S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాగిరేకులు.. లాటరీలు

బ్బుకు సంబంధించి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి. మీ భవిష్యత్తు నిర్ణయించేది ఇలాంటి ఆలోచనలే. ఆలోచనలు సక్రమమైన మార్గంలో వెళుతున్నాయా? లేదా? మీకు మీరే తేల్చుకోండి.
ప్రవీణ్‌ది దిగువ మధ్యతరగతి కుటుంబం. తిండికి ఇబ్బంది లేకపోయినా కోరికలను అణిచిపెట్టుకోక తప్పని కుటుంబం. పెద్ద కుటుంబం ఆశలు తీరే అవకాశాలు అంతంత మాత్రమే. చిన్నప్పటి నుంచే కలల్లో మునిగిపోయేవాడు. ఒక సంపన్న కుటుంబం తనను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తుందని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. అతనికి అలాంటి కలలు రావడానికి కారణం పేదరికం నుంచి ఎలా బయటపడాలో తెలియక పోవడం. సంపాదించే వయసు లేకపోవడం, సంపాదనా మార్గాలు తెలియక పోవడం. దాదాపుగా చదువు ముగించి ఉద్యోగంలో చేరేంత వరకు ప్రవీణ్‌కు ఇలాంటి కలలే వచ్చేవి. ఉద్యోగంలో చేరిన తరువాత ఇలాంటి కలలు రాలేదు. కానీ జీవితంలో ఎలా బాగుపడాలా? అనే ఆలోచనలు మొదలయ్యాయి. బాల్యంలో చదువుకునే రోజుల్లో పదే పదే తనకు ఎందుకలా సంపన్న కుటుంబం దత్తత తీసుకుంటున్నట్టు కలలు వచ్చేవని తనలో తానే నవ్వుకునేవారు.
***
సుధాకర్ చిరుద్యోగి. ఎప్పుడూ కలల్లో మునిగిపోతారు. లాటరీలపై బాగా నమ్మకం. ఏదో ఒక రోజు తాను సంపన్నుడిని అవుతానని అతనికి గట్టి నమ్మకం. దాని కోసం లాటరీలను నమ్ముకున్నాడు. ఈ లాటరీలు తనను ఏదో ఒక రోజు సంపన్నుడిగా మారుస్తాయని, చిరుద్యోగి దశ నుంచి సంపన్నుడిగా మార్చేందుకు అతనికి తెలిసిన ఏకైక మార్గం లాటరీ. లాటరీల పై తనకున్న మోజును చిన్నచూపు చూసిన వారే తనకు లాటరీ తగిలిన తరువాత తనను ప్రసన్నం చేసుకోవడానికి తన వెంట పడతారని కలలు కనేవారు. లాటరీ టికెట్లకు చేతి చమురు వదలడమే తప్ప ఎన్ని సంవత్సరాలు గడిచినా అతన్ని లాటరీ వరించలేదు. సంపన్నులు దత్తత తీసుకొంటారని, లాటరీ వరిస్తుందని కలలు కనే ప్రవీణ్, సుధాకర్‌లు మన చుట్టూ చాలా మందే ఉంటారు.
ఏదో పూజ చేయిస్తే సంపద చేకూరుతుందని, రంగురాళ్ల ఉంగరాలు ధరిస్తే సంపన్నులు అవుతామని, పేరులో అక్షరాలు మార్చుకుంటే కోటీశ్వరులం అవుతామని భావించేవారు చాలా మంది ఉంటారు. పావలా ఖరీదు చేయని రంగు రాళ్లను, రాగి రేకును ఇలాంటి వారికి వందల రూపాయలకు, వేల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకునే వారు ఏదో ఒక రోజు సంపన్నులు అవుతారేమో కానీ వాటిని కొన్నవాళ్లు కారు. నిజానికి సంపద అనేది రాళ్లు ధరిస్తే రేకులు కట్టుకుంటే రాదు. సంపద మన ఆలోచనల్లో ఉంటుంది. లాటరీ ఆశలు, దత్తత కలలు, రాగిరేకులతో సంపన్నులు అవుతారని ఆలోచించడం మన ఆలోచనల్లోని లోపం.
రాగిరేకుల్లోనే కోట్ల రూపాయల సంపద దాగి ఉంటే వాటిని మనకెందుకు అమ్ముతారు ఆ రేకులేవో వాళ్లే ధరించి నిమిషాల్లో సంపన్నులు అవుతారు.
