S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (31-3-2019 నుంచి 6-4-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. వత్తిడులుంటాయి. పదోన్నతులపై దృష్టి. తండ్రి వర్గానికి సంబంధించిన వారి కార్యాలుంటాయి. ఆహార విహారాలు, గృహ వాహనాది సౌకర్యాల గూర్చి చర్చిస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత వత్తిడి తప్పకపోవచ్చు. వారం మధ్యలో అన్ని ప్రయోజనాలపై దృష్టి. లాభాలు ప్రభావితం చేస్తాయి. శ్రమతో ఫలితాలుంటాయి. సంతాన వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. అనవసరమైన వార్తలు ఇబ్బంది పెట్టే సూచనలు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సమున్నతమైన ఆలోచనలు, విద్యావకాశాలు వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు తప్పవు. బిల్లులు, టాక్స్‌లు ముందుగానే చెల్లించడం మంచిది. పరామర్శలకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో అనవసరపు పోటీలుంటాయి. వ్యక్తిగత విమర్శలకు అవకాశం. వ్యతిరేకతలను తట్టుకోవాలి. నిర్ణయాత్మకమైన కృషి చేయాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. గుర్తింపు లభ్యం. ఖర్చులు చేయాలి. సౌఖ్యంపై దృష్టి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ఆహార విహారాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో గడిపే ప్రయత్నం. కొత్త వ్యాపారాదులపై దృష్టి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నిర్ణయాత్మక శక్తిగా మారే ప్రయత్నం. లాభాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. వారాంతంలో కొంత శ్రమ తప్పదు. అనుకోని ఇబ్బందులు. అనారోగ్యాలు, అవమానాలకు అవకాశం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం. మాట తీరు వల్ల అనుకూలత. కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. నిర్ణయాదుల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమించాలి. నూతన కార్యక్రమాలపై దృష్టి. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. స్ర్తి వర్గ, వ్యాపార వర్గాలతో అనుకూలత. ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. ఆత్మవిశ్వాసంతో మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహ వాహనాది వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. గౌరవాన్ని పెంచుకుంటారు. సుదూర ప్రయాణాలపై ఆసక్తి. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి. దైవ దర్శనం, ధార్మిక ప్రయాణాలకు అవకాశం. సంప్రదింపులకు అనుకూలం. నూతన వార్తలు ప్రభావితం చేస్తాయి. సహకారం లభిస్తుంది. నిర్ణయాదుల్లో తొందరపాటుకు అవకాశం. జాగ్రత్త. వారం మధ్యమంలో ఉద్యోగాదులపై దృష్టి. పదోన్నతులుంటాయి. శ్రమ తప్పకపోవచ్చు. అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలుంటాయి. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త వహించాలి. మాటల్లో అనిశ్చితికి అవకాశం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలను చూస్తారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ప్రణాళికలకు రూపకల్పన. సంతాన వ్యవహారాలపై దృష్టి. సృజనాత్మకత పెంచుకుంటారు. లాభాలు పెంచుకునే అవకాశం. ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. ఆలోచనలు ఫలిస్తాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఉన్నత వ్యవహారాల విషయంలో తొందరపాటు కూడదు. దైవ దర్శనాదుల వల్ల మేలు. వారం మధ్యమంలో పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం. చికాకులను అధిగమించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఎక్కువ. బాధ్యతలు అధికం. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలపై దృష్టి. పనులను నిర్వహించడంలో నేర్పు ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. పాత స్నేహితులు గుర్తుకు వస్తారు. ఆలోచనల్లో కొంత తొందరపాటు ఉంటుంది. సంతాన వర్గంతో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఆర్థిక వ్యవహారాలపై దృష్టి. నిల్వధనం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మాట తీరులో చమత్కార ధోరణి. సంతోషం. కొన్ని ఇబ్బందులను ఊహిస్తారు. సమస్యగా భావిస్తారు. నష్టాలు కష్టాలను కొని తెచ్చుకుంటారు. జాగ్రత్త. వ్యతిరేకతలు అధికం. గుర్తింపు లభిస్తుంది. ధార్మికమైన దానాదులు శ్రేయోదాయకం. వారాంతంలో అధికారికమైన సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు కూడదు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి. అనారోగ్య భావనలకు అవకాశం. కుటుంబంలో ఒత్తిడులకు అవకాశం. