S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అతి మామూలు మనుషులు(సండేగీత)

‘అతి మామూలు మనుషులు’ ఎవరూ అన్న ప్రశ్నని ఈ మధ్య అడిగాడు. వెంటనే సమాధానం స్ఫురించలేదు. కాస్సేపు ఆలోచించిన తరువాత అతి మామూలు మనుషులు ఎవరో అర్థమైంది.
కొంతమంది అస్తమానం టీవీని చూస్తూ ఉంటారు. ఏ సీరియలూ మిస్ కారు. సినిమాలు కూడా. ఇప్పుడు పరిస్థితి మారింది. కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు. అది స్మార్ట్ఫోన్లు, మొబైల్ డేటా వచ్చిన తరువాత ఈ కొత్త మనుషుల సంఖ్య పెరిగింది. వీళ్లు అస్తమానం వాట్సప్‌లని చూస్తూ ఉంటారు. ఇంకా ఏవో పనికిమాలిన వీడియోలను చూస్తూ ఉంటారు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లలో ఓ కొత్త ఫీచర్ వచ్చింది. ఎంతసేపు ఫోన్ తెరని చూశారో తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులు అతి మామూలు మనుషులు.
వీళ్లే కాదు. ఎలాంటి పుస్తకాలు చదువకుండా సరైన వ్యాయామం చేయకుండా, అతిగా తినే వ్యక్తులు ఉంటారు. వీళ్లు కూడా అతి మామూలు వ్యక్తులే.
ఎవరైనా మంచి పని చేస్తే ప్రశంసించకుండా ఎప్పుడూ విమర్శించే వ్యక్తులు మరి కొంతమంది వుంటారు. అదే విధంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు, ఉబుసుపోని ముచ్చట్లు చెప్పే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు.
ఇతరుల పట్ల ఏర్పడిన చెడు అభిప్రాయాన్ని ఏళ్ల తరబడి కొనసాగించే వ్యక్తులు కూడా అతి మామూలు వ్యక్తులే!
సమయాన్ని వృథా చేసే వ్యక్తులు, తాము చేస్తున్న పనిలోని మంచిని చూడకుండా, చెడుని మాత్రమే చూసే వ్యక్తులు ఇట్లా ఎన్నో విషయాలు చెప్పి అతి మామూలు వ్యక్తులని గుర్తించగలం...
‘అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు’ అన్నాడు ఓ సినిమా పాటలో కవి. మూర్ఖుడు అనే బదులు అతి మామూలు వ్యక్తి అంటే సరిపోతుందేమో!
గొప్ప వ్యక్తులయినా కాకపోయినా ఫర్వాలేదు. కానీ అతి మామూలు మనుషులుగా వుండకూడదు. ఏమంటారు..?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001