ఇలాంటి రక్ష రేకులు, రాగిరేకులు, తాయత్తుల ప్రకటనలు టీవీల్లో మనం చూసే ఉంటాం. ఇంకా చిత్రమైన విషయం ఏమంటే మనకు కొన్ని వందల చానల్స్ ఉన్నాయి. పెద్దగా జనాదరణ లేని చానల్స్‌లోనే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు వస్తాయి. నిజంగా వాటికి అంత శక్తి ఉంటే ఆ చానల్ వాళ్లు ఆ రేకులు, తాయత్తులు వాళ్లే ధరించి వాళ్ల చానల్స్‌ను టాప్ రేంజ్‌కు తీసుకు వెళ్లవచ్చు కదా? పెద్దగా ప్రజలు చూడని చానల్స్‌లో తక్కువ ధరకు ఈ ప్రకటనలు ప్రసారం చేస్తారు. ఈ ప్రకటనలు చూసి ఒకరిద్దరు బోల్తా పడినా తమ ఖర్చు వెళ్లిపోతుంది అందుకే ఇలాంటి చానల్స్‌లో ప్రసారం చేస్తారు.
సంపన్నుల ఆలోచన, పేదరికంలో మగ్గిపోయే వారి ఆలోచనల్లో తేడా ఉంటుంది. దీనికి సంబంధించి చాలా మంది సంపన్నులు, పేదవారి అలవాట్లను చాలా కాలం అధ్యయనం చేసి స్టేవ్ అనే రచయిత హౌ రిచ్ పీపుల్ థింక్ అనే పేరుతో సంపన్నుల ఆలోచనా తీరుపై ఒక పుస్తకం రాశారు.
టైంకు డబ్బుకు సంబంధం ఉంటుందని సామాన్యులు భావించి, ఎక్కువ సమయం కష్టపడడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనుకుంటారట! కానీ సంపన్నులు మాత్రం టైమ్‌కు సంపదకు సంబంధం లేదు. టైమ్‌తో డబ్బు రాదు ఆలోచనతో వస్తుందని భావిస్తారట! ఈ ఆధునిక కాలంలో నిరంతరం శ్రమించడం కన్నా ఒక ఐడియాలతో సంపన్నులు అయిన వారు ఎందరో ఉన్నారు. సరే అందరికీ అలాంటి ఆలోచనలు రాకపోవచ్చు. కానీ మనం శ్రమిస్తేనే డబ్బు వస్తుందనే ఆలోచన కన్నా మన డబ్బు కూడా మన కోసం పని చేసే విధానం గురించి ఆలోచించాలి.
పేదవారు తన ఖర్చును తగ్గించుకోవడం ద్వారా పొదుపు చేసి, ఆ పొదుపునే సంపదగా భావిస్తారు. కానీ ఆ పొదుపును ఇనె్వస్ట్‌మెంట్‌గా మారిస్తేనే సంపద సమకూరుతుందని భావించే వాళ్లే సంపన్నులు అవుతారు. లాటరీలు, జోస్యాలపై ఎవరి నమ్మకాలు వారివే కానీ అవేవీ మిమ్ములను సంపన్నులుగా మార్చవు. మీ ఆలోచనలు, మీ పెట్టుబడి మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది. ఫార్మల్ చదువు వల్ల ఒక ఉద్యోగం లభిస్తుందేమో కానీ సంపన్నులు కావాలంటే మాత్రం వినూత్నంగా ఆలోచించగలగాలి.
డబ్బు విషయంలో సామాన్యుల్లో భయాలు ఎక్కువగా ఉంటాయి. పొదుపు చేసిన డబ్బును అమ్మో ఎవరినో నమ్మి ఇనె్వస్ట్ చేయం, అవి పోతే ఎలా అని సామాన్యులు భయపడతారు. సంపన్నులు అయ్యే వాళ్లు మాత్రం క్యాలుక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. రిస్క్‌ను బట్టే రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ తీసుకోలేని వారు జీవిత కాలమంతా సామన్యులుగానే ఉండిపోవలసి వస్తుంది. రిస్క్‌ను బట్టే సంపద చేకూరుతుంది. సంపన్నులు అన్ని కోణాల్లో ఆలోచించి రిస్క్ తీసుకుంటారు. దానికి తగిన ప్రయోజనం పొందుతారు. యూనివర్సిటీల చదువు, పిహెచ్‌డిల వల్ల సంపదన చేకూరదు. వినూత్న ఆలోచనా పరులే సంపన్నులు అవుతున్నారు. రిస్క్ లేనిదే ఎదుగుదల లేదు. మీ ఆలోచనలు రాగిరేకుల చుట్టూ తిరుగుతున్నాయా? వినూత్న ఆలోచనల ద్వారా నిజాయితీగా ప్రయత్నించడం ద్వారా సంపన్నులు కావచ్చు అనే ఆలోచనల చుట్టూ తిరుగుతున్నాయా? మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

-బి.మురళి