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులుంటాయి. నిద్రా సౌఖ్యలోపం. వారం మధ్యమంలో సుదూర లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. ప్రయాణాలకు అవకాశం. సంప్రదింపులకు అనుకూలం. కమ్యూనికేషన్స్ వల్ల సంతృప్తి. నిర్ణయాదుల్లో కొంత అనిశ్చితి ఉంటుంది. మరొకరి సపోర్ట్ అవసరం. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పదోన్నతులకు అవకాశం. అధికారులతో గుర్తింపబడతారు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా సౌఖ్యంపై దృష్టి. సంతోషంగా గడుపుతారు. విద్యా వ్యవహారాల్లో కొంత పురోగతి. వృత్తి ఉద్యోగాదుల్లోనూ అనుకూలత. సామాజిక హోదా పెంచుకుంటారు. కొన్ని ప్రమాదాలకు అవకాశం. ప్రయాణాదుల్లో జాగ్రత్తగా మెలగాలి. వారం మధ్యమంలో మానసిక సంతృప్తి. ఆలోచనలకు రూపకల్పన. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతాన వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలుంటాయి. సుదూర ప్రయాణ భావనలు. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో శత్రు, రుణ, రోగాదులు ప్రభావితం చేస్తాయి. అప్పులను అధిగమించాల్సి ఉంటుంది. పోటీలు, ఒత్తిడులు, చికాకులున్నా గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణ దక్షత.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు ప్రభావితం చేస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. విహారాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది. పోటీలు, రుణాలపై ప్రత్యేక దృష్టి. సౌకర్యాదుల విషయంలో జాగ్రత్త. శ్రమాధిక్యం. శారీరక ఒత్తిడులుంటాయి. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలుంటాయి. భాగస్వామ్యాల్లోనూ అనుకూలత. ఆలోచనలు అనేక రూపాల్లో విస్తరిస్తాయి. లాభాలపై దృష్టి. గౌరవం పెంచుకుంటారు. శ్రమ తప్పకపోవచ్చు. కార్యనిర్వహణ దక్షత. వారాంతంలో మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. మాటల్లో కొంత అధికారిక ధోరణి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో పరిచయాలు పెంచుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభంపై దృష్టి సారిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యనిర్వహణ బాధ్యతలపై దృష్టి. లాభాలున్నా తొందరపాటు కూడదు. శ్రమతో ఫలితాలుంటాయి. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు. ఆర్థిక నిల్వలపై వ్యతిరేక ప్రభావం. మాట తీరువల్ల ఇబ్బందులు. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. కానీ అభీష్టాలు, ప్రణాళికలు కొన్ని నెరవేరుతాయి. సంతానంతో అనుకూలత. వారాంతంలో విద్యాత్మక వ్యవహారాలపై దృష్టి. వైజ్ఞానిక, ఆధ్యాత్మికాంశాలను చర్చిస్తారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. కొత్త వార్తలు సంతోషాన్నిస్తాయి. దూర లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలుంటాయి. ఉన్నత విద్యలపై దృష్టి సారించవచ్చు. సోదర వర్గంతో అనుకూలత. స్ర్తివర్గ సంతృప్తి. భాగస్వామ్యాల్లో తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యం కోసం శ్రమిస్తారు. మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాదులలో అనుకూలత. సామాజిక గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. కుటుంబంలో శుభ పరిణామాలుంటాయి. వారాంతంలో మానసిక సంతోషం. ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. కొత్త పనులపై దృష్టి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. కానీ ప్రయోజన దృష్టి అంత మంచిది కాదు. అభీష్టాలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానవర్గ అనుకూలత. వ్యవహార విజయం. సంతోషంగా గడుపుతారు. సంప్రదింపుల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. సోదర వర్గంతో జాగ్రత్త. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. అనేక కార్యక్రమాల కోసం ధనం కాలం వెచ్చిస్తారు. పోటీలు ఒత్తిడులున్నా వ్యతిరేకతలున్నా విజయ సాధనపై దృష్టి. ప్రయాణాలకు అవకాశం అధికం. సౌకర్య లోపాలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. గుర్తింపు. వారాంతంలో నిర్ణయాదులకు రూపకల్పన. అనేక రకాల బాధ్యతల నిర్వహణ. పనుల ఒత్తిడి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744