ఆనందరావు ఆలోచనలకి కళ్లెం వేసింది కూతురు తన్మయ వైపుగా సాగిన మనసు. ‘పాపం తన్మయ.. తానొంటరి.. అందునా రజస్వల.. ఎలా ఉందో.. ఏం చేస్తోందో.. హెచ్చరిస్తోంది తనలోని తండ్రికి మనసు.
అంతే మరుక్షణమే ఆనందరావు తన్మయ గదివైపుగా వెళ్లాయి ఆనందరావు కాళ్లు, కళ్లు. తన్మయ కనె్న కలువ.. విరబూసిన రోజా మొగ్గ.. ప్రాయాన్ని దాచే అనుభవం కూడా లేక నిద్రమత్తు యవ్వనాన్ని బయటేస్తుంటే తొలగిన రగ్గుని సరిచేసి నిండుగా కప్పి తృప్తిగా తన గదికి వెళ్లి నిద్ర కుపక్రమించాడు ఆనందరావు.
‘అయ్యగారు.. కాఫీ..’ అంటూ ఉదయమే రత్తి ఎదురుగా ట్రేతో ప్రత్యక్షమయ్యింది. పక్కకి చూస్తే అప్పటికే పరిమళ లేచి వెళ్లిపోయినట్లుంది. ఆనందరావు నురగలు కక్కుతున్న కాఫీ అందుకుంటూ అదోలా చూశాడు రత్తి వైపు - క్రితం రాత్రి ఏమీ జరగనట్టు, తానేమీ ఎరగనట్టు పనులన్నీ చేసుకుంటూ పోతోంది రత్తి.
సృష్టి ఒక వింత - రాత్రి పగలు ఒకేలా ఉంటే థ్రిల్ ఏముంటుంది - పగలు పనిపాటలకి పొద్దు పొడుపు, రాత్రి ఆటపాటలకి ఆటవిడుపు, సయ్యాటలకి మేలుకొలుపు. పరిమళ ఏమీ ఎరగనట్టుగా, తనని పట్టీపట్టనట్టుగా ఎలా ఇంటి పనులు చేసుకుంటూ పోతోందో - ఇల్లేగా స్వర్గసీమ!!
ఆనందరావు స్నానాదికాలు ముగించుకుని, డ్రెస్సప్పయి వచ్చేటప్పటికి బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయ్యింది. డైనింగ్ టేబిల్ చుట్టూరా ముగ్గురం చేరిపోయాము. పరిమళ రొటీన్‌గా తన్మయకి, నాకూ వడ్డిస్తూ తనూ టిఫిన్లు వడ్డించుక్కూర్చుంది. ఇంత చేస్తున్నా తనని ఏ మాత్రం గమనించనట్లుగా ఉంది. బహుశా తన్మయ కోసమేమో.. లేకుంటే తన్మయలో ఒంటరి ఆలోచన చోటు చేసుకుంటుంది.
తన్మయకి ఇప్పుడిప్పుడే వయసు తెలుస్తోంది. యవ్వనం మనసు తెరలు తీస్తోంది - తను మానో, మాకో కాదు కదా!! తన కనె్న మనసుకీ, కలలు కనే కళ్లున్నాయి - చెవులుండే మనసూ ఉంది. మనసెటు లాక్కెళ్తే వయసటు పరిగెట్టే ప్రమాదం పొంచీ ఉంది. ఇరు జంటల నడుమ తానొంటరి అన్న భావన ఎంత మాత్రం రాకూడదు తనకి. తన దృష్టిని కెరీర్ వైపుగా మళ్లించాలి. తను జీవితంలో స్థిరపడాలంటే, ఉన్నతాభ్యాసానికి సరిపడ వాతావరణం ఏర్పరచాలి.. ఎస్... ఏర్పరచాలి. పరిమళతో మాట్లాడి మకాం ఊళ్లో ఉన్న ఇంటికి మార్చాలి. అక్కడైతే తన ఈడు వాళ్లతో కలిసిపోయి ఒంటరితనాన్ని మరిచిపోతుంది, చదువులో మునిగిపోతుంది, ముందుకెళ్తుంది.
ఇక్కడే ఈ వాతావరణంలో మా మధ్య ఉంటే, కనె్న మనసులో అలజడి.. ఏవో కోరికలు, కవ్వింతలు. అవి నెరవేరటానికి ఇంకా సమయం ఉంది. తను సాధించాల్సినవన్నీ సాధించాక తన్మయ సుఖాల తీరంలో, ఆనంద కాసారంలో ఓలలాడటానికి ఈ వాతావరణం అప్పుడు అవసరం. అసలు సముద్ర తీరంలో, ఈ ఏకాంత వాసం, ఈ భవన నిర్మాణం తన కోసమే.
బహుశా తన పదవ యేట అనుకుంటా, తన్మయ సముద్రం పైన ఓడ ఇళ్లల్లో ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఫీలయ్యింది.. ఎంతో ఎంజాయ్‌మెంట్ తన కళ్లల్లో చూశాడు తను.. నిత్యం తన కళ్లల్లో ఆ మెరుపు, ఆ చురుకు చూడాలన్న అనే్వషణలో రూపుదిద్దుకున్నదే ఈ తోట బంగళా - తన్మయ గిఫ్ట్‌గా అందించాడు తండ్రి ఆనందరావు తృప్తి నిండిన హృదయంతో. ఆనందరావు అంతే గ్రాండ్‌గా గృహ ప్రవేశం చేశాడు తన హోదాకి తగ్గట్టుగా, అందునా తను లీడింగ్ సివిల్ అండ్ క్రిమినల్ లాయర్. కళ్లకి కట్టినట్లైంది ఆనందరావుకి గతమంతా.
ఓ మంచి గడియలో ఆనందరావు తన ఆలోచన (గృహ మార్పిడి) ఊళ్లో ఇంటికి తన్మయ (మానసిక వికాసానికి) దృష్ట్యా పరిమళ చెవిన వేశాడు. విన్నదే తడవుగా పరిమళ ఆనందరావు నిర్ణయాన్ని బలపరచింది ముందుచూపుతో. ‘చూడు పరిమళ.. రత్తి రాంబాబులకి గది హద్దు గీసి, అది దాటి రావద్దని, బట్టబయలు కావద్దని చెప్పటం పెద్ద విషయం కాదు. కాని తన్మయ కనె్న మనసుకి, అదే వయసుని చేసే సందడికి కంచె వెయ్యలేము సరికదా, మన మధ్య తను ఒంటరి అన్న ఫీలింగ్ చాలు తనని మనస్తాపానికి గురి చేయడాన్కి.
అందుకే తన దృష్టి వ్యాపకాల మీదకి, చదువు మీదకి మళ్లుతుంది తన ఈడు స్నేహితుల మధ్య ఉంచితే. అది ఈ మారుమూల ఈ ఏకాంత వాసంలో సాధ్యం కాదు - అప్పుడు తనని ఒంటరితనం ఆవహించదు అంటుంటే ఆనందరావు పరిమళ ‘నిజమే, మీది సరియైన సమయంలో సరియైన నిర్ణయం..’ అంటూ నర్తవైపు తృప్తిగా చూస్తూండిపోయింది పరిమళ.
‘పూవై విరిసిన పున్నమి వేళ..’ ఆనందరావు పూ వంటి మనసులో సున్నితమైన, విచక్షణాత్మకమైన ఆలోచన విరిసింది.. తన్మయ భావి జీవితానికి బంగరు బాటలు వేసింది.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505